Praja Deveena
Newspaper Banner
Date of Publish : 24 February 2026, 1:52 pm Posted by : praja deveena

BRS Ex Minister Harish : మాజీ మంత్రి హరీష్ కీలక వ్యాఖ్య, బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరె స్టులు మాని ఆసుపత్రుల నిర్మాణం పూర్తి చేయడం సీఎం దృష్టిపెట్టాలి

 

BRS Ex Minister Harish : ప్రజా దీవెన, వరంగల్: బీఆ ర్ఎస్ హయాంలోనే 24 అంతస్తుల స్లా బులు పూర్తయిన వరంగల్ సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రిని చూస్తుంటే బా ధేస్తోందని, 2024 దసరాకే ఇది ప్రారంభం కావాల్సింది, కేసీ ఆర్ ఉండి ఉంటే ఈపాటికి ప్రజలకు అందు బాటులోకి వ చ్చేదని, కానీ కాంగ్రెస్ వచ్చాక పనులు అటకెక్కి, రెండు దస రాలు పోయి మూడోదసరా వస్తున్నా కదలడం లేదని, రేవం త్ రెడ్డికి ఫ్యూచర్ సిటీ, రియల్ ఎస్టేట్ వ్యాపారం, కాంట్రాక్టర్ల మీద ఉన్న శ్రద్ధ కేసీఆర్ కట్టిన ఈ హెల్త్ సిటీ మీద లేదని మా జీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు తీవ్ర స్థా యిలో ధ్వజమెత్తారు. ఫ్యూచర్ సిటీకి పెట్టిన శ్రద్ధలో 10 శా తం పెట్టినా ఈ పనులు ఎప్పుడో పూర్తయ్యేవన్నారు.

రోగుల బంధువుల కోసం కేసీఆర్ ధర్మశాల నిర్మించాలని ని ర్ణయిస్తే, కాంగ్రెస్ ప్రభు త్వం దాన్ని సగానికి సగంతగ్గించిం ద ని, రోడ్ నెట్వర్క్, ఎలివేషన్ వ ర్క్స్ అన్నీ తగ్గించే శారన్నా రు. కేసీ ఆర్ కి మంచి పేరు వస్తుందనే అక్కసుతోనే ఈ నిర్ల క్ష్యం, ఈ హెల్త్ సిటీకి ఎన్ని నిధులు కావాలో బీఆర్ఎస్ ప్ర భుత్వమే సమకూర్చి పెట్టిం దని, కానీ మీరు డిజైన్ల మార్పు పే రుతో నిర్ణయాలు తీసుకోకపోవడం వల్లే ఆసుపత్రి ప్రారం భానికి నోచుకోవడంలేదని ఆరోపించారు.

వరంగల్‌లో నిర్మిస్తున్న సూపర్ స్పె షాలిటీ ఆసుపత్రి నిర్మా ణ పనులను మాజీ మం త్రి, బీఆర్ఎస్ డి ప్యూటీ ఫ్లోర్ లీడ ర్ హరీష్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలతో కలిసి ప రిశీలిం చారు. ఈ పర్యటనలో హ రీష్ రావు వెంట మాజీ మంత్రు లు ఎర్రబెల్లి దయాకర్ రావు, సత్యవ తి రాథోడ్, ఎమ్మెల్సీలు దేశపతి శ్రీ నివాస్, రవీందర్ రావు, మాజీ ఎం పీ కవిత, మా జీ ఎమ్మెల్యేలు తాటి కొండ రాజయ్య, వినయ్ భాస్కర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, అరూరి రమే ష్, నన్నపునేని నరేందర్, శంకర్ నాయక్, సీనియర్ నాయకులు నా గుర్ల వెంకన్న, మర్రి యా దవరెడ్డి, డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ సహా పలు వురు స్థానిక నా యకులు, కార్యకర్త లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హరీశ్ రావు చేసిన వ్యాఖ్యలు ఆయన మా టల్లోనే,. జూన్ 2న ఆసుపత్రిని ప్రారంభిస్తామని చెప్తున్నా రు. 2000 పడకల ఈ ఆసుపత్రికి 2000 మంది నర్సు లు, 1500 మంది డాక్టర్లు, 1000 మంది పారామెడికల్ సిబ్బంది కా వాలి. ఇంతవరకు రిక్రూట్మెంట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపిందా, నోటిఫికేషన్ ఇచ్చారా? కనీసం సి బ్బంది లేకుం డా హాస్పిటల్ ఎలా ప్రారంభిస్తారు. పేపర్లలో చూస్తే ‘ఓపీ సేవ లు’ ప్రారంభిస్తాం అని రాశారు. ఇది సూపర్ స్పెషాలిటీ హా స్పి టలా? లేక బస్తీ దవాఖానానా.

