
BJP Congress Sparkclashes in Nalgonda : ప్రజా దీవెన, నల్ల గొండ: నల్లగొండ జిల్లాకేంద్రంలో రాజకీయ వా తావరణం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ, కాంగ్రెస్ కార్యకర్త ల మధ్య చోటు చేసుకున్న ఘర్షణతో నల్లగొండలో తీవ్ర ఉద్రి క్త పరిస్థితులు నెలకొన్నాయి. పరస్పరం రాళ్లు రువ్వుకోవ డంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించగా.. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళన కారులను చెదరగొట్టారు.రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కో మటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంప్ కార్యాలయం సమీపంలో బీజేపీ నాయకులు ఆందోళన చేపట్టినట్లు సమా చారం. ఈ సందర్భంగా మంత్రి కోమటి రెడ్డి భారీ కటౌట్ ను దహనం చేయడంతో పాటు, కార్యా ల యంపైకి కోడి గుడ్లు, టమాటాలు విసిరినట్లు కాంగ్రెస్ నాయ కులు ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేశాయి. అనం తరం బీజేపీ కార్యాలయం వైపు కాంగ్రెస్ కా ర్యకర్తలు వెళ్లేం దుకు ప్రయత్నించడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఇరువర్గాల మధ్య తోపులాట, వాగ్వాదం చోటు చేసుకోవడం తో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.
బీజేపీ కార్యాలయం ముట్టడికి యత్నం
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇంటిపై జరిగినట్లు చెబుతు న్న దాడిని నిరసిస్తూ మాజీ చైర్మన్ బుర్రి శ్రీనివాస్‌రెడ్డి ఆధ్వ ర్యంలో కాంగ్రెస్ శ్రేణులు బీజేపీ కార్యాల యం వైపు వెళ్లేందు కు ప్రయత్నించినట్లు సమాచారం. పోలీసులు అడ్డుకోవడం తో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.డీఎస్పీ శివ రాం రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు భారీగా మోహరించి ఆందోళన కా రులను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. బీజేపీ నాయకుల ఫ్లెక్సీ లను కాంగ్రెస్ కార్యకర్తలు చించి వేయడంతో పరిస్థితి మరింత వేడెక్కింది.
నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై దాడి ఆరోపణలు
మరోవైపు, మంత్రి క్యాంప్ కార్యా లయం వద్ద జరిగిన ఘట నకు ప్రతిచర్యగా నల్లగొండ బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇం టిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి ప్రయత్నించి నట్లు బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి. అయితే ఈ ఘటన కు సంబంధించిన పూర్తి వివరాలు అధికారికంగా వెల్లడి కా వాల్సి ఉంది.
బిభారీగా పోలీసుల మోహరింపు
పరిస్థితిని అదుపులోకి తీసుకు నేందుకు గడియారం సెంట ర్, ఇందిరా భవన్ పరిసరాల్లో పోలీసులు భారీగా మోహరిం చారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారా లను పరిశీలిస్తూ బాధ్యులపై చర్యలకు పోలీసులు సిద్ధమ వుతున్నట్లు సమాచారం.ఇరువర్గాలు పరస్పరం ఆరోపణ లు చేసుకుంటుండటంతో నల్లగొండలో రాజకీయ ఉద్రిక్తత కొనసాగుతోంది. ఎలాంటి అ వాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉన్నారు.అసలు ఘటన లో ఏం జరిగింది? ఎవరి ఆరోప ణల్లో నిజమెంత? పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అనే దా నిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






