Praja Deveena
Newspaper Banner
Date of Publish : 13 August 2026, 11:20 am Posted by : praja deveena

BJP Representation on cheruvugattu temple safety : నల్లగొండ బీజేపీ అధ్యక్షుడు వర్షి త్ రెడ్డి అప్పీల్, చెరువుగట్టు ఆల యానికి ‘శాశ్వత అగ్నిభద్రత క ల్పించాలి 

BJP Representation on cheruvugattu temple safety : ప్రజా దీవెన, న ల్లగొండ:మహాపుణ్యక్షేత్రమైన చెరు వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవ స్థాన పరిసరాల్లో ఇటీవల సంభవించిన ఘోర అగ్నిప్రమాదం వ్యా పారస్తుల జీవితా లను అంధకారంలోకి నెట్టివేసిందని బీజే పీ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. అనేక దుకాణాలు బూడిదై తీవ్ర ఆస్తి నష్టం వాటిల్లినప్పటికీ, భగవంతుడి అపార కృపతో ఎటువంటి ప్రా ణనష్టం జరగక పోవడం ఒక్కటే ఊరటనిచ్చిన అంశమని గుర్తుచేశారు.

అయితే భవిష్యత్తులో ఇలాంటి ముప్పు పునరావృతం కా కుండా ఉండేందుకు తక్షణమే శాశ్వత ప్రాతిపదికన ఒక ఫైర్ ఇంజిన్‌ను ఆలయ పరిసరాల్లో అందుబా టులో ఉంచాలని అగ్నిమాపక శాఖ అధికారి సందేశ్ కుమార్ ని కలిసి నాయ కులు వినతిపత్రం సమర్పించారు. నిత్యం వేలాది మంది భ క్తులతో, జాతరలు మరియు పండుగ సమయాల్లో రద్దీగా ఉండే చెరువుగట్టు ఆలయ వద్ద తక్షణ అత్యవసర సేవల కోసం ప్రత్యేకంగా ఒక ఫైర్ ఇంజిన్‌ ను కేటాయించాలని కో రారు.

    లోతైన విచారణకు డిమాండ్

ఇటీవల ప్రమాదం జరిగిన సమయంలో ఘటనా స్థలానికి చేరు కున్న ఫైర్ ఇంజిన్లలో ఒకటి సరి గా పనిచేయకపోవడం తీవ్ర నిర్ల క్ష్యానికి అద్దం పడుతోందని, అత్యవసర సమయం లో ఫైర్ ఇంజిన్ ఎందుకు మొరాయించిందని దీని వెనుక ఉ న్న సాంకేతిక లోపాలు లేదా నిర్లక్ష్యంపై సమగ్ర విచారణ జరి పి నివేదిక బహిర్గతం చే యాలని డిమాండ్ చేశారు.

సద రు ఫైర్ ఇంజిన్ కనుక సరిగ్గా పని చేసి ఉంటే, మంటల ను ప్రాథ మిక దశలోనే అదుపు చేసి, పేద వ్యాపారులకు జ రిగిన భా రీ ఆస్తి నష్టాన్ని నివారించే అవకాశం ఉం డేదని, అత్యవసర సమయాల్లో వాహనాలు మొరాయించకుండా అగ్నిమాపక శాఖ వద్ద ఉన్న వాహనాలు మరియు పరిక రాల పనితీరును అధికారులు ఎప్పటిక ప్పుడు తనిఖీ చే స్తూ సిద్ధంగా ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, శ్రీ వీరెల్లి చంద్రశేఖర్ త దితరులు పాల్గొని వ్యాపారుల భద్రతకు మద్దతు తెలిపారు.