ఓపీ చూడ్డానికి ఈ హాస్పిటల్ ఎం దుకు? బీఆర్ఎస్ హ యాంలో వరంగల్ గల్లీగల్లీలో బస్తీ దవాఖానా లు పెట్టాం. దీన్ని కూడా మరో బస్తీ దవాఖానా చేయకండి.ఆసుపత్రి ప నుల పురోగతిని పరిశీలించిన అ నంతరం హరీష్ రావు మీ డియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు.మాదెబ్బకే సీఎంకు సోయి వ చ్చిం ది మొన్న మేము దేవాదుల ప్రాజెక్టును సందర్శించినప్పుడు, సమ్మక్క బ్యారేజీలోని 10 మోటా ర్లలో కేవలం 6 మాత్రమే నడుస్తు న్నాయని, రోజుకు 2700 క్యూసె క్కులు ఎత్తాల్సిన చోట 1700 క్యూసెక్కులు కూడా ఎత్తడం లేదని ఎత్తి చూపా మన్నారు.

కాంగ్రెస్ నిర్లక్ష్యం వల్ల ప్రాజెక్టు ఏ వి ధంగా దెబ్బతింటుందో ప్రజల ముం దు ఉంచాం. ఆ దెబ్బకు తెల్లారి ముఖ్యమంత్రి హడావిడిగా రివ్యూ చేసి అన్ని మోటార్లు నడపాలని ఆ దే శించారు. ఇది బీఆర్ఎస్ విజయ మే కాదు, రైతుల విజ యం. డెడ్ లైన్లు మారుతున్నాయి తప్ప.. పనులు కావడం లేదు. మంత్రులు దే వాదుల ప్రాజెక్టు తమ ప్రాధాన్యత అని పదేపదే చెప్తున్నారు, కానీ చే తల్లో మాత్రం అది వారికి చి వరి ప్రాధాన్యతగా మారింది. కేసీఆర్ ప్రభుత్వంలో 7300 కోట్లు ఖర్చు పెట్టి 3 లక్షల 20 వేల ఎకరా లకు సాగు నీరు అందించాం. కానీ ఇప్పుడు కాంగ్రెస్ మంత్రులు డెడ్ లైన్లు మా ర్చుకుంటూ కాలయాపన చేస్తున్నా రు. మంత్రి పొంగు లేటి శ్రీనివాస్ రె డ్డి మార్చి 2026 నాటికి పూర్తి చే స్తామంటే, ఉత్తమ్ కుమార్ రెడ్డి 2027 మార్చి డెడ్ లైన్ పెట్టారు. ఇ ప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఏమో 2 025 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తా మని మరో కొత్త డెడ్ లైన్ పెట్టారు. రోజుకో డేట్ మారుతోందే తప్ప ప్రా జెక్టులో అంగుళం పని కూడా ముం దుకు సాగడం లేదు.

