Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Bjp MP candidate eatela rajendhare : అబద్ధాల పునాదుల పైనే ‘ కాంగ్రెస్’

--అతితక్కువ కాలంలో ప్రజలు చీదరించుకుంటున్నారు --ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించే సత్తా బీజేపీకి మాత్రమే --ప్రజలు ఎప్పుడు ఒకే పార్టీ వైపు కాకుండా డైనమిక్ మారుతారు --గుజ్జల ప్రేమేంధర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి --మాజీమంత్రి ,మల్కాజిగిరి పార్ల మెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్

 

అబద్ధాల పునాదుల పైనే ‘ కాంగ్రెస్’

–అతితక్కువ కాలంలో ప్రజలు చీదరించుకుంటున్నారు
–ప్రజలకు సమర్థవంతమైన పాలన అందించే సత్తా బీజేపీకి మాత్రమే
–ప్రజలు ఎప్పుడు ఒకే పార్టీ వైపు కాకుండా డైనమిక్ మారుతారు
–గుజ్జల ప్రేమేంధర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలి
–మాజీమంత్రి ,మల్కాజిగిరి పార్ల మెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్

ప్రజా దీవెన, నల్లగొండ: దేశం, రాష్ట్రంలో చరిత్ర తరిచి చూస్తే అబ ద్ధాల పునాదుల మీదనే కాంగ్రెస్ ప్రస్థానం కొనసాగుతోందని మాజీ మంత్రి, మల్కాజ్ గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ వ్యాఖ్యా నించారు. ఈ కోణంలోనే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో అతి త క్కువ కాలంలో ప్రజల చేత ఛీ కొట్టించుకున్న పార్టీగా నిలిచిందని ఎద్దేవా చేశారు.

ప్రజలకు పాలన అందించే శక్తి, సత్తా భారతీయ జన తా పార్టీకి మా త్రమే ఉందని అభి ప్రాయం వ్యక్తం చేశారు. ప్రజలు ఎప్పుడూ ఏపార్టీ వైపు ఉండరని డైనమిక్ గా మారుతారన్నారు. గురువారం నల్లగొండ జిల్లా కేంద్రం లోని బిజెపి కార్యాలయంలో ఏర్పా టు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు.విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యల కోసం పోరా డిన వ్యక్తి ప్రేమేంధర్ రెడ్డి అని, ప్రజలకు న్యాయకత్వం వహించే వ్యక్తిగా గుర్తింపు సాధించారని తెలిపారు.

40 ఏండ్ల త్యాగానికి ఎన్ని వడుదొడుకులు వచ్చినా పార్టీని అంటి పెట్టుకొని ఉన్నారని, 34 నియోజకవర్గాలకు ప్రతి నియో జకవర్గంలో ఒక ఇంచార్జిని నియ మించడం ద్వారా పట్టభద్రులను దగ్గర అయ్యే లా చేస్తామని, ప్రేమేందర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని పిలు పునిచ్చారు.

అందరూ అనుకున్నట్లు కేవలం ఒక్క ప్రాంతానికే పరిమితమయ్యే పార్టీ అనుకున్నారు, కానీ దేశం నలుమూలలా బీజేపీ ఎంతో పటి ష్టంగా ఉండి అన్ని ప్రాంతాల్లో బల మైన పోటీ ఇస్తుందని వివ రించారు. తెలంగాణ రాష్ట్రంలో 17 లోక్ సభ నియోజకవర్గాల్లో మోడీ గెలవాలని ప్రజలు ఓట్లు వేశారని, బీజేపీకి రాష్ట్రంలోని యువత పెద్ద ఎత్తున మద్దతు ప్రకటించారని గుర్తు చేశారు.

బుద్ధి జీవులు అందరూ బీజేపీ కి మద్దతు గా వ్యవహరిస్తు న్నారని, ఒకప్పుడు ఏమి జరుగు తుందో తెలియని పరిస్థితి నుంచి నేడు మొ బైల్ వల్ల క్షణాల్లో అన్ని విషయాలు క్షణాల్లో బహిర్గతం అవుతున్నా యని పేర్కొన్నారు. ఐటీ ఉద్యోగులు, ప్రభుత్వ ఉద్యో గులు,యువత మా ఎన్నిక కోసం కీలకంగా పని చేసారని, మన పట్ట భద్రులు అంద రూ కూడా గుజ్జుల ప్రేమేంధర్ రెడ్డి ని ఇదే స్ఫూర్తితో గెలిపించాలని కోరారు.

