Brs ex minister Harish Rao: ప్రజా దీవెన, హైదరాబా ద్: సింగరేణి స్కాం సూత్రధారి రేవం త్ రెడ్డి అయితే పాత్ర ధారి ఆయన బావమరిది సృజన్ రెడ్డి, సాక్షాత్తు దొంగే రే వం త్ రెడ్డి అయినప్పుడు ఇక ఆయనతో మాట్లాడితే న్యాయం జరుగుతుందా అంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హ రీష్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క ప్రెస్ మీట్ ఉల్టా చోర్ కొత్వాల్ కోడాంటే అన్న సామెతను తలపించిందని, స్కాంను సమర్థించు కు నేందుకు సంబంధం లేని కాగితాలతో మసిపూసి మారేడు కాయ చేశారని ఫైర్ అయ్యారు. సైనిక్ స్కూల్ లో బట్టలు ఆరబెట్టే మిషన్ కోసం పెట్టిన నిబంధనను తెచ్చివేల కోట్ల సింగరేణి ఓబీ కాంట్రాక్టులకు ముడి పెట్టడం హాస్యాస్పద మ ని, ఇది ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని వ్యాఖ్యానిం చారు.
సింగరేణి కుంభకోణంపై మాజీ మంత్రి, బిఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడ ర్ హరీష్ రావు మీడియా సమావేశం వెల్లడించిన ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే…జనవరిలో సైట్ విజిట్ లేకుండా 7శాతం తక్కువకు టెండర్లు ఖరారైతే మే నెలలో ఆనిబంధన పెట్టి అంచనా రేట్ల కంటే ఎక్కువకు ఎందుకు కట్టబెట్టారు. సింగరేణికి వచ్చిన 6,900 కోట్ల లాభాలను దా చిపెట్టి, కార్మికుల బోన స్‌లో కోత విధించారు. ఆడబ్బును రేవంత్ రెడ్డి తన సోకులకు, ఢిల్లీకి కప్పం కట్టడానికి వాడు కుంటున్నారు.
కాంగ్రెస్ పాలనలో జాబ్ క్యాలెండర్ లేదు కానీ రేవంత్ రెడ్డి స్కాంల క్యాలెండర్ మాత్రం పక్కాగా అమలవుతోంది. ఈ మొత్తం కుంభకోణంపై తక్షణమే సిట్టింగ్ జడ్జి లేదా సీబీఐ వి చారణ జరిపించాలి. నిన్న భట్టి విక్రమార్క హరీష్ రావు నా కు లేఖ రాయండి, నేను రేవంత్ రెడ్డి తో మాట్లాడతా అం టున్నారు. రేవంత్ రెడ్డి దొంగ, రేవంత్ రెడ్డి బావమరిది ఈ స్కాంలో మొదటి లబ్ధి దారుడు, సాక్షాత్తు ముఖ్యమంత్రే ఈ అవినీతికి సూత్రధారి, పాత్ర ధా రి అని మేం చెప్తుంటే ఇంకా రేవంత్ రెడ్డితో మాట్లాడితే ఏం వస్తుంది.
