Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS ex minister jagadeeshReddy : కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం

--బూతు పురాణాలు, ఫెక్ న్యూస్ లతో గడుపుతున్నారు --పంటలు ఎండి రైతు పాట్లు పడుతుంటే పట్టింపే లేదు --ప్రజల కోసమే తపనపడే కెసిఆర్ వెంట్రుక కూడా పీకలేరు --నకిరేకల్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

కాంగ్రెస్ ప్రభుత్వం కాలక్షేపం

–బూతు పురాణాలు, ఫెక్ న్యూస్ లతో గడుపుతున్నారు
–పంటలు ఎండి రైతు పాట్లు పడుతుంటే పట్టింపే లేదు
–ప్రజల కోసమే తపనపడే కెసిఆర్ వెంట్రుక కూడా పీకలేరు
–నకిరేకల్ కార్యకర్తల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి

ప్రజా దీవెన, నకిరేకల్: అధికారం లోకి వచ్చిన నాటి నుంచి ప్రతి రో జూ కేసులు, ఫేక్ న్యూస్ లు, తిట్ల పురాణాలూ తప్ప కాంగ్రెస్ కు మ రో పని లేకుండా పోయిందని మాజీ మంత్రి, సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ( jagadeeshReddy) ఆరోపించారు.

తెలంగాణ లో పంట పొలాలు ఎండి రైతులు ఇబ్బందులు పడుతుం టే అవి ఏమా త్రం పట్టడం లేదని ద్వజ మెత్తారు. రైతులు ఆత్మహ త్యలు చేసుకుం టున్నారని, 200 మంది వరకు రైతులు చనిపోయా రని గుర్తు చేశా రు. ఫోన్ ట్యాపింగ్ లోనూ ఇప్పటి వరకు ఏమీ తే ల్చారో వారికే తెలియక తకమిక పడుతున్నారని ఎద్దేవా చేశారు.

మునుగోడు ఎమ్మె ల్యే రాజగోపాల్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తే ఆయన ఎందుకు పిర్యాదు చేయడం లేదని ప్ర శ్నించారు. కాళేశ్వరం మీద ఇలానే రాసారని, ప్రజలకుఛ్చిన హామీల నుంచి తప్పించుకునేందు కు ఇలాంటి ఫేక్ న్యూస్ వార్తల డ్రామాలు మొదలుపెట్టారని దుయ్య బట్టారు. ఎందులో విచారణ చేసుకున్నా ఇబ్బంది లేదన్న ఆనాడే చెప్పినామని గుర్తు చేశారు.

ప్రతినిత్యం ప్రజ ల కోసం పొట్లాడే కెసిఆర్ వెంట్రుకను సైతం పీకలేర ని సవాల్ విసి రారు.నల్లగొండ జిల్లా నకిరేకల్ నియోజ కవర్గ కార్యక ర్తల సన్నాహక సమా వేశంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. రైతు ల పొలాలు ఎండుతు న్నా పట్టించుకుంటలేని దుస్థితి దాపురించిం దని, ఇందుకు ప్రభుత్వ నిర్లక్ష్యమే నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుం దని అన్నారు.

మంత్రు లు, ఎమ్మెల్యేలకు ఇది పట్టడం లేదన్నారు. ప్రతిపక్షంలో ఉన్నాం కాబ ట్టి మనమే దైర్యం చెప్పేందుకు ముందుకు కదిలామని, స్వయంగా కెసిఆర్ సూర్యాపేటకు వచ్చి రైతుల బాధలు విన్నాడని తెలిపారు. ఎండిన పొలాలకు రూ. 25 వేల చొప్పున పరిహారం అడి గారని, రుణమాఫీ చేయకపోవడం వాళ్ళ రైతులకు కొత్తగా రుణాలు దొరకడం లేదని విచారం వ్యక్తం చేశారు.

