Praja Deveena
Newspaper Banner
Date of Publish : 30 September 2026, 2:45 pm Posted by : praja deveena

Bjp fires on Congress Government Failures : బిజెపి స్టేట్ చీఫ్ ఆర్విఆర్ కీలక వ్యాఖ్య, కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యoతో ఎండిన పంటలు, విద్యు త్, సాగునీటి సంక్షోభం

Bjp fires on Congress Government Failures : ప్రజా దీవెన, నాగార్జునసాగర్: తెలంగాణలో పంట లు ఎండిపో తున్నా ప్రభుత్వం ముందస్తు ప్ర ణాళికతో వ్యవ హరించలేదని బీ జేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాం చందర్ రావు ఆరోపించా రు. కాం గ్రెస్ ప్రభుత్వ అసమర్థత, ముం దుచూపులేని విధా నాల కారణం గానే సాగు, తాగునీరు, విద్యుత్ సమస్యలు తీవ్ర రూపం దాల్చాయని విమర్శించారు. నల్గొండ జి ల్లాలోని కనగల్, నల్గొండ రూరల్ మండలాలు, చిన్న మాదారం త దితర ప్రాంతాల్లో ఎండిన పంట పొలాలను పరిశీలించిన ఆయ న.. బోరుబావులపై ఆధారపడి సాగు చే స్తున్న రైతుల పరిస్థి తిని స్వయంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం నాగార్జు నసాగర్‌ లో నిర్వహించిన మీడియా స మావేశంలో ఆయన మాట్లాడారు.

ప్రభుత్వం 12 నుంచి 15 గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నా మని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో రైతులకు గరిష్టంగా ఐ దు గంటలవరకు మాత్రమే విద్యుత్ అందు తోందని రాంచం దర్ రావు పేర్కొన్నారు. తరచూ ట్రిప్పింగ్‌లు, బ్రేక్‌ డౌన్లతో బోర్ల నుంచి నీటిని తోడు కోలేక పంటలు కళ్లముందే ఎండి పోతు న్నాయని తెలిపారు.

   కేంద్రoతో పంట నష్టం అంచనా వేయాలి

ఎల్-నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ముందుగానే ఉన్నప్పటికీ ప్ర భు త్వం తగిన ముందస్తు చర్య లు తీసుకోలేదని ఆయన ఆరోపిం చారు. కర్ణాటక తరహాలో కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి రప్పించి పంట నష్టాన్ని సమగ్రంగా అంచ నా వేయించాలని, రైతులకు రా ష్ట్ర ప్రభుత్వం తక్షణ పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.రైతులను పంటలు వేయవద్దని చెప్పడం మాత్రమే కాకుండా ప్ర త్యామ్నాయ పం టలు, ఆరుతడి పంటలు, కూరగాయలు, వైవిధ్య మైన సాగు విధానాలపై ఎఫ్‌పీవో లు, వ్యవసాయ అధికారుల ద్వా రా అవగాహన కల్పించాలని సూ చించారు.

  తెలంగాణ నీటి వాటాపై రాజీవద్దు

నాగార్జునసాగర్‌ నుంచి హైదరా బాద్‌కు తాగునీరు సరఫరా అవు తున్న నేపథ్యంలో రాబోయే రో జుల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం ముందస్తు చ ర్యలు చేపట్టాలని రాం చందర్ రావు కోరారు.ఆల్మట్టి,నారాయణపూర్ రిజర్వాయర్లలోని నీటిని దిగువకు విడుదల చేయించేలా ఒత్తి డి తీసుకురావాలని అన్నా రు.కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ స మావేశాల్లో తెలంగాణకు న్యా యంగా దక్కాల్సిన కృష్ణా జలా ల విషయంలో ఎలాంటి రాజీ లేకుం డా బలమైన వాదనలు వినిపిం చాలని డిమాండ్ చేశారు. వెలిగొండ ప్రాజెక్టు ద్వారా ఏ పీకి తె లంగాణ నికరజలాలు తరలుతు న్నాయన్న అంశంపై ప్రభుత్వం వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరారు.

కాళేశ్వరం నివేదికలు బహిర్గతంచేయాలి

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై జస్టిస్ పీసీ ఘోష్ క మిషన్ నివేదికతో పాటు ఎన్‌డీ ఎస్‌ఏ సూచనలను ప్రభుత్వం ప్రజల ముందుంచాలని రాంచం దర్ రావు డిమాండ్ చేశారు. బ్యారేజీల మరమ్మతులు, భవి ష్యత్ వినియోగంపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని అన్నారు.చిన్న ప్రాజెక్టుల మరమ్మతులు, పూడికతీత పనులను నిర్లక్ష్యం చేయడం వల్లే నీటి సమస్యలు మరింత తీవ్రమయ్యాయని ఆ యన ఆరోపించారు. జూరాల, నెట్టెంపాడు, డిండి, కల్వకుర్తి,ఆ ర్డీఎస్ వంటి ప్రాజెక్టుల సామ ర్థ్యాన్ని పూర్తిస్థాయిలో వినియోగిం చుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

విద్యుత్ సంక్షోభంపై ప్రభుత్వాన్ని నిలదీత

రాష్ట్రంలో విద్యుత్ కొరతకు బొ గ్గు కొరతను కారణంగా చూప డం సరికాదని ఆయన అన్నారు. సిం గరేణి, జెన్‌కో, డిస్కమ్‌ల సమ న్వయంతో పాటు హైడల్, సో లార్, ఇతర విద్యుత్ వన రులను సమర్థంగా వినియోగించు కోవ డంలో ప్రభుత్వం విఫ లమైందని విమర్శించారు.రైతుల పంటలు ఎండిపోతున్న పరి స్థితుల్లో ప్రభు త్వం వెంటనే స్పందించి పంట న ష్టాన్ని అంచనా వేయడంతో పా టు పరిహారం అందించాలని, సా గు-తాగునీరు, విద్యుత్ సమస్య లకు శాశ్వత పరిష్కారం చూపా లని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.