భట్టి ప్రెస్ మీట్ చూస్తుంటే ఉల్టా చోర్ కొత్వాల్ కోడాంటే అ న్న సామెత గుర్తుకొస్తున్నది. బొగ్గు కుంభకోణంపై స్పష్టమైన సమాధానం ఇ వ్వకుండా మాటల గారడీతో, నాలుగు కాగి తాలు చూపి మసిపూసి మారేడు కాయ చేసే ప్రయత్నం భ ట్టి చేశారు. సైట్ విజిట్ సర్టిఫికెట్‌పై భట్టి విక్రమార్క అబద్ధా లను వండి వార్చారు.సింగరేణి కాలరీస్ అనేది తెలంగాణ ప్రజల ఆస్తి. ఇది ఏ ఒ క్కమంత్రికో, ప్రభుత్వానికో, కొద్ది మం ది కాంట్రాక్టర్లకో చెందిన సంస్థ కాదు.సింగరేణిలో పారదర్శ కత, పోటీ, న్యాయం అనే మౌలిక సూత్రాలతో నడుస్తున్నది. సింగరేణి టెండర్ ప్రక్రియను చూస్తే ఈ మూడు సూత్రాలకు మంగళం పాడారు అని స్పష్టమవుతున్నది.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ విధానాలన్నీ పక్కన పెట్టి అవస రమైన చోట వారి అనుకూలమైన విధానాలను మార్చుకున్నారు.సింగరేణి స్కామ్‌కు ఎవరు బాధ్యులు? ఎంత నష్టం జరిగింది? లబ్ధి పొందిన వారు ఎవరు? ఈ మూ డు కీలక ప్రశ్నల్లో ఒక్కదానికైనా భట్టి సమాధానం చెప్పకుం డా దాటివే శారు.సింగరేణి కుంభకోణంపై దేశ వ్యా ప్తంగా చ ర్చ జరుగుతున్నది. ముఖ్యమంత్రి, ఆయన బావమరిది బా గోతం బయటపడకుండా కా పాడే ప్రయత్నం భట్టి చేస్తున్నా రు.
తన 40 ఏళ్ల అనుభవాన్ని ఉప యోగించి ముఖ్యమంత్రిని బొగ్గు స్కాండల్ నుంచి బయటప డే. సేందుకు విఫల ప్రయ త్నాలు చేస్తున్నారు. తమ అనుయాయులకు టెండర్లు దక్కే విధంగా విధానాలు మార్చారు.2018లోనే సైట్ విజిట్ సర్టి ఫికెట్ ప్రతిపాదన ఉందని భట్టి విక్రమార్క నిన్న చెప్పారు. కానీఈ సైట్ విజిట్ సిఫార్సు 2018లో ఎ టువంటి పనుల కోసం ఇచ్చారనేది చెప్ప లేదు.CMPDI సిఫార్సు ఇ చ్చింది అని భట్టి బయటపెట్టిన డాక్యుమెంట్ ఇది.. ఇందులో సైట్ విజిట్ సర్టిఫి కెట్ ఎటువంటి ప ను ల కోసం పెట్టారనేది స్ప ష్టంగా ఉంది.
భట్టి 2018లో సెంట్రల్ మైన్ ప్లానిం గ్ అండ్ డిజైన్ ఇన్‌స్టి ట్యూట్ లిమిటెడ్ (CMPDI) సైట్ విజి ట్ కన్ఫర్మేషన్ సర్టిఫి కేట్ ను ప్రతిపాదించిందని చెబుతున్నారు. కానీ ఇ క్కడే ఒక అత్యంత కీలకమైన, మౌ లిక ప్రశ్న తలెత్తుతుంది? ఆ సిఫా ర్సు అసలు ఎటువంటి పనుల కో సం? అది కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ల కోసమా? కోల్ ఎవాక్యుయేషన్ సి స్టమ్‌ల కోసమా? స్క్రీ నింగ్ లేదా వాషింగ్ ప్లాంట్ల కోస మా? లేదా ని జంగానే OB (ఓవర్ బర్డన్) రిమూ వల్ పనుల కోసమా? సైట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్” అనేది పరి మిత ప్రాంతాల్లో (Conf in ed Are a) జరిగే డిజైన్, సరఫరా, ఇన్‌స్టా లేషన్, కమిషనిం గ్ (DS EC) పను లకు మాత్రమే వర్తించే సాంకేతిక నిబంధ న.