ఇప్పటి వరకు రూ. 500/ బోనస్ కూడా ఇవ్వడం లేదని, రైతులు అధైర్య పడొద్దని కెసిఆర్ చెప్పారని, కానీ రైతుల మరణాల లిస్ట్ కా వాలని రేవంత్ రెడ్డి అడిగితే నాలుగు గంటల్లోనే పంపినా ఇంత వ రకు దీనిపై పట్టింపు లేదని దుయ్యబట్టారు. వీరి ఇవేవి కూడా పట్టిం చుకోకుండా కెసిఆర్ లాగు ఊడ గొడతా, ఆయనొక రండ అంటూ బూతు పురాణాలు చెబుతున్నారని, ఇదేనా మీ సంస్కృతి అని ప్ర శ్నించారు.

వ్యాపారస్తుల జేబులు కొడుతున్నా రని, బ్లాక్ మె యిల్ చేసి డబ్బు లు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.మంత్రి కోమటి రెడ్డి ఎటూ పోయాడని, మిర్యాలగూడలో ఆయన ఫో న్ చేస్తే ధాన్యం ధర మ రింత తగిందని, మిలర్ల వద్ద డబ్బులు తీసు కుని రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.రైతుల చెమట తాగి ఈ ప్రభుత్వం బతు కు తుందని, ఢిల్లీకి కప్పం కడుతున్నారని ధ్వజమెత్తారు.

ప్రభుత్వ వైఫల్యాలు బయట పడ కుండా కేసుల పేరుతో కాలం నెట్టు కొస్తున్నా రని, రేవంత్ రెడ్డికి మోడీ గుజరాత్ పాలన ఆదర్శమని అంటూ ఉన్నోడిని పెద్దోడ్ని చేయడమే అయన పాలన అని వివరిం చారు.బీజేపీ వాళ్లకు ప్రజల కష్టాలు పట్టడం లేదని, రైతుల వద్దకు వెళ్లడం లేదని, కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని ఆరోపించారు.

రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డిలు కలసి బిఆరెస్ మీద కుట్రలు చేస్తున్నా యని, వాళ్ళు ఇద్దరూ కలిసి డమ్మీ అభ్యర్థులనూ పెట్టుకున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీళ్లు ఇవ్వలేక కేయర్ఎంబీ పై తప్పుడు మాటలు చెప్పారని, కెసిఆర్ పైన నెపం నెట్టాలని చూసా రని, కెసిఆర్ నల్లగొండ మీటింగ్ లో మాట్లాడితే భయపడిపోయారని గుర్తు చేశారు.

కెసిఆర్ బయటకు వస్తా అనగానే కాళేశ్వరం నీళ్లు ఇచ్చారని, ఇదే పని మూడు నెలల కిందట చేస్తే ఒక్క ఎకరం ఎండేది కాదని తెలి పారు. కేవలం కెసిఆర్ మీద కుట్రలతోనే రైతుల జీవితాలతో ఆటలా డారని, రైతులను నష్ట పరిచారని ఆందోళన వ్యక్తం చేశారు.అసెంబ్లీ ఎన్నిక ల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలపై ప్రజల్లోకి వెళ్ళాలని పిలుపు నిచ్చారు.

420 హామీ లిచ్చి మోసం చేసిన 420 పార్టీ కాంగ్రెస్ అని ప్రజలకు చెప్పాలని సూచించారు. బిఆరెస్ పార్టీ గెలిస్తేనే ప్రజలకు ఉపయోగ మని, అం దరం కంకణం కట్టుకుని కెసిఆర్ ని నిలబెట్టు కుందామని, బిఆరెస్ నూ గెలిపించు కుందామని కోరారు.

ఈ సమావేశంలో భువ నగిరి బిఆర్ఎస్ అభ్యర్థి క్యామ మల్లేష్, జ డ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే లు చిరుమర్తి లింగ య్య, బూడిద బిక్ష్మయ్య గౌ డ్, మాజీ ఎంపీ లింగయ్య యాదవ్, వి ద్యావేత్త నరసింహ రెడ్డి, చెరు కు సుధాకర్, ఇతర ముఖ్య నాయకు లు, కార్యకర్తలు పాల్గొన్నారు.