BRS Formation Day: తెలంగాణ వ్యాప్తంగా బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవం
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆవిభవ దినోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి. బి ఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకత్వం ఆనందోత్సాహాల మధ్య జరుపు కుంది.
తెలంగాణ భవన్ లో కేటీఆర్, సిద్దిపేటలో హరీష్, సూర్యాపేటలో జగదీష్ రెడ్డి ఆద్వర్యంలో వేడుకలు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారత రాష్ట్ర సమితి ఆవిభవ దినోత్సవం(BRS Formation Day ) వేడుకలు ఘనంగా జరిగాయి. బి ఆర్ ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఆ పార్టీ నాయకత్వం ఆనందోత్సాహాల మధ్య జరుపు కుంది. శనివారం తెలంగాణ భవన్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవంలో(BRS Formation Day ) భాగంగా గులాబీ జెండాను ఎగరవేశారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ 2001లో ఉన్న శూన్యం లాంటి వాతావర ణంలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం పార్టీని కేసీఆర్ ఏర్పాటు చేశారని గుర్తు చేశారు.
నాటి పరిస్థితుల దృష్ట్యా అనేక ప్రతికూలతలు ఉన్నప్పటికీ తెలం గాణ కోసం పార్టీని ఏర్పాటు చేశా మని చెప్పారు. కెసిఆర్ నడిపిన తెలంగాణ ఉద్యమం దేశంలోని అనేక రాష్ట్రాలకు, పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామిక ఉద్యమాలకు ఒక దిక్సూచిగా, ఆద ర్శంగా నిలిచిందని వివరించారు. తెలంగాణ ప్రజల సహకారం తోనే తెలంగాణ రాష్ట్రం సహకారం అ యింది మా పార్టీ తరఫున ఏమి చ్చినా వారి రుణం తీర్చు కోలేమని వ్యాఖ్యానించారు. ఆనా డు ఎన్ని రకాల కుట్రలు చేసినా సమైక్యవాద శక్తుల కుట్రలను ఛేదించి టిఆర్ఎస్ తెలంగాణ ప్రజల గొంతు కను అన్ని చట్టసభల్లో వినిపించిందని ఆన్నా రు.
సాధించుకున్న తెలంగాణకు సరైన నాయకత్వం కేసీఆర్ దే అని 2014లో మా పార్టీకి అవకాశం ఇచ్చారని, తొమ్మిదిన్నర సంవత్స రాల పరిపాలనలో దేశంలోనే తెలం గాణ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలి పేందుకు అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు కృషి చేశా మన్నారు. తెలంగాణలో సాధించి న ప్రగతిని ఇతర ప్రాంతాలకు విస్త రించాలన్న ఒక సదుద్దేశంతో భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చి జాతీ య పార్టీగా రూపాంతరం చెందిం దని పేర్కొన్నారు. మహారాష్ట్ర, కర్ణా టక, ఒరిస్సా వంటి రాష్ట్రంలో అ ద్భుతమైన స్పందన లభించిందని, దురదృష్టవశాత్తు తెలంగాణ అసెం బ్లీ ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాకపోవడం మూలంగా కొంత ప్రతిష్ట నెలకొందని విచారo వ్యక్తం చేశారు.
కెసిఆర్ తలపెట్టిన ఏ పని నైనా వదలకుండా ముందుకు తీసు కుపోయిన చరిత్ర గత రెండున్నర దశాబ్దాలలో ప్రజలందరికీ తెలుసని అన్నారు. బోధించు, సమీకరించి, పోరాడు అనే అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఒంటపట్టించుకుని ముం దుకు నడుస్తున్న పార్టీ భారత రాష్ట్ర సమితి(BRS) అని పేర్కొన్నారు. తెలంగా ణ రాష్ట్ర సమితి పార్టీ శ్రేణులు కార్యకర్తలు అందరికీ, మాకoదరికి మద్దతుగా నిలబడిన తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపా రు. విజయాలకు పొంగిపోము, అపజయాలకు కృంగిపోము ఇదే తీరుగా మా ప్రస్థానం ముందుకు సాగిందని గుర్తు చేశారు.భవిష్యత్తు లోనూ ప్రజల కోసం మాట్లాడుతూ నే ఉంటామని, కొట్లాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు.