సైనిక్ స్కూల్ వాళ్ళు ఒక టెండర్ పిలిచారు, ఇందులో సప్లై అండ్ ఇన్‌స్టాలేషన్ ఆఫ్ క్లాత్ డ్రైయర్ కోసం సైట్ విజిట్ పె ట్టారు. దాన్ని తీసుకొచ్చి సింగరేణి ఓబీ కాంట్రా క్టుకు లింకు పెట్టి చూపడం హాస్యా స్పదం.నిన్న భట్టి విక్రమార్క చూ పిం చిన ఈ డాక్యుమెంట్లో ఎక్కడై నా OB రిమూవల్ కోసం సైట్ వి జిట్ సర్టిఫికెట్ పెట్టారా? ఎక్కడ కూడా ఓబీ రిమూవల్ కాంట్రాక్టుకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వలేదు. ఓబీ రిమూ వల్ కాంట్రాక్టు పద్ధతికి వర్తించని నిబంధనలు చూపించి ప్ర జలను తప్పుదోవ పట్టించే ప్రయ త్నం చేశారు. గతంలో ఎ ప్పుడూ కూడా ఓబీ వర్క్స్ కు సైట్ విజిట్ సర్టిఫికెట్ విధా నం లేనేలేదు.
మరో ముఖ్యమైన అంశం.. నిజం గా CMPDI సిఫార్సు OB పనులకే అయితే, 2018 నుంచి 2024 వర కు సింగరేణి పిలిచిన వందలాది OB టెండర్లలో ఈ షరతు ఒక్కసా రి కూడా ఎందుకు లేదు?2018 నుంచి 2024 వరకు ప్రతి OB టెండర్‌లో ఈ షరతు లేదు. మరి ఇప్పుడు, 2025–26లో మాత్రమే, అదీ కొన్ని ఎంపిక చేసిన టెండర్లకే, ఈ షరతు ఎందుకు అకస్మాత్తుగా తీసుకొచ్చారు? OB విషయంలో సై ట్ విజిట్ కన్ఫర్మేషన్ సర్టిఫికేట్ విధానం తెచ్చింది మీరు అధికారం లోకి వచ్చిన తర్వాతే అన్న నిజా న్ని ఎందుకు ఒప్పుకోలేదు భట్టి గారూ? 2025 జనవరిలో భూపా లపల్లి టెండర్‌కు సైట్ విజిట్ షర తు లేకుండానే రివర్స్ ఆక్షన్ ద్వా రా అంచనా రేట్ల కంటే 7% తక్కు వకు పనులు అప్పగిం చా రు. అ ప్పుడు సైట్ విజిట్ అవసరం లేదా?
కానీ మూడు నెలల్లోనే 2025 మే లో VK OC టెండర్‌కు మా త్రం సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతు పెట్టారు? పోటీ తగ్గి పోయింది. ఫలితంగా అంచనా రేట్లకంటే ఎక్కువ రేట్లకు ల బ్ధిదారులు సృజన్ రెడ్డి Shoda Constructions కాంట్రా క్టర్‌కు ప ని దక్కింది.ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లు సైట్ విజిట్ సర్టిఫికెట్ పెట్టడం వల్ల మొట్టమొదటి లబ్ధిదారుడు ముఖ్య మంత్రి బావమరిది సృజన్ రెడ్డి. అన్ని ఓబీ వర్క్స్ కు సైట్ విజి ట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టి అన్ని రింగ్ చేయడం, +7% నుండి + 1 0% కు టెండర్ వేయడం, ఏటీ ఎం లో వచ్చిన 10% క్యాష్ డౌన్ చే యాలి అనే నిబంధన పెట్టుకున్నారు. 2025 మే తర్వాత ఓబీ రిమూవల్ కాంట్రాక్టర్లకు ఏ టెండర్ వచ్చినా, సైట్ విజిట్ సర్టిఫికెట్ ఎవరికి ఇవ్వాలన్నా ఈయనే రింగ్ మాస్టర్ సృజన్ రెడ్డి.
