Lok sabha elections: నాలుగొందలతో అధికార పీఠాన్ని అధిరోహిస్తున్నాం
లోక్ సభ ఎన్నికల్లో (Lok sabha elections)నాలుగొందల పార్లమెంటు స్థానాలు కొల్లగొట్టి మూడోసారి ముచ్చటలేకుండా అధికార పీఠాన్ని అధిరోహిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు.
లోక్ సభ ఎన్నికల్లో చరిత్ర తిరగ రాస్తున్నాం
కాంగ్రెసు విపక్షహోదా కూడా కరు వయ్యే పరిస్థుతులు సుస్పష్టం
ఈ ఎన్నికల్లో ‘ఇండియా ‘కు 50 సీట్లు దాటితే మహాగగణం
ఒడిశాలో కూడా అధికారంలోకి వస్తున్నామని, ఒడియా వచ్చిన స్థానికులకే సీఎం అవకాశం
పుల్బణి ప్రచార సభలో ప్రధాని మోడీ
ప్రజా దీవెన, ఒడిశా: లోక్ సభ ఎన్నికల్లో (Lok sabha elections)నాలుగొందల పార్లమెంటు స్థానాలు కొల్లగొట్టి మూడోసారి ముచ్చటలేకుండా అధికార పీఠాన్ని అధిరోహిస్తున్నామని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పునరుద్ఘాటించారు. కాంగ్రెస్(congress) కు కనీసం పదిశాతం సీట్లు వచ్చే అవకాశం లేదని, అంటే 50 సీట్లు కూడా దక్కవని, ఎన్నికల తరువాత లోక్ సభ లో(Lok sabha elections) విపక్ష హోదాను సైతం కోల్పోబోతోందని ప్రధాన మంత్రి నరేంద్రమోడీ జోస్యం చెప్పారు. కాంగ్రెస్ యువరాజు రాహుల్ గాంధీ నేటికీ 2014 నాటి స్క్రిప్ట్ తిరిగేస్తున్నారని ఎద్దేవా చేశా రు.
ఒడిశా రాష్ట్రంలోని కందమాల్, బొలంగీర్ లోక్ సభ నియోజకవర్గా ల పరిథిలోని ఫుబ్బణి తదితర ప్రాం తాలలో శనివారంనాడు నిర్వహిం చిన ఎన్నికల ర్యాలీ, ప్రచార సభల్లో పాల్గొన్న ఆయన ప్రసంగించారు.
ఈ ఎన్నికల్లో ఎన్డీయే అన్ని రికార్డు లను బద్దలుకొట్టి 400 సీట్లు సాధిం చి అధికారం చేపడతామని, ఇది మాటగా రాసిపెట్టుకోండి అని మోడీ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ అటు కాంగ్రెస్ ను, ఇటు రాష్ట్రంలో అధికార బీజేడీ అధినేత, ముఖ్య మంత్రి నవీన్ పట్నాయక్ పై విమ ర్శలు సంధించారు.
సుదీర్ఘకాలంగా ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న నవీన్బాబు ఒడిశాలో ఎన్నిజిల్లాలు ఉన్నాయో, వాటి పేర్లు, ఆయా జిల్లా కేంద్రాల పేర్లు ఏమిటో ఎటు వంటి స్క్రిప్ట్ చూడకుండా, ఎవరి సహాయం లేకుండా చెప్పగలరా అంటూ ప్రధాని ప్రశ్నించారు. ఒడిశా ఆత్మగౌరవం ప్రమాదంలో పడిందని, దానిని బీజేపీ పరిరక్షిస్తుందని మాటి చ్చారు. ఎన్నికల్లో బీజేపీ(BJP) మంచి ఫలితాలు సాధిస్తుందని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, డబుల్ ఇంజన్ సర్కార్ అభివృద్ధి బాటలో రాష్ట్రాన్ని నడిపిస్తుందని చెప్పారు. ఈ గడ్డమీద పుట్టి మాతృ భాష ఒడియా వచ్చిన బిడ్డ సీఎం పీఠంపై కూర్చోబెడతామని స్పష్టం చేశారు.
