
Brs Ex MLA Kancharla Bhupal Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లా కేంద్రంలో ప్రముఖ వ్యాపార కేంద్ర లోని ప్రకాశం బజార్ లో సు దీర్ఘకాలంగా వ్యాపారం చేసు కుంటున్న చిరు వ్యాపారులపట్ల జిల్లా మంత్రితో పాటు అధి కారులు నిర్దాక్షిణ్యంగా వ్యవహరించారని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూ పాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తా రు. ఎన్నికల ముందు ఓ మాట ఎన్నిక తర్వాత మరో మాట చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని ఆరోపించారు.
ప్రకాశంబజార్ లో గత వారం ఎటు వంటి ముందస్తు సమా చారం ఇవ్వకుండా డివైడర్లు తొలగించి చిరు వ్యాపారస్తు లను అక్కడ నుండి తొలగించిన విషయంలో గత 30 సం వత్సరాలనుండి పండ్ల వ్యాపారం చేసుకుంటున్న షేక్ అమీ ర్ సాబ్ నిబంధనలకంటే ఎక్కువగా 35 అడుగులు వెనక్కి జరిగి ఉన్న అమీర్ పండ్ల దుకాణాన్ని మున్సిపల్ అ ధికారు లు, పోలీసులు తొలిగిస్తున్న క్రమంలో అడ్డుకోబోయిన అత న్ని నెట్టి వేయడంతో పక్కనే ఉన్న రేకులపై పడి కాలికి తీవ్ర గాయమైందన్నారు. అమీర్ శుక్రవారం ఆసుపత్రి నుండి డి శ్చార్జ్ కావడంతో పరామర్శకు వెళ్ళిన ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన అధికారుల దాష్టీకాన్ని తీవ్రంగా ఖండించారు. ఓ వైపు ఇంటిగ్రెటెడ్ మార్కెట్ ప్రారంభించ కుండా, తాత్సర్యం చేస్తున్నారని ఆరోపించారు. తక్షణమే ప్రకాశం బజారులో నష్టపోయిన చిరువ్యాపారులకు నష్ట పరిహారం ఇచ్చి చిరువ్యాపారులకు శాశ్వత ఏర్పాట్లు చే యాలనీ అధికారులను కోరారు. ఆయన వెంట నగర సంస్థ అధ్యక్షులు బోనగిరి దేవేందర్, మారగోని గణేష్,రావుల శ్రీని వాస రెడ్డి, SK జహంగీర్, ఇర్ఫాన్,మహమ్మద్ అఫ్జల్ ఖాన్, పాషా తదితరులు ఉన్నారు.