ప్రజాస్వా మ్యం పరిఢవిల్లాలని అంటే ప్రభు త్వం బలంగా ఉండాలని కోరు కుంటారన్నారు. ప్రేమేంధర్ కి ప్రజల సమస్యల మీద పూర్తి అవ గాహన ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ ని ఓడగొట్ట డానికి కాంగ్రెస్ కి ఓటు వేశారని, మళ్ళీ కాలిపోయిన మోటార్లు, దం దాలు,ఎండిపోయిన కాలువలు దర్శనం ఇస్తున్నాయని విచారం వ్య క్తం చేశారు. ప్రతి నియోజకవర్గంలో పట్టభద్రుల తో మాట్లాడుతామని మేధో సంపన్న ఘర్షణ జరగాల్సిందేనని, ఏమి చేస్తాం అనేది చెప్పి ఓటు అడుగుతామన్నారు.

భారతీయ జనతా పార్టీ లోక్ సభ ఎన్నికల్లో 12 సీట్లు గెలువడం ఖా యమని స్పష్టం చేశారు. ప్రజలు ఒక్క పార్టీ కి అనుబంధంగా ఉండ రని, 75 శాతం ప్రజలు డైనమిక్ గా వారి మనోగతానికి అనుగుణం గా మారుతారని, ఇది ఎవరి జాగిరు కాదని, ఇది ప్రజల జాగీరని పే ర్కొన్నారు. భారతీయ జనతా పార్టీ మూడు సీట్ల ఉన్న పార్టీ 370 సీట్లకు వస్తుంది అంటే ప్రజలు ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నారో అర్థం చేసుకోవాలన్నారు.

ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ 370 ఆర్టి కల్ రద్దు అయ్యిoదని, ట్రిపుల్ తలాక్ రద్దు చేశారని, అం దరూ సమానమే అని మోడీ అంటున్న కాంగ్రెస్ పార్టీ ఇంకా అబద్ధాల పునాదుల మీద నడుస్తుందని ధ్వజమెత్తారు. ఉత్తర ప్రదేశ్ మొత్తం మోదీ జపం చేస్తుoటే, కర్గే లక్నోలో కూర్చొని అబూత కల్పన మాట లు మాట్లాడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల ఇంచా ర్జి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్ రావు, పెద్ద పల్లి ఎంపీ నేతకాని వెంకటేష్ మాట్లాడుతూ బిఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీలు కలిసి పోయా యని ఆరోపించారు. మూడు జిల్లా ల్లో ఉన్న పట్టభద్రులు బీజేపీ అభ్య ర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయాలని పిలుపునిచ్చారు.3.8 ట్రిలియన్ డాలర్లు గా జిడిపి ఉంది అంటే అది మోడీ వల్లనే సాధ్యమన్నారు.

పట్టభద్రుల అందరూ ప్రేమేంధర్ రెడ్డి ని ధీవించాలని కోరారు. ఎమ్మె ల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేం ధర్ రెడ్డి మాట్లాడుతూ ఒక్క అవకాశం ఇవ్వాలని, సేవ చేసే అవకా శం ఇవ్వండని పట్టభద్రులను కోరారు. ఇది ఉప ఎన్నిక, గెలిచినా, ఓడినా కాంగ్రెస్ పార్టీ కి ఈ సీటు అవ సరం లేదని, బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్లే ఉండటం లేదని, నాకు సేవ చేసే అవకాశం ఇవ్వాలని, మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

ఈ కార్యక్రమంలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నూకల నరసింహ రెడ్డి, బీజేపీ జిల్లా అద్య క్షులు నాగం వర్షిత్ రెడ్డి, నల్లగొండ బీజేపీ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి, మాదగోని శ్రీనివాస్ గౌడ్, పిల్లి రామ రాజు, వీరెళ్లి చంద్ర శేఖర్, గోలి మ ధుసూదన్ రెడ్డి, నూకల వెంకట నారాయణ రెడ్డి, పొతేపాక సాంబ య్య, శ్రీదేవి రెడ్డి, నివేదిత రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.