భూసేకరణకు నిధులు విడుదల చే యడం చేతకాని రేవంత్ రెడ్డి, ఉ న్న మోటార్లను నడపలేక రైతుల పంటలు ఎండిపో యేలా చేస్తున్నాడు. రెండున్నరేళ్లలో ముఖ్యమంత్రి గోదావరి మీద ఒక్క ప్రాజెక్టు అయినా కట్టారా? బీఆర్ఎస్ ప్రభుత్వం గోదావరిపై అనేక బ్యారేజీలు ని ర్మించి, 312 కిలోమీటర్ల మే ర గోదా వరిని నిండుకుండలా సజీవంగా ఉంచింది. 9 ఏళ్ల లో మేం 48 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తే, మీ రెండు న్నరేళ్లలో కనీసం లక్ష ఎకరాలకైనా నీళ్లిచ్చారా?

ఇరిగేషన్ మీద అసెంబ్లీలో మాట్లాడతామని ముఖ్యమంత్రి అంటు న్నారు. మేము మీసవాల్‌ను స్వీకరిస్తున్నాం. మైక్ క ట్ చేయకుండా, కెమెరా తిప్పకుండా చర్చకు పెట్టు.. ఎన్ని రో జులైనా, ఏ ప్రాజెక్టు మీదైనా చర్చించడానికి మేము సి ద్ధంగా ఉన్నాం. ప్రజలే న్యాయ ని ర్ణే తలు. ఎవరు ఏం చేశారో అ సెంబ్లీ వేదికగా తేల్చుకుందాం.మొన్న ఉ త్తమ్ కుమార్ రెడ్డి రివ్యూలో మా ట్లాడుతుంటే, ఆయనను ఆపి కడియం శ్రీహ రికి దేవాదులపై మంచి నాలెడ్జ్ ఉంది, నెక్స్ట్ రివ్యూలో ఆ యన్ను పిలవండి అని సీఎం అనడం ఇరిగేషన్ మంత్రిని అ వమానించడమే. నీ సొంత క్యాబినెట్ మంత్రికే ఏమీ తెలి యదని నువ్వే చెప్తుంటే, ఇక నువ్వు వేరే వాళ్లతో ఎలా పను లు చేయిస్తావు రేవంత్ రెడ్డి?

దేవాదులను పక్కనపెట్టి ఆంధ్రాకు నీళ్లు ఎలా వదులుతు న్నావో, నల్ల మల సాగర్ కు ఎలా సహకరిస్తున్నావో తెలంగా ణ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. ముందు ఆ 10 శాతం ప నులు పూర్తి చేసి రైతుల పొ లాలకు నీళ్లివ్వు.వెంటనే ఎక్వి ప్మెం ట్, సిబ్బంది నియామకం పూర్తి చేసి పూర్తిస్థాయిలో ఆ సుపత్రిని ప్రారంభించాలి. లేదంటే బీఆర్ఎస్ పక్షాన ఇక్కడే నిరాహారదీక్షకు దిగుతాం. ఉత్తర తెలంగాణకు సంజీవ ని లాంటి వరంగల్ లో ఆరోగ్య శా ఖ పరిస్థితి దయనీయంగా మారిం ది.

వరంగల్ మంత్రులకు, ఎమ్మెల్యేల కు అసలు సోయి ఉం దా? ఎంజీ ఎం పరిస్థితి చూస్తే వార్తలు రాసి రాసి పత్రికా వి లేకరులే విసిగిపో యారు. రేవంత్ రెడ్డి ఎన్నోసార్లు వ రం గల్ వచ్చినా ఒక్కసారైనా ఎం జీఎంను చూశారా? రెండున్న రేళ్ల లో ఆరోగ్య మంత్రి అటువైపు వెళ్లా రా? ఎంజీఎం ఇప్పు డు ఎలుకలు, పందికొక్కులకు నివాసంగా మారిం ది. వీల్ చైర్లు, స్ట్రెచర్లు, మంచాలు లేవు. టెస్టులకు మెటీరియల్ లే దు.

