OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Bjp Ramachander Rao House Arrest : బిగ్ బ్రేకింగ్, భాగ్యనగరంలో ఉద్రిక్తత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు నిర్బంధం

--నల్లగొండకు వెళ్లకుండా పోలీసుల హౌస్ అరెస్ట్ --పోలీసుల ఆంక్షలుదాటుకుని బయలుదేరడంతో అరెస్ట్ --కాంగ్రెస్ ప్రభుత్వంపై రామచందర్‌రావు తీవ్ర విమర్శలు --రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యమేదన్న బండిసంజయ్

 

Bjp Ramachander Rao House Arrest :  ప్రజా దీవెన, హైదరాబాద్: హైద రాబాద్‌లోని తార్నాకాలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రా వును పోలీసులు అరెస్ట్ చేశా రు.నల్లగొండ జిల్లా బీజేపీ అ ధ్యక్షుడు నాగం వర్షిత్‌రెడ్డి ఇంటిపై జరిగిన దాడి నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకు రామచందర్‌రా వు నల్లగొండ కు వెళ్లేందుకు సిద్ధమయ్యారు. అయితే ముం దస్తు చర్యల్లో భా గంగా పోలీసులు ఆయనను హౌస్ అరెస్ట్ చేశారు. అయినప్ప టికీ పోలీసుల ఆంక్షలను లెక్కచే య కుండా నల్లగొండకు బయలు దేరేందుకు రామచందర్‌రావు ప్ర యత్నించడంతో పోలీసులు ఆ యనను అదుపులోకి తీసుకుని గాంధీనగర్ పోలీస్ స్టేషన్‌కు తర లించారు. దీంతో అక్కడ కొంతసే పు ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

   పోలీసులపై రామచందర్‌రావు ఫైర్

తన అరెస్ట్‌పై రామచందర్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశా రు. బా ధిత కుటుంబాన్ని పరామర్శించేం దుకు వెళ్తుంటే అరెస్ట్ చేయడం ఏమిటని ప్రశ్నించారు.రాష్ట్రంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు.
నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షు డు నాగం వర్షిత్‌రెడ్డి, ఆయ నకుటుంబంపై దాడులు చేయడం దుర్మార్గమని మండిపడ్డా రు. గతంలో పాలిటెక్నిక్ విద్యార్థులను ప రామర్శించేందు కు వెళ్లిన సందర్భంలోనూ పోలీసులు తనను అడ్డుకున్నా రని గుర్తుచేశారు.ఎన్ని నిర్బంధాలు, ఆంక్షలు విధించినా ప్రజా సమస్యలపై బీజేపీ పోరాటం ఆగదని రామచందర్‌ రా వు స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్ర భుత్వం పతనానికి దగ్గరలో ఉం దని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

రామచందర్‌రావు అరెస్ట్‌పై బండి ఆగ్రహం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్‌రావు అరెస్ట్‌పై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సం జయ్ తీవ్రంగా స్పం దించారు. బా ధితులను పరామర్శించేందుకు, నిరసన తెలి పేందుకు వెళ్తున్న బీ జేపీ నాయకులను అరెస్ట్ చేయడం కాంగ్రెస్ ప్రభుత్వ దివాళాకో రుతనానికి నిదర్శనమని విమ ర్శించారు.దాడులు చేసే వారిని కాపాడటమేనా కాంగ్రెస్ చె బుతున్న ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రశ్నించారు.

నల్లగొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి ఇంటిపై దాడి చేసి ధ్వంసం చేసిన వారిపై ఇప్పటివ రకు ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీ శారు.అలాగే హైదరా బాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యా లయం పై దాడికి పాల్పడిన యూత్ కాంగ్రెస్ నేతలను పోలీ సులు ఎం దుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రం లో ప్రభుత్వం, పోలీసులు ఏం చేస్తున్నారంటూ బండి సంజ య్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

రామచందర్‌రావును అక్రమంగా అరెస్ట్ చేశారని ఆరోపించి న బండి సంజయ్ వెంటనే విడుదల చే యాలని డిమాండ్ చేశారు. లేదం టే రాబోయే రోజుల్లో తీవ్ర పరిణామాలు ఎదు ర్కోవాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. నల్లగొండ ఘటనతో మొదలైన రాజకీయ రగడ.. ఇప్పుడు హైద రాబా ద్‌కు చేరుకోవడంతో తెలం గాణ రాజకీయాల్లో మరోసారి హీట్ పెరిగింది.

Related Articles

Back to top button