తెలంగాణ కంటూ ఒక గొంతు ఉండడం అవసరం తెలంగాణ కంటు ఉన్న ఒక ఇంటి పార్టీ టిఆర్ఎస్ తెలంగాణకు స్వీయ రాజకీయ అస్తిత్వమే శ్రీరామరక్ష అన్న జయశంకర్ సార్ మాటలు ఎప్పటికీ వాస్తవంగా నిలుస్తాయని కొనియాడారు. తెలంగాణ ప్రజల కోసం తెలంగాణ ప్రజల ఆకాంక్షల కోసం పోరాడిన గులాబీ దండుకు ప్రాణాలు అర్పించి, తెలంగాణ ఉద్యమం కోసం పోరాడిన వంద లాదిమంది తెలంగాణ అమర వీరులకు పేరుపేరునా ధన్యవా దాలు తెలిపారు.
సిద్దిపేట జిల్లా లో… సిద్దిపేట జిల్లా కేంద్రం లోని జిల్లా పార్టీ కార్యాలయం లో పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పార్టీ జెండాను ఆవిష్కరించారు.ఈ సంద ర్బంగా హరీష్ రావు మాట్లాడుతు 2001 ఏప్రిల్ హైదరాబాద్ జలదృ శ్యం తో ప్రారంభమైన గులాబీ జెం డా ప్రస్తానం ప్రారంభమైందని అన్నా రు. 20 సంవత్సరాల క్రితం ప్రారంభ మైన బిఆర్ఎస్ నేడు దేశానికి ఆద ర్శం అయిందని కొనియాడారు. కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదని, మన పథకాలను కేంద్ర ప్ర భుత్వం కూడా అమలు చేసింది రైతు బంధు పథకాన్ని కేంద్రంలో బీజేపీ కాపీ కొట్టి అమలు చేశారని ఆరోపించారు.
కేసీఆర్ అభివృద్ధి ఆదర్శం ఉంటే, రేవంత్ రెడ్డి తిట్లలో ఆదర్శంగా ఉన్నారని విమర్శిం చారు. రేవంత్ రెడ్డి మన ఎమ్మెల్యే లు తీసుకునే ప్రయత్నం చేస్తున్నా డని, ఇచ్చిన హామీలు అమలు చేయాలని నేను రాజీనామా చేస్తా నన్నాడు. రాజీనామా కోసం జిరాక్స్ పేపరు ఇచ్చిన వ్యక్తి రేవంత్ రెడ్డి, తప్పించుకొని తిరిగిన వ్యక్తి కిషన్ రెడ్డి అని పేర్కొన్నారు.ఆరు గ్యారెం టీలు అమలు చేస్తే నేను రాజీనా మా చేసేందుకు మా కు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు.
సొల్లు కాదు, సీదా మాట్లాడు సూటిగా మాట్లాడాలాని సూచిం చారు. స్పీకర్ పార్మట్ లో ప్రెస్ అకాడమీ చెర్మెన్ శ్రీనివాస్ రెడ్డి కి పంపించు, నేను 5నిముషాల్లో పంపిస్తాను, నాకు పదవులు ము ఖ్యం కాదు రైతులు, ప్రజల ప్రయ జనాలు ముఖ్యమని నొక్కి చెప్పా రు. నాడు ఓటు కు నోటు, నేడు దేవుళ్లపైన ఒట్లు అని ఎద్దేవా చేశారు. ఆగస్టు 15 లోపు రుణ మాఫీ, గ్యారెంటీ లు అమలు చేస్తావో లేదో చెప్పు రేవంత్ రెడ్డి అనే చివర స్థాయిలో మండి పడ్డారు. నేను రుణమాఫీ చెయ్యా లని అడుగుతే కాంగ్రెస్ మంత్రులు నన్ను తిడుతున్నారని, మీ తిట్లను ప్రజలు గమనిస్తున్నారని, హామీలు అమలు అయ్యే వరకు నేను పో రాటం చేస్తునే ఉంటా అని స్పష్టం చేశారు. జిల్లాను తొలగిస్తాని రేవం త్ రెడ్డి మాట్లాడుతున్నారని, సిద్ధి పేట జిల్లాలను ఉడగోట్టాలని చూస్తున్నారని అన్నారు.జిల్లాలు ఉండాలంటే పార్లమెంట్ ఎన్నికలో కాంగ్రెస్ బుద్ధి చెప్పాలని, అన్ని జిల్లాల కేంద్రాల ప్రజలను కోరు తున్నామని చెప్పారు.

