Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

తెలంగాణ చాంపియన్ మేమే

తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లను గెలిచి టీపీఎల్ (తెలంగాణ ప్రీమియర్ లీగ్) కప్ గెలుస్తున్నామని బండి సంజయ్ జోస్యం చెప్పారు.

17సీట్లతో ప్రీమియర్ లీగ్ కప్ కొడతాం
మోదీ హవా తెలంగాణ లో కొనసాగుతోంది
ప్రచారంలో బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్

ప్రజా దీవెన, కరీంనగర్: తెలంగాణ రాష్ట్రంలో 17 సీట్లను గెలిచి టీపీఎల్ (తెలంగాణ ప్రీమియర్ లీగ్) కప్ గెలుస్తున్నామని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ఇండియా పొలిటికల్ లీగల్ కప్, టీపీఎల్‌లో నూ బీజేపీదే విజయం అని అన్నా రు. శనివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా బండి సంజయ్ మాట్లా డుతూ పార్లమెంట్ ఎన్నికల్లో భాగం గా దేశంలో, రాష్ట్రం లో తమదే హవా అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఈ ఎన్నికల టోర్నమెంట్‌లో కాంగ్రెస్ టీమ్‌కు ప్లేయర్లు కరువ య్యారని ఎద్దేవా చేశారు. టీమ్ సభ్యులున్నా బీఆర్ఎస్‌ తీవ్ర నిరాశలో ఉందని విమర్శించారు. వందరోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని గద్దెనెక్కిన కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని విమర్శించారు. మోడీ పాలనలో కరోనా సమయంలో దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్‌ ఇచ్చారని గుర్తుచేశారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ అభివృద్ధికి రూ.12 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. 370 ఆర్టికల్‌ను రద్దుచేసి కాశ్మీర్‌ను భారత్‌లో అంతర్భాగం చేశారని వెల్లడించారు.