సహజవనరులు పుష్క లంగా ఉన్న ప్పటికీ ప్రజలు పేదరికంలో మగ్గిపో వడాని కి బిజూ జనతాదళ్ (బీజేడీ) పాలనే కారణమని ఆరోపించారు. ఒడిశా సంపన్న రాష్ట్రమే అయినా ప్రజలు మాత్రం పేద వారని ఆవేదన వ్యక్తం చేశారు. ఒడిశాకు చెందిన గిరిజన మహిళ ద్రౌపది ముర్మును రాష్ట్రపతిని చేసిన ఘనత భారతీ యజనతా పార్టీదేనని, ఆమె త్రివిధ దళాలకుకమాండర్ ఇన్ చీఫ్ గా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర ప్రజల అధోగతికి కారణమై న బీజేడీని అధికారంలోంచి దించేయాలని ప్రధాని పిలుపు నిచ్చారు.
దాయాది పాకిస్తాన్ తో చర్చలు జరపడం అత్యవసరమని, కేంద్రప్రభుత్వ ధోర ణి భారత్ కుముప్పుగా మారు తోందని, భారత్ కాలు దువ్వితే పాకిస్తాన్ చూస్తూ ఊరుకోదని, అణుబాంబులను ఉపయోగిస్తే 8 క్షణాల్లో అమృత్ సర్ కు అణు ధార్మికత చేరుకుంటుందని, పిచ్చో డి చేతిలో రాయిలా, పాకిస్తాన్ లో పిచ్చోడు అధికారంలోకి వస్తే అణు బాంబులను వాడితే ఏం జరుగు తుందో ఊహించాలని, అలాంటి పరిస్థితులు ఎదురుకాకుండా పాకి స్తాన్ తో చర్చలు జరపాలని కాంగ్రెస్ నేత(congress) అయ్యర్ వ్యాఖ్యలపై మోధీ శనివారం స్పందిస్తూ పాకి స్తాన్ పై కాంగ్రెస్ కున్న మమకారం మరోసారి లోకానికి వెల్లడయ్యిందని గుర్తు చేశారు.
ఇండియా కూటమి లోని పార్టీలకు ఎంతసేపూ మైనా రిటీ ఓటు బ్యాంకు మీద ధ్యాస తప్ప దేశం గురించి ఆలోచన లేదని విమర్శించారు. మైనారిటీలమీద మమకారంవల్లే ఉగ్రదాడులపై దర్యాప్తు కోసం పట్టుపట్టడం లేదని విమర్శించారు. అణు బాంబులను సురక్షితంగా ఎలా దాచాలో, కాపా డాలో తెలియక సతమతమవు తున్న పాక్ విక్రయిం చాలనుకుం టోందని, కానీ కొనేందుకు ఏదేశ మూ ముందుకు రావడం లేదని ప్రధానమంత్రి నరేంద్రమోడీ చమ త్కరించారు.
మన దేశంలో ఎన్నో ఉగ్రవాద దాడులకు కారణమైన పాకిస్తాన్(Pakistan) గురించి కాంగ్రెస్ ఎప్పు డూ ఆలోచిస్తుంటుందని, చివరకు అణుబాంబు ఉందని మాతృదేశ ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే దాకా వెళ్లిందని, వారు అధికారం లో ఉన్నప్పుడు ఉగ్రదా డులు జరిగితే కఠినంగా వ్యవహ రించడం చేతగాని కాంగ్రెస్, ఇప్పు డు మాత్రం పాకిస్తాన్(Pakistan) బూచి గురిం చి చెబుతోందని మండిపడ్డారు. పాకిస్తాన్ కు అణుబాంబులను ఎలా దాచాలో, భద్రతాపరమైన జాగ్రత్త లు ఎలా తీసుకోవాలో తెలి యదని, అందువల్ల మంచికొను గోలుదారుకోసం వెతుకుతోందని, అయితే వాటి నాణ్యత గురించిన ప్రపంచానికి తెలుసుకనుక ఎవరూ ముందుకు రావడం లేదని ఎద్దేవా చేశారు. జీవశ్చవాల్లాంటి కాంగ్రెస్ నేతలు భారతావని ఆత్మను కూడా చంపేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
BJP wins 400 seats in parliament elections