BJP is suffocating: బిజెపి ఉక్కిరి బిక్కిరి
--కొనసాగుతోన్న రాజీనామాల పర్వం -- బిఆర్ఎస్, కాంగ్రెస్ లోకి వరుస వలసలు --తాజాగా బిజెపి అధికార ప్రతినిధి రాకేష్ వంతు
బిజెపి ఉక్కిరి బిక్కిరి
–కొనసాగుతోన్న రాజీనామాల పర్వం
— బిఆర్ఎస్, కాంగ్రెస్ లోకి వరుస వలసలు
–తాజాగా బిజెపి అధికార ప్రతినిధి రాకేష్ వంతు
ప్రజా దీవెన/ హైదరాబాద్: తెలంగాణలో ఎన్నికల తొలి ఘట్టమైన అభ్యర్ధుల ఎంపిక పూర్తి కాకముందే రాజకీయాలు కాకపుట్టిస్తున్నాయి. రోజుకో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతున్నాయి. బిఅర్ఎస్, కాంగ్రెస్, బిజెపి పార్టీల్లో అభ్యర్థిత్వం లభించకపోవడంతో అయా పార్టీల్లోని కీలక నేతలు జంప్ ( BRS, Congress and BJP did not get candidature, so the key leaders of those parties jumped) జిలానీలుగా మారుతున్నారు.
ప్రధానంగా బిజెపి కి బుధవారం ఒక్కరోజే ఇద్దరు కీలక నేతలు రాం రాo పలికారు. మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి రాజీనామా బీజేపీకి రాజీనామా చేయగా కొన్ని గంటల్లోనే మరో ముఖ్య నేత పార్టీకి గుడ్ బై ( Former MP Vivek Venkataswamy resigned from BJP and another key leader said goodbye to the party within a few hours) చెప్పారు. రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్న రాకేష్ రెడ్డి బీజేపీకి తాజాగా రాజీనామా చేశారు.
వరంగల్ పశ్చిమ టిక్కెట్ దక్కపోవడంతో రాకేష్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకొని ( Rakesh Reddy took this decision after getting Warangal west ticket) తన కార్యకర్తలతో కలిసి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పొమ్మన లేక పొగ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం ఉదయం మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, ఆయన కుమారుడు వంశీ కూడా బీజేపీకి గుడ్ బై చెప్పారు. గంటల వ్యవధిలోనే ఇద్దరూ కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.
కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేతో ఫోన్లో మంతనాలు జరిపిన వివేక్ రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో (In the presence of Vivek Rahul Gandhi, who had a phone discussion with the National President of the Congress Party, Mallikarjuna Kharge, in the Congress Party) చేరారు. నోవాటెల్ హోటల్లో బస చేసిన రాహుల్ గాంధీని కలుసుకున్నారు. ఆయనతో పాటు తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఉన్నారు.
బీజేపీకి రాజీనామా చేసిన అనంతరం రాకేష్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ కోసం ఎంతగానో పనిచేసినా గుర్తింపు దక్కడం లేదన్నారు. తనకు అర్హత ఉందో లేదో చెక్ చేసిన తరువాత వరంగల్ పశ్చిమ సీటు కేటాయించాలని అధిష్టానాన్ని కోరితే ఏ మాత్రం స్పందన రాలేదని ( There was no response when the leadership was asked to allocate Warangal West seat) రాకేష్ రెడ్డి తెలిపారు.
పార్టీ మీటింగులకు రాకపోతే అడిగే నాథుడు కూడా లేడని, పార్టీ టికెట్ అడగటమే తాను చేసిన పాపం అన్నారు. సర్వే ఆధారంగా టికెట్ ఇస్తామని బీజేపీ పెద్దలు చెబుతున్నా కానీ అది పచ్చిబూటకమన్నారు (BJP leaders say that ticket will be given based on survey but it is a hoax). సర్వేలన్నీ తనవైపే ఉంది, ప్రజల్లోనూ తన పేరు ఉండగా టికెట్ మాత్రం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు.