Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS ex minister jagadeeshReddy : ప్రజా సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ప్రధాన ఎజెండా

--రైతుల కోసం పరితపించే రైతు భాంధవుడు కేసీఆర్ --కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలు --వాగ్దానాల పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రజలు గ్రహించారు --ఈ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కులేదు --ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఎంపి స్థానాల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం

ప్రజా సంక్షేమమే బీఆర్‌ఎస్‌
ప్రధాన ఎజెండా

–రైతుల కోసం పరితపించే రైతు భాంధవుడు కేసీఆర్
–కాంగ్రెస్ పార్టీవి మోసపూరిత వాగ్దానాలు
–వాగ్దానాల పేరుతో జరుగుతున్న మోసాన్ని ప్రజలు గ్రహించారు
–ఈ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కులేదు
–ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రెండు ఎంపి స్థానాల్లో బిఆర్ఎస్ విజయం ఖాయం
ప్రజా దీవెన సూర్యాపేట: అమలు కు ఆచరణకు సాధ్యంకానీ హా మీలతో ప్రజలను బురిడీ కొట్టించి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి ,సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ( brs jagadish Reddy) విమర్శించారు. ఆత్మకూరు మండల కేంద్రం  బుధవారం బీఆర్‌ఎస్‌ నాయకుల తో కలిసి ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డికి మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

ఈ సంధర్బంగా ఆయన మట్లాడుతూ కాంగ్రెస్‌ సర్కారు అధికారం చేపట్టి ఐదు నెలలు పూర్తవుతున్నా ఒక్క హామీ ( guarantees)  కూడా అమలు చేయడం లేదని, గత ప్రభుత్వానికి చేపట్టిన పథకాలే అమలవుతు న్నాయన్నారు.ప్రభుత్వ తీరు చూస్తుంటే రాబోయే రోజుల్లొ రైతు బం ధు, రైతు బీమా వంటి పథకాలు కనుమరుగు చేసేలా కని పిస్తుందని అన్నారు.

రైతుల కోసం నిరంతరం పరితపించే నాయకుడు కేసీఆర్ మాత్రమే అన్న జగదీష్ రెడ్డి, రైతు సంక్షేమ ప్రభుత్వం బిఆర్ ఎస్ అన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపిస్తేనే హామీలు నెరవేర్చు తామని స్వయంగా సీఎం రేవంత్‌రెడ్డి ( CM RevanthReddy) చెబుతున్నాడని, ఈ విష యా న్ని ప్రజలు గమనించాలన్నారు.పేదల కుటుంబాలలో వెలుగులు నిండాలంటే బిఆర్ఎస్ అభ్యర్థులు కంచర్ల కృష్ణారెడ్డి క్యామమల్లేష్ లు ఎంపిలుగా గెలవాలన్నారు.

కాంగ్రెస్‌ కబంద హస్తాల నుంచి తెలంగాణకు విముక్తి కలగాలంటే బీఆర్‌ఎస్‌ పార్టీనిఆదరించాలన్నారు.ప్రజల సంక్షేమమే బీఆర్‌ఎస్‌ ఎజెండా అన్న జగదీష్ రెడ్డి, ప్రజలు ఆలోచించి ఓటేయాలని కోరా రు. మోసపూరిత వాగ్దానాల తో ప్రజలను ఇప్పటికే  మోసం చేసిన కాంగ్రెస్ మరోసారి చేస్తున్న తప్పుడు హమీలను ప్రజలు పసిగట్టా రాని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్ధ పాలనతో పడుతున్న ఇబ్బందులను, ప్రజలే మాకు వివరిస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్‌, బీజేపీ దొందుదొందే అన్న ఆయన ఈ పార్టీలకు ఓటు అడిగే నైతిక హక్కులేదన్నారు. ప్రచారంలో వస్తున్న అపూర్వ స్పందన ఇప్ప టికే బీఆర్ఎస్ అభ్యర్థుల విజయాన్ని ఖాయం చేసిందన్న జగదీష్ రెడ్డి మే 13న పోలింగ్ బూతులలో ప్రజలు ఇచ్చే తీర్పుతో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ గల్లంతవ్వడం ఖాయమన్నారు.

*నిలిచిన రైతు బంధు , పంట నష్టపరిహారం…* రైతు బంధు పై రేవంత్ దొంగ నాటకాలు ఆడుతు న్నారని, రైతు బంధు వేసినట్టు చేసి మళ్లీ ఆగేలా చేసిoది రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభు త్వ మేనని ఆరోపించారు. రైతుల విషయంలో రాజీలేదు ఓట్ల రాజ కీయం మాకు అవసరంలేదని, ఎన్నికల కమీషన్ కి రాయండి మద్ద తిస్తామని గతంలోనే కేసీఆర్ ( kcr ) గుర్తు చేశారన్నారు.

యాసంగి సాయం అందకముందే ఖరీఫ్ సీజన్ మొద లైందని, ఖరీ ఫ్ రైతు భరోసా పై రేవంత్ ప్రమాణం, ప్రకటన చేయా లని డిమాండ్ చేశారు. ఇచ్చే ఉద్దేశం లేకనే కుంటి సాకులు చెబుతున్నారని దు య్యబట్టారు. ఎన్నికల కమీషన్ దృష్టిలో పడాలనే రేవంత్ వ్యాఖ్యలు చేశారని,రేవంత్ ఇచ్చి నట్టు ఈసీ ఆపినట్టుంది వ్యవహారం అని వ్యాఖ్యానించారు.

రైతు బంధు ను ఎప్పుడు తాము ఆపమనలేదని, రేవంత్ వ్యవహా రం చూస్తే రైతు బంధు ఇక కొనసాగేలా కనిపించ డంలేదని, రైతుల కు ఇదే చివరి రైతు బంధు లా కనపడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.కేసీఆర్ కి మద్దతిస్తేనే కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పినట్లు అవుతుంద పేర్కొన్నారు.

గోదావరి జలాలు తమిళనాడుకు పంచి పెట్టే కుట్ర జరుగుతుందని, బీజేపీ గోదావరి జలాలు తమిళనాడు తరలింపు అంశానికి కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని వ్యాఖ్యానించారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం ఇవ్వాలని,తడిసిన ధాన్యం మద్దతు ధరకు కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఐకేపీ ల్లో ధాన్యం కొను గోళ్ళు ఆలస్యం వల్లే అకాల వర్షాలకు నష్టం జరుగు తుందని తెలిపారు.