ఇంత స్పష్టంగా నేను బయటపెట్టి నా కూడా స్కాం జరగలే దని భట్టి బుకాయించడం శోచనీయం. ఒక నైని గోల్డ్ బ్లాక్ టెండర్ రద్దు చేయడమే కాదు, సైట్ విజిట్ సర్టిఫికెట్ తో ఖ రారైన టెండర్లన్నీ రద్దు చేయాలి.ఇప్పటికే కొన్ని అవార్డు అ యిన టెండర్లు ఉన్నాయి, మరి కొ న్ని టెండర్ ప్రక్రియ తొలి దశలో ఉ న్నాయి, ఇంకొన్ని టెండర్ దాఖలు చేసే దశలో ఉ న్నాయి.సైట్ విజిట్ సర్టిఫికెట్ అనేది లోపభూయి ష్ట మైన ది. ఇందులో అవినీతి జరు గుతున్నదని స్పష్టంగా ప్రజలకు అర్థమైంది.మీకు పారదర్శకత్వం ఉంటే, నిజాయితీ ఉంటే సై ట్ విజిట్ సర్టిఫికెట్ మీద జరిగిన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్, మిగతా అన్ని టెండర్లను క్యాన్సిల్ చేయాలని బిఆ ర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది.
మే 2025 తర్వాత పిలిచిన టెండ ర్లలో చాలా మంది కాం ట్రాక్టర్లు సైట్ విజిట్ చేశారు. లేఖలు ఇచ్చారు, అధికారిక ఇ మెయిల్స్ పంపారు, ఫోటోలు కూడా జతచేశారు. అయి నా వారికి సర్టిఫికెట్లు ఇవ్వలేదు.టెండర్ చివరి గంట వరకు కాం ట్రాక్టర్లను వేచిచూసేలా చేసి, కేవలం 2–3 సంస్థలకు మాత్ర మే పాత తే దీలతో బ్యాక్‌డేటెడ్ సర్టిఫికెట్లు జారీ చేశారు. టెండర్ డాక్యుమెంట్‌లో సైట్ విజి ట్ చేసిన వెంటనే స్థానిక GM స ర్టి ఫికేట్ ఇవ్వాలి అని స్పష్టంగా ఉం ది. మరి సైట్ విజిట్ చేసినప్పటికీ ఎందుకు ఇవ్వలేదు? ఈ ఆలస్యం వెనుక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? ఏ చీకటి ఒప్పందం ఉంది? ఎవరి వాటాలు, కమిషన్లు దాగి ఉన్నా యి? నైనీ టెండర్‌ను 2021, 202 2లో రెండు సార్లు పిలిచినప్పుడు సైట్ విజిట్ సర్టిఫికేట్ షరతే లేదు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అవసరం లేనిది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం లో అకస్మాత్తుగా ఎందుకు అవస రమైంది? మే 2025 నుంచి ఇప్పటి వరకు ఎన్ని కాంట్రాక్టర్లు సైట్లు సం దర్శించారు? ఎన్ని ఇమెయిల్స్, లేఖలు వచ్చాయి? ఎన్ని సర్టిఫికె ట్లు జారీ అయ్యాయి? మిగిలిన వా టిని ఎందుకు కారణం చెప్పకుండా తిరస్కరించారు? దీనిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం. NCC కంపెనీ, GRN కం పెనీ, మహాలక్ష్మి కంపెనీ ఇలా ఎ న్నో కంపెనీలు మెయిల్ చే శాయి మాకు సైట్ విజిట్ సర్టిఫికెట్ ఇవ్వ డం లేదని. ఈ మె యిల్స్ అన్ని బయటపెట్టాలని డిమాండ్ చేస్తు న్నాం. మీరు బయట పెట్టకపోతే మేమే ఆ మెయిల్స్ ను బయటపె డ తాం.
జిఎం ఆఫీసు ముందు సెల్ఫీలు పె ట్టుకున్నారు, ఇది నిజ మా కాదా? ఇంతకంటే ప్రూఫ్ ఏం కావాలి? సాధారణంగా టెండర్ షరతులు మార్చిస్తే అన్ని కాంట్రాక్టర్లతో సమా వేశం పెట్టాలి. వారి అభిప్రాయాలు తీసుకోవాలి. మినిట్స్ నమో దు చేయాలి. కానీ ఇక్కడ అది జరగలేదు. ఈ తతంగం వె నుక ఏం జరిగింది? మీటింగ్ మినిట్స్ బహిర్గతం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికి ఓబీ స్కాం, సోలార్ స్కాం మాత్రమే చెప్పాను. సింగరేణిలో ఇంకా అనేక స్కాములు ఉన్నాయి.
