Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS BJP MP bandi Sanjoy : బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తంటే చెప్పుతో కొట్టండి

--బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు --పొత్తు ఊసెత్తితో మమ్ముల్నే కొట్టేటట్లున్నరని కీలక వ్యాఖ్యలు --అవినీతికి పాల్పడ్డారని తేలినా కెసిఆర్ ను అరెస్ట్ చేయడం లేదు --తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఎంపి బండి సంజయ్

బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తంటే..

చెప్పుతో కొట్టండి

–బీజేపీ నాయకులు, కార్యకర్తలకు బండి సంజయ్ పిలుపు
–పొత్తు ఊసెత్తితో మమ్ముల్నే కొట్టేటట్లున్నరని కీలక వ్యాఖ్యలు
–అవినీతికి పాల్పడ్డారని తేలినా కెసిఆర్ ను అరెస్ట్ చేయడం లేదు
–తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన సందర్భంగా ఎంపి బండి సంజయ్

ప్రజా దీవెన/తాండూర్: బీఆర్ఎస్ తో బీజేపీ పొత్తంటే చెప్పుతో కొట్టండoటూ బీజేపీ శ్రేణులకు బిజెపి ( bjp) జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపి బండి సంజయ్ పిలుపునిచ్చారు. పొత్తు ఊసెత్తితో మమ్ముల్నే పార్టీ శ్రేణులు కొట్టేటట్లున్నారని వ్యాఖ్యానించారు. తాండూరులో కేంద్రమంత్రితో కలిసి విజయ సంకల్ప యాత్రను ప్రారంభించిన బండి సంజయ్ (bandi Sanjoy)ఈ సందర్భంగా మాట్లాడారు.

కేసీఆర్ కుటుంబ సభ్యుల ఆస్తులను ఎందుకు జప్తు చేయడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై బీఆర్ఎస్ అసెంబ్లీలో ఎందుకు నిలదీయడం లేదన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయికారీ ఒప్పందం నడుస్తోందని ఆరోపించారు. బీజేపీకి రాముడున్నడు, మోడీ ఉన్నడు, కాంగ్రెస్, బీఆర్ఎస్ వైపు రాక్షసులు న్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 370 ఆర్టికల్ ( 370 article ) రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ ఇద్దామని పిలుపుని చ్చారు.

బతికు న్నంత వరకు హిందుత్వం, ధర్మరక్షణ కోసం పోరాడుతూనే ఉంటాన ని, హిందుత్వం మాట్లాడలేనినాడు రాజకీయాల నుండి తప్పుకుంటా ననిబండి సంజయ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మండు టెండలో భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలకు అభివాదం చేస్తూ సా గుతున్న బస్సు యాత్ర ముందుకు సాగింది.

370 ఆర్టికల్ ను రద్దు చేయడం తోపాటు దేశాన్ని నెంబర్ వన్ గా తీర్చిదిద్దుతూ నవభారత నిర్మాణం కోసం పాటుపడుతున్న నరేంద్ర మోదీకి 370 ఎంపీ సీట్లను బహుమతిగా ఇవ్వాలని ప్రజలను కోరా రు.విజయ సంకల్ప యాత్రలో భాగంగా బండి సంజయ్ తోపాటు కేంద్ర మంత్రి ( union minister) బి ఎల్ వర్మ, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, ఎమ్మెల్యే కాటెపల్లి వెంకటరమణారెడ్డి తదితరులు తాండూరుకు విచ్చేశారు.

ఈ సందర్భంగా బీఎల్ వర్మ, బండి సంజయ్ విజయ సంకల్ప యాత్ర ను ప్రారంభించారు. అంతకుముందు మండుటెండను సైతం లెక్క చేయకుండా భారీ ఎత్తున హాజరైన ప్రజలను ఉద్దేశించి బండి సంజ య్ సంచలన వ్యాఖ్యలు చేశారు.ప్రజల పక్షాన బీజేపీ కొట్లాడితే కాం గ్రెస్ ఎట్లా అధికారంలోకి వచ్చింది, రైతులు, మహిళలు, యువత పక్షాన లాఠీదెబ్బలు తిని, అరెస్టై, జైలుకు పోయింది బిజెపి అని వ్యాఖ్యానించారు.