సూర్యాపేట జిల్లా లో… సూర్యాపేట జిల్లా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి స్వగ్రా మం నాగారంలో బిఆర్ఎస్ ఆవిర్బావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి.గ్రామస్తులు,బారాసా కార్యకర్తల సమక్షంలో జగదీష్ రెడ్డి కేక్ కట్ చేసి పార్టీ పుట్టిన రోజు వేడుకలు జరుపుకున్నారు. పార్టి అభిమాను లు,నేతలు,కార్యకర్తలు, గ్రామస్తుల నడుమ కేక్ కట్ చేసిన జగదీష్ రెడ్డి ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. సంద ర్భంగా పార్టీ శ్రేణులకు జగదీష్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ పుట్టుక సంచలనం, దారి పొడవు నా రాజీనేని యుద్ధమే అని చెప్పారు. ఆత్మగౌరవం, అభివృద్ధి పరిమళాలు అందుకున్న స్వీయ రాజకీయ పార్టీ బిఆర్ యస్ అని చెప్పారు.
కేసీఆర్ గారి సారథ్యం లో గులాబీ పార్టీ ప్రస్థానం అనితర సాధ్యమని తెలిపారు. నల్లగొండ జిల్లాలో… బీఆర్ఎస్ పార్టీ అవిర్భావ దినోత్సవం వేడుకలు నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. మాజీ మంత్రి జగదీష్ రెడ్డి,ఎమ్మెల్సీ కోటిరెడ్డి, నల్లగొండ ఎంపి అభ్యర్ధి కంచర్ల కృ ష్ణారెడ్డి,మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి,రవీంద్రనాయక్, చిరు మర్తి లింగయ్య, భాస్కర్ రావు లు పాల్గొని ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లా డుతూ బీఆర్ఎస్ పార్టీ మరో ఉద్య మానికి శ్రీకారం చుట్టబోతోందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం అలుపెరగని ఉద్యమం చేసి తెలం గాణ సాధించామని, మోసపూరిత హామీలిచ్చి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని, ప్రజలను మోసం చేసం చేసి గోసకు కారణమైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ పోరాడుతూనే ఉంటుందని పేర్కొన్నారు.
చావు నోట్లో తలపెట్టి తెలంగాణ తెచ్చిన కేసీఆర్ కు పిల్ల మూకలు లెక్క కాదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకా అఖలి చావులు, ఆత్మహ త్యలు పునరావృతమ య్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజలు ఉపాధి కోసం మళ్ళీ విదేశాల బాట పట్టాల్సి వచ్చిందని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, కాంగ్రె స్ సర్కార్ లో పచ్చని పంటలతో కలకల లాడే భూములు బీడుగా మారాయని ఆగ్రహం వ్యక్తం చేశా రు. పదేళ్లలో అత్యద్భుతంగా నిర్మిం చిన తెలంగాణను మూడు నెలల్లో నే కుప్పకూల్చారని ఆరోపించారు. కోమటిరెడ్డి బ్రదర్స్ జీవితంలో నిజాలు మాట్లాడలేదని దుయ్యబట్టారు.
BRS Formation Day celebrations in Telangana