బీఆర్ఎస్ హయాంలో ఎంజీఎంలో 250 గుండె ఆపరేషన్లు ఉచితంగా చేశాం. కానీ ఇప్పుడు ఆపరేషన్ థియేటర్లలో ఏసీలో నీళ్లు కారుతు న్నాయని థియేటర్లనే మూసేశారు.
రోగులను హైదరాబాద్ కు పంపిస్తు న్నారు. మేము కేథలాబ్ లు, మూ డు ఆక్సిజన్ ప్లాంట్లు ఏర్పాటు చేసి మీ చేతిలో పెడితే, వాటిని నడిపిం చే సత్తా కూడా మీకు లేదు.ఎక్స్‌రే మిషన్లు పనిచేయవు. ఆయుష్ ఆ సుపత్రిలో మందులు లేవు. ఎంజీ ఎంను తక్షణమే సమీక్షించి, అవు ట్ సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్ వేతనాలు చెల్లించాలి.

పాత కబుర్లనే తీపి కబుర్లుగా సీ ఎం చెప్తున్నారు. ఖమ్మం జిల్లాలో మైసయ్య అనే రిటైర్డ్ ఎస్సై వైద్యా నికి డబ్బులు లేక ప్రాణాలు కోల్పో యాడు. వెంటనే పీఆర్సీ అమలు చేసి, బకాయిలు చెల్లించండి. బీఆ ర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగులతో పా టు జర్నలిస్టులకు ఫ్రీ హెల్త్ స్కీమ్ తెచ్చింది. ఉద్యో గు లకు 1% కంట్రి బ్యూషన్ తో, జర్నలిస్టులకు పూర్తిగా ఉచి తంగా సేవలు అందించా లని నిర్ణయించాం. కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం జర్నలిస్టులను చూస్తేనే విసుక్కుంటోంది.

కేసీఆర్ రూ. 100 కోట్లతో జర్నలి స్టుల సంక్షేమ నిధి ఏర్పా టు చేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఈ రెండు బడ్జెట్లలో జ ర్నలిస్టుల కోసం ఒ క్క రూపాయి అయినా కేటాయిం చిం దా? రెండున్నరేళ్లలో ఒక్కరికై నా కొత్త అక్రిడేషన్ కార్డ్ ఇచ్చా రా? జర్నలిస్టులకు ఎలాంటి నిబంధ న లు లేకుండా అక్రిడే షన్లు ఇవ్వాలి.బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసి నట్లుగా జర్నలిస్టుల యాక్సిడెం ట ల్ ఇన్సూరెన్స్ కు ప్రభుత్వమే ప్రీ మియం చెల్లించాలి. లేదంటే ప్ర మాదవశాత్తు జర్నలిస్టులు మర ణి స్తే వాళ్ల కుటుంబాలు రోడ్డున పడ తాయి. ఎంప్లా యిస్ హెల్త్ స్కీ మ్‌ ను, జర్నలిస్టుల హెల్త్ స్కీమ్‌ను స మా నంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

నిన్న వరంగల్‌లో కార్పొరేటర్లను, మొన్న బాల్క సుమన్‌ను, ఆమన్‌ గల్లులో బీఆర్ఎస్ కార్యకర్తలను అక్రమంగా అరెస్టు చేశారు. కక్షలు కట్టడం కాదు, ముందు ఆసుపత్రి కట్టు రేవం త్ రెడ్డి. ఆసుపత్రి పూ ర్త యితే కొన్ని వేల మంది పేదలకు వై ద్యం దొరుకుతుంది. కేసీఆర్ మీద పడి ఏడ్వడం మానేసి, 2 0 లక్షల స్క్వేర్ ఫీట్స్ తో కడుతున్న ఈ ఆ సుపత్రిని వెంటనే పూర్తి చేసి ప్రజ లకు అంకితం చేయాలని డిమాండ్ చేస్తు న్నామని హరీష్ రావు వ్యాఖ్యానించారు.