కేసీఆర్ మెడలు వంచింది బీజేపి, మరి ప్రజలు కాంగ్రెస్ కు ఎందుకు ఓటేశారు ఇప్పుడు పరిస్థితి మారిందని వివరించారు. ప్రజలు ఫుల్ క్లారిటీతో ఉన్నారని, ఈసారి ప్రజల ఓట్లు మోదీకే వేయబోతున్నారని జోస్యం చెప్పారు.రాముడిని కొలిచే వాళ్లంతా బీజేపీకే ఓటేస్తారని, అయోధ్య అక్షింతలను రేషన్ బియ్యం, అయోధ్య (ayodhya) లోనే రాముడు పుట్టారనడానికి ఆధారాలేమిటని హేళన చేసే కాంగ్రెస్ నేతలు దుర్మార్గులని విమర్శించారు.

370 ఆర్టికల్ ను రద్దు చేసిన మోదీకి 370 ఎంపీ సీట్లను గిఫ్ట్ ఇద్దా మని, రామ మందిరం వద్దనుకునే వాళ్లు కాంగ్రెస్ కు ఓటేసుకోవచ్చు నని మావైపు రాముడు, మోడీ ఉన్నారు.. వాళ్లవైపు రాక్షసులు, కాం గ్రెస్, బీఆర్ఎస్ పార్టీలున్నయ్ ఎవరు కావాలో తేల్చుకోండని కోరారు. 80 కోట్ల మందికి ఉచిత బియ్యం ఇస్తున్న మోదీ కావాలా, ఎలుకల మాదిరిగా బియ్యాన్ని కూడా మెక్కేందుకు సిద్ధమైన కాంగ్రెస్ కావాలా తేల్చుకోండని పిలుపునిచ్చారు.

ట్రిపుల్ తలాఖ్ చట్టాన్ని రద్దు చేయడంతోపాటు కరోనా వ్యాక్సిన్ తో దేశ ప్రజల ప్రాణాలను కాపాడిన మహానుభావుడు మోదీ అని కీర్తిం చారు. ఆర్దిక ప్రగతిలో 10వ స్థానంలో ఉన్న భారత్ 5వ స్థానానికి చేర్చిన ఘనత మోదీదే అని, భారత్ నెంబర్ వన్ కావాలంటే మోదీ రావాల్సిందే మోదీ లేని భారత్ ను ఎవరూ ఊహించుకోవడం లేదని గుర్తు చేశారు. ఈ దేశంలో ప్రజల బతుకులు మారాలంటే, దేశం అభి వృది చెందాలంటే మోదీ రావాల్సిందేనని స్పష్టం చేశారు.

ఇచ్చిన హామీలను 100 రోజుల్లో అమలు చేస్తానన్న కాంగ్రెస్ నేతల కు ఇప్పటికే 70 రోజులు దాటిపోయాయనీ, ఏ క్షణమైనా ఎన్నికల షెడ్యూల్ వెలువడే అవకాశముందని, ఎన్నికల కోడ్ తో హమీలను అమలు చేయకుండా తప్పించుకునేందుకు డ్రామాలాడు తోందనీ ఆరోపించారు.

కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టో హామీలను అమలు చేయాలంటే రూ. 5 లక్షల కోట్లు కావాలి. నిధులు ఎక్కడి నుండి తెస్తారు, జీతాల చెల్లిం పులకే నిధుల్లేవు. అప్పులు పుట్టడం లేదు, మరి హామీలు ఎట్లా అ మలు చేస్తారో ఎందుకు చెప్పడం లేదని వ్యాఖ్యానించారు. ఈ దేశం లో రామ భక్తులంతా రాముడి గుడి కట్టించిన నరేంద్రమోదీకే ఓటే యండి, రామ మందిరం వద్దు బాబ్రీమసీదు కావాలనుకునే వాళ్లు ఎవరికైనా ఓటేసుకోవచ్చని సూచించారు.

ఈసారి ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీకి 370 సీట్లు రాబోతున్నయ నీ, తెలంగాణలో బీజేపీ సింగిల్ గా పోటీ చేస్తుందనీ, 17 కు 17 ఎంపీ సీట్లు రాబోతున్నయనీ, బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావనీ పునరుద్ఘాటించారు.

హిందుత్వం కోసం, ధర్మ రక్షణ కోసం పోరాడుతున్నందునే వెంకటర మణారెడ్డి, ధన్ పాల్ సూర్యనారాయ ణగుప్త, రాకేశ్ రెడ్డి, రామారా వుపటేల్ సహా 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. ఔరంగజేబు లంతా కలిసి నన్ను ఓడగట్టారని, అయినా భయపడే ప్రసక్తే లేదనీ, ఊపిరి ఉన్నంత వరకు ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు.