
Brs Ex CM kcr : ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర, రాష్ట్ర ప్ర భుత్వాలు కలిసి తెలంగాణ కు ద్రోహం చేస్తున్నాయని, ఇక ఎం త మాత్రం తాము చూస్తూ ఊరుకో బోమని బి ఆర్ఎస్ అదినేత, మా జీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయి లో మండిపడ్డారు. రెండేళ్లు ఆగామని ఇకపై ప్రభుత్వాన్ని అడుగడునా నిలదీస్తామని ప్రక టిం చారు.బహి రంగ సభలు పెడతామని,జనంలో కి తానే నేరుగా వస్తా నని తేల్చి చెప్పారు. ఇకపై రాష్ట్రంలో ప్రజా ఉద్యమాలు చేపడ తా మని కేసీఆర్ ప్రకటించారు. ఇంట్లోకి వచ్చి దోచు కుపోతామంటే ఊ రుకుంటామా అని ప్రశ్నించారు.పాలమూరు జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై బీఆర్ ఎస్ అధినేత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండేళ్ల నుంచి మౌనంగా ఉన్నానని, ఇక తప్పనిసరి పరిస్థితి అ ని బయల్దేరానని తెలిపారు.అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్రాన్ని ఎండగడ తానని స్పష్టం చేశారు. పాలమూ రు, రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో గ్రామగ్రామాన ప్రజా ఉద్యమాలు చే స్తాం, బహిరంగ సభలు పెడతా మని తెలిపారు. వాటికి తానే స్వయం గా హాజరవుతానని తెలిపా రు. ప్రజాక్షేత్రంలో నిష్క్రియ ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశా రు. ఇవాల్టి దాకా వేరు కథ, రేపట్నుంచి వేరే తోలుతీస్తామని హెచ్చ రించారు.
ఆదివారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్‌ఎల్పీ, రా ష్ట్ర కార్యవర్గంతో కేసీఆర్ సమావేశమై దిశానిర్దేశం చేశారు. అ నంతరం కేసీఆర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ తెచ్చిన పా ర్టీగా, ప్రధాన ప్రతిపక్షంగా తమపై రెండు బాధ్యతలు ఉన్నాయని తె లిపారు. మేం అడ్డం పొడువు మాట్లాడి, కారుకూతలు కూసి ఏదో చేస్తామంటే ఇక నడవదని అన్నారు. ఇవాల్టి దాకా వేరు కథ రేప ట్నుంచి వేరే తోలు తీస్తామని హెచ్చరించారు. ప్రజల్లో ఎక్కడికక్కడ నిలబెడతామన్నారు.
తొందరపడి ఏపని చేయట్లేదని, అక్కసుతో మాట్లాడట్లేదని కేసీఆర్ తె లిపారు. అనేక రకాల సమస్యలపై బీఆర్‌ఎస్ పార్టీ పోరాడుతూ నే ఉందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు రాష్ట్రం మొత్తానికే ముప్పు వచ్చే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు.ఎంతసేపు రియ ల్ ఎస్టేట్ దందాలే తప్ప వేరే ధ్యాసే లేదని కాంగ్రెస్ స ర్కార్‌పై విమ ర్శలు గుప్పించారు. స ర్కార్ విధానాలను ఎక్కడికక్కడ ని లదీస్తా మని, అన్యాయాలపై ప్రశ్నిస్తామన్నారు.
రాష్ట్రంలో రైతులు పండిం చిన వడ్లు కొనే దిక్కు లేదు.. యూరియా ఇచ్చే సిస్టమ్ లేదని రే వంత్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆగమాగం చేస్తుందన్నారు. వీరి పా లనా విధానాలు గమనిస్తుంటే.. అ సలు తెలంగాణలో ప్రభుత్వం ఉందా, నిద్రపోతుందా, అనే అనుమానం కలుగుతోందన్నారు. ఎం తసేపు భూములు అమ్ముకుందామనే యావలోనే ఉంటే ఎలా అం టూ కాంగ్రెస్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు.
అటు గోదావరి మీద చంద్ర బాబు దోపిడీ చేస్తుంటే దాని మీద చ ప్పుడు లేదు, ఇటు కృష్ణాలో పాలమూరు ఎత్తిపోతల మీద ఘోరం జరుగు తుంటే దీనిపైనా చప్పుడు లేదు, మరి రాష్ట్ర ప్రభుత్వం ఎవ రి ప్రయోజనాల కోసం ఉన్నట్లు అని ప్రశ్నించారు. ఈ రాష్ట్రంలో ఏం జరుగు తుందని, అందుకే ఈ పిరిస్థితుల్లో నేనే స్వయంగా రంగం లోకి దిగాలని అనుకున్నా అని ఈ రోజు మీటింగ్ లో డిసైడ్ అయి నమని తెలిపారు. రెండు మూడు రోజుల్లో ఆయా జిల్లా నాయకుల తో సమావేశమై, కచ్చితంగా పెద్ద ఎత్తున గ్రామగ్రామాన సభలు పెడ తాం, కవులు, గాయ కులను తట్టిలేపుతామని తెలిపారు. అక్కడి ప్రజలకు జరిగే అన్యాయాన్ని జలదోపిడీని అరకట్టాలని మీడియా ను కూడా విజ్ఞప్తి చేశారు.
ఇన్ని రోజులు ఒకరకంగా పోయాం, ఇక తప్పేటట్లు లేదు, తెలంగా ణ కో సం ఎవరితోనైనా కొట్లాడతామని స్పష్టం చేశారు. భయప డ మని అన్నారు. రాష్ట్రాన్ని రక్షించుకోవాలని, మా కండ్ల ముందే ఇం త దుర్మార్గం జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉండాలని ప్రశ్నించారు. ఇవాళ్టి వరకు ఒక లెక్క, రేపటి నుంచి మరో లెక్క.. ఎ క్కడికక్కడ నిలదీస్తా.. తోలు తీస్తాం. మొదటికే ముప్పు వచ్చే పరిస్థి తి ఉంది. మేం ఉద్యమించక తప్పదు.
ఎవరి ప్ర యోజనాల కోసం ఈ ప్రభుత్వం ఉంది. ఈ కాంగ్రెస్ ప్రభు త్వం సర్వ భ్రష్ట ప్రభుత్వం. జలదోపిడీ విష యంలో పోరాటాలు చేస్తాం. రాష్ట్ర హక్కును రక్షిం చుకోవడానికి ఫైట్ చేస్తాం. కళ్ల ముం దు ఇదంతా జరుగుతుంటే మౌ నంగా ఉండాలి, ఇష్టా నుసారం మా ట్లాడుతామంటే కుదరదు. ఇక నుంచి ప్రత్యక్ష పోరాటం చేస్తామని కేసీఆర్ కుండబద్దలు కొట్టారు.





