Praja Deveena
Newspaper Banner
Date of Publish : 14 June 2026, 11:35 am Posted by : praja deveena

Bjp G. Kishan Reddy : బిగ్ బ్రేకింగ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పవర్ ఫుల్ వ్యాఖ్య, ‘నన్ను తరిమికొట్టే మొగోడు ఇంకాపుట్టలేదు

Bjp G. Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాజకీయాల్లో కాక రేపుతోంది ‘మెట్రో’వార్. ముఖ్యమం త్రి రేవంత్ రెడ్డి విసిరిన సవాళ్లకు కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి అంతే ఘాటుగా బదులిచ్చారు. ఆదివారం ప్రెస్ మీట్‌లో రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరుగుతూ సం చలన వ్యాఖ్యలు చేశారు.

రాజకీయ సెగలు రేపుతున్న కిషన్‌ రెడ్డి వ్యాఖ్యలు హైదరా బాద్ ఇలా ఉన్నాయి. మెట్రోరై ల్‌ ప్రాజెక్ట్‌కి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వలేదని నిరూపిస్తే నేను ఇప్పుడే నాపదవికి రా జీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నానని మరి ఆరు గ్యారం టీలు, ఇచ్చిన హామీలను అమలు చేయని మీరు రాజీనా మా చేస్తారా?”అంటూ సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూటిప్రశ్న వేశారు.

నన్నుతరిమికొట్టేటోడు ఈగడ్డపైనే లేడు

నన్ను హైదరాబాద్ నుంచి తరిమి కొడతా అంటున్న రేవంత్ రెడ్డి వ్యా ఖ్యలపై కిషన్ రెడ్డి తీవ్రంగా స్పం దించారు. నన్ను అడ్డుకునే దమ్ము, ధైర్యం కాంగ్రెస్ పార్టీకి ఉందా? నేను భయ పడి పారిపోవడానికి బి ఆర్ఎస్ కార్యకర్తను కాదు. నేను క రుడుగట్టిన బీజేపీ కార్యకర్తను నన్ను ఈ గడ్డ నుంచి తరిమి కొట్టే వ్యక్తి ఇంకా పుట్టనే లేదని ఘాటుగా స్పందించారు.

     కాంగ్రెస్, BRS దొందూ దొందే

తెలంగాణ ప్రజలను, యువతను కాంగ్రెస్ పార్టీ ఘోరంగా వె న్నుపో టు పొడిచిందని కిషన్ రెడ్డి ధ్వజ మెత్తారు. కాంగ్రెస్, బిఆర్ఎస్ రెండు పార్టీలు ఒకటేనని, లోపాయికారీ ఒప్పం దాలతో నడుస్తున్నాయని ఆరోపించారు.”ఇచ్చిన మాట త ప్పినందుకు ఎవరు రాజీనామా చేయాలో రాహుల్ గాంధీ, రే వంత్ రెడ్డిలే తేల్చుకోవాలని ఎద్దేవా చేశారు.

ఆట మీరు మొదలుపెట్టారు ముగింపు మాదే

చివరగా సీఎం రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి గట్టివార్నింగ్ ఇచ్చా రు. రేవంత్ రెడ్డి ఆట మీరు మొదలుపెట్టి ఉం డొచ్చు కానీ గుర్తుపెట్టుకోండి, 20 28లో ఈ ఆటను ముగించేది మాత్రం ఖచ్చితంగా బీజేపీనే అంటూ హెచ్చరించారు. ఈ పొలిటికల్ ఫై ట్‌తో తెలంగాణ రాజకీయం ఒక్క సారిగా హీటెక్కింది. మరి కేంద్రమంత్రి విసిరిన సవాల్‌పై సీఎం రేవంత్ రెడ్డి టీమ్ ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.