ఈ కుంభకోణంలో కింగ్ పిన్ ఏ హోటల్లో మీటింగ్ పెట్టాడు? ము ఖ్యమంత్రి బంధువు కూడా ఆ హో టల్లో కూర్చున్న ఫోటోలు మా దగ్గ ర ఉన్నాయి. అవి టైం వచ్చిన ప్పు డు బయటపెడతాం.డీజిల్‌ను కాం ట్రాక్టర్ల పరిధిలోకి తెచ్చిన తర్వాత టర్నోవర్ అర్హత పెంచి 20 ఏళ్ల అ నుభవం ఉన్న స్థానిక కాంట్రాక్టర్లను పక్కన పెట్టారు. ఇక నుంచి డీజిల్ కాంట్రాక్టర్ల పరిధిలోనే ఉంటే, ఉన్న కాంట్రాక్టర్లు స్వయంగా డీజిల్ కొను గోలు చేసుకునే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు?
మీ స్వార్థం కోసం మైనింగ్ అను భ వం లేని కొత్త కాంట్రాక్ట ర్లకు దారులు తెరిచారు.మేము బొగ్గు స్కాం అని భయ పెట్ట గానే నాలుగు పేపర్లు ప ట్టుకొని వచ్చి, మీడియాని సైతం త ప్పుదారి పట్టించే ప్రయత్నం చేసి న భట్టి నేను బ యటపెట్టి న సోలా ర్ స్కామ్, పేలుడు పదార్థాల స్కామ్, ఉద్యోగుల డీ–ప్రొమోషన్ వంటి కీలక అంశాలపై ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు. ఎందుకంటే సింగరేణిలో ఒకటి కా దు రెండు కాదు పదుల సంఖ్యలో స్కాములు జరిగిందన్నది వాస్తవం కాబట్టి. అడ్డగోలుగా నిబంధ నలు మార్చి, రేవంత్ రెడ్డి బావమరిదికి, ఇతర అనుయా యులకు టెండర్లు కట్ట బెట్టింది నిజం కాబట్టి.కాంగ్రెస్ రెండేళ్ల పాలనలో స్కీములు రా లే దు గానీ పదుల సంఖ్యలో స్కాం లు మాత్రం వచ్చా యి.ఈరోజు మీ అవినీతి వల్ల సింగరేణిలో అనుభ వం ఉన్న కాంట్రాక్టర్లను లేకుండా చే శారు. అందుకనే రోజురోజుకి సిం గరేణిలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోతున్నది.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నా టి నుండి ఉత్పత్తి పడిపో యింది. బొగ్గు అమ్మకాలు తగ్గిపోయాయి. సింగరేణిలో జ రిగిన స్కాంలు మొ త్తం సంస్థనే ఎఫెక్ట్ చేస్తున్నాయి. ఇ వి నేను చెప్పడం లేదు.. సింగరేణి గణాంకాలే చెబుతున్నాయి. రేవం త్ రెడ్డి పాలనలో అనుభవం ఉన్న కాంట్రాక్టర్లను ప క్కన పెట్టడం వల్ల ఉత్పత్తి పడిపోయింది. BRS హ యాం లో 2021లో 50 MT, 202 2లో 62 MT, 2023లో 70 మి లియన్ టన్నుల ఉత్పత్తి సాధించాం. కాంగ్రెస్ రాగానే 2024-25లో 69 MTకి తగ్గింది.
ఇప్పుడు 2025- 2 6లో (గత 9-10 నెలల్లో) కేవలం 4 3 మిలియన్ టన్నులకు పడిపో యింది. కెసిఆర్ నష్టాల్లో ఉన్న సిం గరేణిని లాభాల బాట పట్టిస్తే… రే వంత్ రెడ్డి 6000 కోట్ల కుంభకో ణంతో సింగరేణికి మచ్చ తెచ్చారు. చంద్రబాబు ఆ పేస్తే, కేసీఆర్ డిపెం డెంట్ ఉద్యోగాలు పునరుద్ధరించి 19,5 00 మందికి ఉద్యోగాలు ఇ చ్చారు. ఇప్పుడున్న 42,000 మం దిలో సగం మంది వారసత్వ ఉద్యో గులే.
