Parliament elections: వస్తున్నాం….గ్యారంటిలతో అధికారంలోకి
దేశ సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలతో వస్తున్నా మని, మళ్లీ గ్యారంటీగా 400 పార్ల మెంటు స్థానాలతో అధికారం లోకి రావడం ఖాయం అని ప్రధాన మం త్రి మోదీ పునరుద్ఘాటించారు.
400 వస్తాయని నా,ప్రజల నమ్మకం
వచ్చే ఐదేళ్ళు తారతమ్యం లేని పాలన అందిస్తాం
ఈశాన్య ప్రాంతమే మోడీ హామీకి నిదర్శనం
దోపిడీ విధానాన్నే కాంగ్రెస్ విధానంగా మార్చుకున్న వైనం
అసోం ర్యాలీలో ప్రధాన మంత్రి మోదీ
ప్రజా దీవెన, అసోం: దేశ సమగ్ర అభివృద్ధికి అనుగుణంగా ప్రజలకు ఇచ్చిన గ్యారంటీలతో వస్తున్నా మని, మళ్లీ గ్యారంటీగా 400 పార్ల మెంటు స్థానాలతో అధికారం లోకి రావడం ఖాయం అని (Prime Minister Modi) ప్రధాన మం త్రి మోదీ పునరుద్ఘాటించారు. 2014లో ఆశతో, 2019లో నమ్మ కంతో, 2024లో గ్యారంటీతో ప్రజల వద్దకు వచ్చానని ప్రధాని మోడీ పేర్కొన్నారు. ఎన్నికల ప్రచారం లో భాగంగా బుధవారం అసోంలోని బోర్కూరలో జరిగిన ర్యాలీలో ఆయన ప్రసంగించారు. వచ్చే ఐదేళ్ల పాటు తారతమ్యం లేకుండా అంద రికీ ఉచిత రేషన్ అందిస్తామని, 70 ఏళ్లు పైబడిన వారికి ‘ఆయుష్మాన్ భారత్'(Ayushman Bharat) పథకం కింద రూ. ఐదు లక్షల వరకు ఉచిత చికిత్స అందిం చనున్నట్లు తెలిపారు.
రాబోయే ఐదేళ్ల లో పేదల కోసం మరో 3 కోట్ల కొత్త ఇళ్ళు నిర్మిస్తామని, ప్రతి ఒక్క రూ ఎటువంటి వివక్ష లేకుండా లబ్ది పొంద గలరని భరోసా ఇచ్చారు. ప్రస్తుతం మోదీ హామీపై దేశం నడుస్తోందని, ఈశాన్య ప్రాంతమే మోదీ హామీకి నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఈశాన్య రాష్ట్రాలను కాంగ్రెస్ సమస్యగా మిగిల్చిందని, ఇప్పుడు బీజేపీ అవకాశాల గనిగా మార్చేసిందని గుర్తు చేశారు. వేర్పాటువాదం, శాంతి భద్రతల కోసం 60 ఏళ్లలో చేయలేని పనిని మోడీ 10 ఏళ్లలో చేసి చూపించారని వివరించారు. ఈశాన్యంలో కాంగ్రెస్ పార్టీ దోపిడీ విధానాన్ని విధానంగా మార్చుకుం దని ప్రధాని మోడీ ఆరోపించారు.
బీజేపీ హయాంలో ఎంతో మార్పు వచ్చిందని, కాంగ్రెస్ పార్టీ ఈశాన్య ప్రాంతాలకు ఎలాంటి న్యాయం చే యలేదని, ఈప్రాంతాన్ని అవినీతి కేంద్రంగా మార్చిందని ధ్వజమెత్తా రు. కమ్యూనిస్టులు రాష్ట్ర అవకాశా లను చెడగొట్టారు.ఈ ప్రాంత అభి వృద్ధికి బీజేపీ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తోందని ప్రధాని అన్నారు. దేశం లో పేదల కోసం మూడుకోట్ల కొత్త ఇళ్లను నిర్మించాలని తమ ప్రభు త్వం నిర్ణయించిందని చెప్పారు. త్రిపుర ప్రజలు దీని నుండి చాలా ప్రయోజనం పొందబోతున్నారని తెలిపారు. ఈశాన్య రాష్ట్రాలలో కనెక్టివిటీ పెంపొందించడంపై తమ ప్రభుత్వం దృష్టి సారించిందని ప్రధా ని చెప్పారు.
బంగ్లాదేశ్ దక్షిణ త్రిపు రలోని సబ్లూమ్ డివిజన్ తో కలిపే ఫెని బ్రిడ్జిని నిర్మించగా, రాష్ట్రంలోని హైవేల ఫేస్లిఫ్ట్ కోసం రూ.3,000 కోట్లు వెచ్చించనున్నారని, రైల్వే ట్రాక్ పై విద్యుద్దీకరణ పురోగతిలో ఉందని, గతంలో రాష్ట్రంలో మొబై ల్ టవర్లు సరిగా పని చేయలేదని, కానీ ఇప్పుడు 5జీ కనెక్టివిటీని మెరుగుపరిచే పని పురోగతిలో ఉందని చెప్పారు.మొబైల్ బిల్లు లను నెలకు రూ.400 నుంచి రూ.500కి తగ్గించింది మోడీ ప్రభు త్వమేనని, కాంగ్రెస్ అధికారంలో ఉండి ఉంటే, మీ మొబైల్ బిల్లులు రూ. 4,000 నుండి రూ.5,000 అయ్యేవి అని ప్రధాని పేర్కొన్నారు. గత 10 ఏళ్లలో తమ ప్రభుత్వం సాధించిన విజయాలను ట్రైలర్ గా పేర్కొంటూ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలకు ఇంకా చాలా ఎక్కువ ఉంటాయని హామీ ఇచ్చారు.
BJP won in parliament elections