BRS Ex minister Harish Rao : వ్యంగ్యాస్త్రాలు సరే.. వ్యవహారం చూడండి
--1వ తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చామనడం సబబుకాదు --కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ అప్పగించ లేదని స్పష్టీకరణ --బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు
వ్యంగ్యాస్త్రాలు సరే.. వ్యవహారం చూడండి
–1వ తేదీన ఉద్యోగులకు జీతాలిచ్చామనడం సబబుకాదు
–కేఆర్ఎంబీకి ప్రాజెక్ట్ అప్పగించ లేదని స్పష్టీకరణ
–బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు
ప్రజా దీవెన/ హైదరాబాద్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల్లో వ్యంగ్యాస్త్రాలు ఎక్కువై, వ్యవహారం తక్కువైందని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ( harish Rao ) చమ త్కరించారు. ఎదుటి వారిపై వ్యంగ్య మాటలు తక్కువ చేసి చక్కగా మాట్లాడితే తప్పకుం డా సహకరిస్తామని ఆయన అన్నారు. శుక్రవారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ నాగార్జున సాగర్ విషయంలో సీఎం సభను తప్పుదో వ పట్టిస్తున్నారని విమర్శించారు.
శ్రీశైలం ( srishailam) ఏపీ ప్రభుత్వం కంట్రోల్ లో నాగార్జున సాగర్ ను తెలంగాణ ప్రభుత్వం కంట్రోల్ లో ఇచ్చారని, ఎన్నికలు జరిగే టైంలో సాగర్ ను ఏపీ కంట్రో ల్లోకి తీసుకుందన్నారు. 2 నెలలు గడుస్తున్నా సీఆర్పీఎఫ్ భద్రతలోనే సాగర్ ఉందని, శ్రీశైలం కూడా ఏపీ హయాంలోనే ఉందన్నారు. సాగర్ ను తెలంగాణ ఆధీనంలోకి తీసుకునేందుకు కృషి చేయాలని ఇందుకు మేము సహకరిస్తామని హరీశ్ రావు స్పష్టం చేశారు.
పీవీకి భారతరత్న ఇవ్వడం మనందరికీ గర్వకారణమని అన్నారు. ఉద్యోగు లందరికీ ఒకటో తేదీన జీతాలు ఇచ్చామని సీఎం చెప్పడం అసత్యం అని, పలు శాఖల్లో ఏడో తేదీ వరకు కూడా జీతాలు పడ్డాయన్నారు. ఇప్పటికీ కొన్ని శాఖల్లో జీతాలే పడలే దన్నారు. కాంట్రాక్ట్ లెక్చరర్లకు 2 నెలల జీతాలు రాలేదని, ఐకేపీ, బీవోఏలకు, విద్యాశాఖలో సర్వశిక్షా అభియాన్లో జీతాలు పడలేదని, జనవరిలో ఆసరా పెన్షన్లు ఇవ్వలేదని, ఫిబ్రవరి ఒకటి, రెండో తారీఖు నుంచి పెన్షన్లు ఇవ్వడం స్టార్ట్ చేశారు.
అది జనవరి నెలదా, ఫిబ్రవరి నెలదా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతుబంధు విషయంలో అసత్యాలు మాట్లాడారని, బీఆర్ ఎస్ ప్రభుత్వం రూ. 7500 కోట్ల రైతుబంధు ఇవ్వాల్సి ఉంటే దాదా పు రూ. 6 వేల కోట్ల మొదటి నెల రోజుల్లోనే ఇచ్చామని, మిగిలిదా ని విషయంలో ఆలస్యం జరిగి ఉండొచ్చని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇవ్వాల్సింది ఇంకా చాలా ఉందన్నారు.
ఎస్ఎల్బీసీ టన్నెల్ విషయంలో సీఎం తప్పుదోవ పట్టించారని, ఒక్క కిలోమీటర్ తవ్వలేదు తప్పు 11 కిలోమీటర్లు తవ్వామన్నారు. రెండు ప్రాజెక్టులను నెల రోజుల్లో కేఆర్ఎం బీకి అప్పగించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఒప్పుకుందన్నా రు. కేంద్రం గెజిట్ కూడా విడుదల చేసిందని, కేంద్రానికి అప్పగిం చకుంటే ఉద్యోగుల సంఖ్య. వారి జీతాలు గురించి ఎందుకు మీటింగ్ ప్రస్తావన వచ్చిందని ప్రశ్నించారు.