కేసీఆర్ నెలకు ఒక మెడికల్ బోర్డు నిర్వహించేవారు. కానీ కాంగ్రెస్ ప్ర భుత్వం రెండేళ్లలో రెండేసార్లు బోర్డు పెట్టింది. మొదటి బోర్డులో 55 మంది వస్తే కేవలం 5 మందిని, రెం డో బోర్డులో 123 మంది వస్తే కేవ లం 23 మందిని మాత్రమే అన్ఫిట్ చేశారు. ఇలా మెడికల్ బోర్డులో కొ ర్రీలు పెట్టి వారసత్వ ఉద్యోగాలను నిర్వీర్యం చేస్తున్నారు.సింగరేణి కా ర్మికులకు యశోద, కిమ్స్ వంటి ఆ సుపత్రులలో కార్పొరేట్ వైద్యం బం ద్ చేశారు. నిమ్స్, ఉస్మానియాకు పొమ్మంటు న్నారు. కేసీఆర్ కార్మి కులకు ఇళ్లు ఇచ్చి ఓనర్స్ చేస్తే… కాం గ్రెస్ ఒక్కరికైనా ప్లాట్ ఇచ్చిం దా? సింగరేణి గడించిన మొ త్తం లాభం 6,394 కోట్లు అయితే, కేవ లం 2,360 కోట్లు మా త్రమే ప్రాఫిట్ గా చూపించారు. మిగతా డబ్బు ఏ మైంది? కార్మికుల బోనస్‌లో కోత పెట్టి, ఆ డబ్బును ఫుట్‌బాల్ సోకు లు, ముఖ్యమంత్రి ప్రచారాలకు వాడుకుంటున్నారు.
రెండేళ్లలో సింగ రేణి అభివృద్ధి కోసం పక్కన పెట్టిన 6,000 కోట్లు ఏమయ్యాయి? ఆ స్కాంను కూడా త్వరలో బయట పెడతాం.సింగరేణిలో 51% వాటా రాష్ట్రానిది, 49% వాటా కేంద్రానిది. ఇంత పెద్ద స్కాం జరుగుతున్నా కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది?బీజేపీ, కాంగ్రెస్ కలిసి సింగరేణిని దివాళా తీయించి, ప్రైవేటుపరం చేసే కుట్రలు చేస్తున్నాయి.సైట్ వి జిట్ సర్టిఫికెట్ నిబంధనతో ఖ రా రైన ఓబీ వర్క్స్, సోలార్ పవర్ ప్లాంట్స్ టెండర్లన్నింటినీ తక్షణమే రద్దు చేయాలి. నైనీ గోల్డ్ బ్లాక్ టెం డర్‌తో పాటు, అవినీతి జరిగిన అన్ని టెండ ర్లపై విచారణ జరిపించాలి.
వెంటనే ప్రతి నెలా మెడికల్ బో ర్డులు నిర్వహించి వారసత్వ ఉద్యో గాలు కల్పించాలి. లేదంటే వేల మంది కార్మికులతో సింగరేణి భవ నం ముట్టడిస్తాం.నిరాకరించిన కంపెనీల మె యిల్స్, ఫిర్యాదులపై శ్వేతపత్రం విడుదల చేయాలి. టెం డ ర్ నిబంధనలు మార్చినప్పుడు పెట్టిన మీటింగ్ మినిట్స్ బ యట పెట్టాలి.భట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే, ఈ మొత్తం బొగ్గు కుంభకోణంపై సి ట్టింగ్ జడ్జి లేదా సీబీఐ విచారణ కో రాలని డిమాండ్ చేస్తున్నాం. సిం గ రేణి కార్మికుల కష్టార్జితాన్ని కా పాడే వరకు మేము వదిలిపెట్టం. సిరుల గని సింగరేణిని కా పాడుకుంటామని హరీష్ రావు స్పష్టం చేశారు.

