OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

BRS Kaleshwaram High Court case : బిగ్ బ్రేకింగ్, నల్లగొండ బిఆర్ఎస్ నేతల సంచలన వ్యాఖ్య లు, హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ ‘డైవర్షన్’ పాలిటిక్స్‌కు బ్రేక్

 

BRS Kaleshwaram High Court case :  ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో సంచలనాలకు కేంద్ర బిందువైన కా ళే శ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న దుష్ప్రచారానికి హై కోర్టు ఇచ్చిన తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్ నేత లు అభిప్రాయపడ్డారు. నల్లగొండ జిల్లా బీఆర్ఎస్ కార్యాల యంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో పార్టీ ముఖ్య నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించా రు. సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న పీసీ ఘోష్ కమిషన్‌ ను, అందుకు సహకరిస్తున్న కాంగ్రెస్ వై ఖరిని వారు తప్పుబట్టారు.

ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే, జిల్లా బిఆర్ఎస్ పార్టీ అ ధ్యక్షుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ ప్రజా కోర్టులో కాం గ్రెస్ అబద్ధాలు బట్టబ యలయ్యాయని ధ్వజమెత్తారు. “కాం గ్రెస్ పార్టీ గాంధీ భవన్‌లో రా సిచ్చిన స్క్రిప్ట్ ప్రకారమే పీసీ ఘోష్ కమిషన్ నడుచుకుందని హైకోర్టు నిర్ధారించిందని, ఇ ది కాంగ్రెస్, బీజే పీల కుమ్మక్కు రాజకీయాలకు చెం పపెట్టు” అని ఘాటుగా స్పందించా రు. కేవలం కేసీఆర్, హరీష్ రా వులను బదనాం చేయడం కోసం, ఆరుగ్యారెంటీలను పక్క న పెట్టి ప్రభుత్వం ‘డైవర్షన్’ రాజకీయాలకు పాల్పడుతోంద ని ఆరోపించారు.డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులో జరుగుతున్న అన్యాయంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని ప్రశ్నించిన ఆ యన, జిల్లా రైతుల ప్రయోజనాలను కా పాడాలని డిమాండ్ చేశారు.

రాజకీయ కక్షసాధింపు కోసం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టింది అని ఆయన అన్నా రు.ఇప్పటికైనా రాజకీయ కుట్రలు పక్కన పెట్టి రైతన్నల కో సం పని చేయాలి అని ఆయన అన్నారు.రెండున్నరేళ్లుగా కల్పతరువు లాంటి కాళేశ్వరం ప్రాజెక్టును పడావు పెట్టిన రే వంత్ రెడ్డి ఇప్పటికైనా ముక్కు నేలకు రాసి, రాష్ట్రంలోని అ న్నదాతలకు క్షమాపణలు చెప్పాలని ఆయన కోరారు. ఇ ప్పటికైనా చిల్లర రాజకీయాలు బంద్ పెట్టి కుంగిన రెండు పి ల్లర్లను రిపేర్ చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించా లని డిమాండ్ చేశారు.

భారత రాజ్యాంగానికి, చట్టాలకు విరుద్ధంగా ఎవరు వ్యవహ రించినా దేశంలోని గౌరవ న్యాయస్థానాలు చూస్తూ ఊరుకో వని ఈ తీర్పుతో మరోసారి రుజువైందని ఆయన పేర్కొన్నా రు. ఘోష్ కమిషన్ నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వ రాజకీయ కుట్రలకు బ్రేక్ పడినట్లయిందని స్పష్టం చేశారు.అది పీసీ ఘోష్ కమిషన్ కాదని, ముమ్మాటికీ పీసీసీ (PCC) నివేదికని బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి చెబుతు న్న మాట ఇవ్వాళ అక్షరాల నిజమని తేలిపోయిందని అని ఆయన విమర్శించారు.

