BJP is biased towards women: బిజెపి మహిళా పక్షపాతి
-- ప్రధాని మోధీ చిత్రపటానికి పాలాభిషేకం -- బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి రెడ్డి
బిజెపి మహిళా పక్షపాతి
— ప్రధాని మోధీ చిత్రపటానికి పాలాభిషేకం
— బిజెపి రాష్ట్ర నాయకురాలు శ్రీదేవి రెడ్డి
ప్రజా దీవెన/ నల్లగొండ: దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ కేబినెట్ ఆమోదించడం హర్శనీయమని బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కన్మంత రెడ్డి శ్రీదేవి రెడ్డి పేర్కొన్నారు. మహిళలకు రిజర్వేషన్లు కల్పించడం ద్వారా భారతీయ జనతా పార్టీ మహిళా పక్షపాతి గా నిలిచిందని అభిప్రాయపడ్డారు.
చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడం పట్ల హర్షం వ్యక్తంచేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా అభ్యుదయానికి బిజెపి పార్టీ కట్టుబడి ఉందో మరొకసారి నిరూపితమైందన్నారు.
భారతీయ సంస్కృతికి అనుగుణంగా మహిళలను ఎంతో గౌరవిస్తూ ప్రతి అడుగులో మహిళల పట్ల పక్షపాతం నిరూపించుకున్న పార్టీ బిజెపి పార్టీ అని, భరతమాత ముద్దుబిడ్డ ప్రధాని నరేంద్ర మోడీ అని చెప్పారు.
ఉజ్వల యోజన, స్వచ్ఛభారత్, బేటి బచావో బేటి పడావో, సుకన్య సమృద్ధి యోజన , ట్రిపుల్ తలాక్ రద్దు, కేబినెట్ లో 13 మంది మహిళా మంత్రుల నియామకం వంటి చర్యలతో ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు అత్యంత ప్రాధాన్యం ఇచ్చారన్నారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గార్లపాటి జితేంద్ర కుమార్, వర్షిత్ రెడ్డి, పట్టణమహిళా మోర్చా అధ్యక్షురాలు నేవార్సు నీరజ, మోర్చా ప్రధాన కార్యదర్శి రావిళ్ళ కాశమ్మ, పట్టణ ఉపాధ్యక్షురాలు హైమవతి, మాజీ కౌన్సిలర్ అరుణ, కౌన్సిలర్ ధనలక్ష్మీ వెంకన్న, యాదగిరిచారి, రాజశేఖరరెడ్డి, భవానీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.