BRS KCR : ఉద్యమ కాలం నుంచే కుట్రలు
--ప్రజల బాధలు తెలిసిన ఏకైక నేత కెసిఆర్ --రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించి కష్టపడ్డారు --కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి మోసం చేసింది --మహాలక్ష్మితో బస్సుల్లో జుట్ల పంచాయతీ పెట్టారు --హామీలను అడిగితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు --బూతులతో ఎదురు దాడికి భయపడేవాళ్ళెవరు లేరు --నల్లగొండ బిఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్ఏ జగదీష్ రెడ్డి
ఉద్యమ కాలం నుంచే కుట్రలు
–ప్రజల బాధలు తెలిసిన ఏకైక నేత కెసిఆర్
–రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించి కష్టపడ్డారు
–కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చి మోసం చేసింది
–మహాలక్ష్మితో బస్సుల్లో జుట్ల పంచాయతీ పెట్టారు
–హామీలను అడిగితే అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
–బూతులతో ఎదురు దాడికి భయపడేవాళ్ళెవరు లేరు
–నల్లగొండ బిఆర్ఎస్ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో
మాజీ మంత్రి, సూర్యాపేట ఎంఎల్ఏ జగదీష్ రెడ్డి
ప్రజా దీవెన /నల్లగొండ: ఉద్యమ కాలం నుంచే తెలంగాణతో పాటు ఉద్యమ నాయకుల పై కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయని మాజీ మంత్రి సూర్యాపేట శాసనసభ్యులు గుంతకంట్ల జగదీష్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజల సాధక బాధకాలు తెలిసిన నాయకుడు కేసీఆర్ అని అందుకే తెలంగాణ రాష్ట్రాన్ని తన కుటుంబంగా భావించి పరిపాలించాలని గుర్తు చేశారు.
నల్లగొండ మాజీ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి అధ్యక్షతన జరిగిన బి.ఆర్.ఎస్ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఆయన ము ఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. రాష్ట్రాన్ని తన కుటుంబం గా భావించాడు కాబట్టే కరెంట్ కోతలు లేని రాష్ట్రoగా తీర్చిదిద్దాడని చెప్పారు. ధాన్యం, ఆహార ఉత్పతుల్లో అగ్రగామిగా తీర్చిదిద్దారని, తెలంగాణను తన కుటుంబంగా భావించి కష్టపడ్డారని పాలకులకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే ఏదైనా సాధ్యమన్నoదుకు కెసిఆర్ నిదర్శనమని గుర్తు చేశారు.
కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, మహాలక్ష్మి పధకం అమలు చేసి జుట్ల పంచాయతీ పెట్టారని ఎద్దేవా చేశారు. మిగిలిన హామీల గురుంచి అడిగితే ఇష్టం వచ్చినట్లు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని తెలిపారు. బూతులతో కూడిన ఎదురు దాడికి భయపడే వాళ్ళు ఎవరూ ఇక్కడ లేరని పునరుద్ఘాటించారు. మీరందరూ కలిసి వచ్చినా కెసిఆర్ కాలి గోటికి సరిపోరని, కెసిఆర్ లాంటి మహానేతపై మాట్లాడితే సూర్యునిపై ఉమ్మేసినట్లేనని వ్యాఖ్యానించారు.
సాగర్ ఎడమ కాల్వ నీటిని తరలించుకుపోతుంటే పట్టించుకోలే ద ని,కృష్ణ జలాలను తరలించుకుపోతుంటే హారతులు పట్టిన ద్రోహు లు మీరని దుయ్యబట్టారు. హామీలు నెరవేర్చడం చేతకాక కెసిఆర్ పై నెపం నెడుతున్నారని మాతో పెట్టుకోవద్దని హెచ్చరించా రు. నేను వ్యక్తిగత ఆరోపణలకు దిగితే రోడ్ల మీద తిరగలేవని, రైతుబంధు అ డిగితే చెప్పు కొడతారా మంత్రి పదవి ఇచ్చింది అందుకేనా అంటూ ప్రశ్నించారు.
ఇంత అహకారపూరిత మాటలు ఎందుకు, రైతులకు డబ్బులు ఇవ్వలేనపుడు కాళ్ళు పట్టుకుని చెప్పుకోవాలని సూచించారు.
బిఆరెస్ తెలంగాణ ప్రజల కోసం నిరంతరం నిలబడుతుందని స్ఫష్టం చేశారు. నల్లగొండ ప్రజల చైతన్యం ముందు మీ అహంకారం నిలబడదని హితవు పలికారు. అధికారం అడ్డం పెట్టుకుని ఎదో చేయాలనుకుంటే ఇక్కడ సాగదని అన్నారు.
సూర్యాపేట నుంచి బిఆరెస్ గెలుపు మళ్ళీ మొదలయిందని, పార్ల మెంట్ ఎన్నికల్లో తిరిగి పూర్వ వైభవం సంతరించుకోవాలంటే ప్రతి కార్యకర్త కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు.కాంగ్రెస్ హామీలపై ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీయాలని సూచించారు. ఉ ద్యమంలో కాలంలో మాదిరిగా సింహాల్లా కదలాలని అన్నారు. కాం గ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల్లో రైతుబంధు పడట్లేదని, కరెంట్ సక్రమంగా సరఫరా కావడంలేదని, రైతుబంధు రూ.15 వేలు అని మోసం చేస్తున్నారని వివరించారు.
రెండు లక్షల రుణమాఫీ సోనియా పుట్టినరోజు నుంచి ఇస్తామన్నా రు, మరీ అది ఏ పుట్టినరోజు రోజో చెప్పలేదని ఎద్దేవా చేశారు. సాగర్ ఆయకట్టుకు కృష్ణా నీళ్లు ఇవ్వలేదని, ఎస్ఆర్ఎస్పి లో నీళ్లు ఉన్నప్పటికీ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. రాబోయే రోజుల్లో బిఆర్ఎస్ నాయకులు,కార్యకర్తలు దైర్యంగా ఉండాలని కోరారు. వారం పది రోజుల్లోనే కెసిఆర్ ప్రజాక్షేత్రంలోకి రానున్నారని,
తొందరలోనే నల్లగొండ కు వస్తా అన్నారని గుర్తు చేశారు.
ఈ సమావేశంలో జడ్పీ చైర్మన్ లు బండ నరేందర్ రెడ్డి, ఎలిమినేటి
సందీప్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, రవీంద్ర కుమార్, భాస్కర్ రావు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి చాడా కిషన్ రెడ్డి, శరణ్యారెడ్డి, నాయకులు కంచర్ల కృష్ణా రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.