కమిషన్ విచారణలో సహజ న్యాయ సూత్రాలను పూర్తిగా విస్మరించడమే కాకుండా, నిబంధనలకు పాతరేశారని బీఆ ర్ఎస్ అధినేత కేసీఆర్ గారు గతంలోనే స్పష్టం చేశారని, ఆ విషయాలతో ఇవ్వాళ హైకోర్టు కూడా ఏకీభవించడం హర్ష ణీయమని ఆయన తెలిపారు. రాజకీయ కక్ష సాధింపు కో సం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్న తీరును ఈ తీర్పు ఎండగట్టిందని అభిప్రాయపడ్డారు.ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మేడిగడ్డ బ్యారేజిలో స్వల్పంగా దెబ్బ తిన్న రెండు పిల్లర్లను రిపేర్ చేసి, రాష్ట్రంలోని లక్షలాది మంది రైతుల సాగునీటి కష్టాలు తీర్చాలని సూచించారు.

రాజకీయ క్రీడ కంటే రైతుల ప్రయోజనాలే ముఖ్యమని ఆ యన హితవు పలికారు.గోదావరి జలాలను పక్క రాష్ట్రా నికి దోచిపెట్టి, తెలంగాణలో వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టే కుతంత్రాలను ఇంకా కొనసాగించాలని చూస్తే రేవంత్ సర్కారుకు రైతుల చేతిలో వాతలు తప్పవని హెచ్చరించా రు. ప్రాజెక్టుల నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తూ, రైతుల పొలా లకు నీరు అందకుండా చేస్తున్న ప్రభుత్వ వైఖరిని బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని, రైతుల పక్షాన పోరాటం కొన సాగిస్తామని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు.

మాజీ జిల్లా పార్టీ అధ్యక్షుడు, జెడ్పీ చైర్మన్ బండ నరేందర్ రెడ్డి మాట్లా డుతూ కాళేశ్వరంపై దుష్ప్రచారం తెలంగాణకు ద్రోహం తలపెడుతు న్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైతులకు సాగునీరు అం దు తుం టే, ప్రభుత్వం మాత్రం ఏపీ ప్రయో జనాల కోసం ప్రాజెక్టును నీరుగా రుస్తోందని మండిపడ్డారు. ప్రాజెక్టు కూలిపోయిందంటూ అసత్యాలు ప్రచారం చేయడం వెనుక భారీ కు ట్ర ఉందని, కాళేశ్వరం నిర్మాణం ని జంగానే విఫలమైతే, గంధమల్ల నుంచి ఆలేరుకు నీళ్లు ఎలా వస్తు న్నాయని ఆయన సూటిగా ప్ర శ్నిం చారు.

ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాట్లాడుతూ ఆధారాలు లేని ఆరోపణలు చట్టం ముందు నిలబడవని హైకోర్టు తీ ర్పు మరోసారి నిరూపించింది. కేసీ ఆర్, హరీష్ రావులపై చర్యలు తీ సుకోవడం కుదరదని కోర్టు స్పష్టం చేయడం, కాంగ్రెస్ గోబెల్స్ ప్రచా రానికి చెంపపెట్టనివిఅన్నారు. క మిషన్ల పేరుతో ప్రజలను మభ్యపె ట్టే ప్రయత్నాలను మానుకోవాలని హితవు పలికారు.

నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడుతూ ప్ర భు త్వం పంట కొనుగోళ్లలో రైతులను దారుణంగా మోసం చేస్తోందని వి మర్శించారు. “ధాన్యం కొనుగోలు లో క్వింటాల్‌కు 8-9 కిలోల తరుగు పేరుతో దోచుకుంటున్నారు. రైతుల ఇబ్బందులను గాలికి వదిలేసి, మంత్రులు కమిషన్ల మీదే దృష్టి పె ట్టారని ఆరోపించారు. రేపటి నుం చి తాము కొనుగోలు కేంద్రాలను సందర్శించి రైతులకు అండగా ఉం టామని, అవసరమైతే కలెక్టరేట్ ముట్టడికి సిద్ధమని హెచ్చరించా రు. అలాగే ఆర్టీసీ కార్మికుల సమ స్యలపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడతామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే లు చిరు మర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button