Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS KCR agriculture tour formers : అన్నదాతలకు అండగా కెసిఆర్ భరోసా యాత్ర

--ప్రాజెక్టులు అడుగుపట్టినా పంటలకు నీరిచ్చాం --కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అక్రమ వసూళ్ల వ్యామోహం --పంటలు ఎండుతుంటే చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం --కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాల ప్రారంభం మృగ్యం --మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజం

అన్నదాతలకు అండగా

కెసిఆర్ భరోసా యాత్ర

–ప్రాజెక్టులు అడుగుపట్టినా పంటలకు నీరిచ్చాం
–కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రులకు అక్రమ వసూళ్ల వ్యామోహం
–పంటలు ఎండుతుంటే చోద్యం చూస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
–కోతలు మొదలైనా కొనుగోలు కేంద్రాల ప్రారంభం మృగ్యం
–మీడియా సమావేశంలో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ధ్వజం

ప్రజా దీవెన/ నల్లగొండ : తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు దాటినా రైతన్న సాధ క బాధకాలు తగ్గకపోగా రెట్టింపు అవుతున్నాయని సూర్యాపేట ఎమ్మెల్యే, మాజీ మంత్రి జగ దీష్ రెడ్డి ధ్వజమెత్తారు.కాంగ్రెస్ ప్రభు త్వం వసూళ్ల వ్యామోహం లో పడి ప్రజా పాలనను గాలికి వదిలేసిందని ఆరోపించారు. రాష్ట్రవ్యా ప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపో తుంటే సోయి లేకుండా పా ర్టీలో చేరికకు గేట్లు తెరుస్తామని మాట్లాడుతున్నారని, ముందు ప్రాజె క్టుల (projects) గేట్లు తెరిచి పంటలకు నీళ్లివ్వాలని అన్నారు. నాడు సాగ ర్ లో ఇంతకన్న తక్కువ స్థాయిలో నీళ్లున్నా అధికారుల సల హాతో జిల్లా లో ఒక్క ఎకరం కూడా ఎండిపోకుండా కేసీఆర్ ( kcr ) ప్రభుత్వం నీళ్లిచ్చి ఆదుకుందని గుర్తు చేశారు.

ప్రస్తుతం జిల్లాలో నీటి పారుదల శాఖ మంత్రి ఉన్నా పంటలు ఎండు తుంటే పట్టించుకోవడం లేదని, పోలీస్ పహా రాలో 12 రోజుల పా టు పాలేరుకు నీటినా తరలిస్తే ఏంచేశారని ప్రశ్నించారు. సాగునీరు  రైతు బంధు ధాన్యా నికి బోనస్ అందలేదు. పంటలు ఎండుతున్నా నష్ట పరిహారం ఇవ్వాలన్న సోయి ఈ ప్రభుత్వానికి లేదు. సర్కారు నిర్లక్ష్యాన్ని ఎండగ ట్టాలని రైతులు మాజీ ముఖ్య మంత్రి కేసీఆర్ కు మొర పెట్టుకో వటంతో రైతులకు అండగా ఉండి భరోసా కల్పించేం దుకు కేసీఆర్ రంగంలోకి దిగారని వివరించారు. శనివారం నల్లగొండ లోని మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో వ ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

కెసిఆర్ నడవలేని పరిస్థితుల్లో ఉన్నా రైతుల కోసం కర్ర సాయంతో ఉమ్మడి జిల్లాలో పర్యటించడానికి వస్తున్నారని తెలిపారు. భువన గిరి, జనగాం, సూర్యాపేట, నల్లగొండ జిల్లాలో ఎండిన పంటలను పరిశీలించి ప్రభుత్వాన్ని నిలదీయనున్నట్లు చెప్పారు. పంతానికి పోయి నాటి ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు కాళేశ్వరం ఆయక ట్టుకు నీళ్లివడం లేదని, మూడు నెలల్లో కాళేశ్వరం ద్వారా వంద టీఎంసీల నీరు తీసుకునే అవకాశం ఉన్నా సర్కార్ చేతగాని తనం వల్ల ఒక్క టీఎంసీ కూడా తీసుకోలేకపోయామని తెలిపారు.

కనీసం రెండు తడులు ఇచ్చినా బయ్యన్నవాగు నుంచి మోతె వరకు ఒక్క ఎకరం కూడా ఎండిపోయేది కాదన్నారు. వ్యవసాయ రంగంపై సోయి లేని రేవంత్ కు లోపల ఆదర్శం చంద్రబాబు అయితే బయట మోడీ అని ఎద్దేవా చేశారు. చంద్ర బాబు వ్యవసాయం దండగ అంటే నేడు మోదీ రైతు వ్యతిరేక చట్టాలు తెచ్చి రైతుల నడ్డి విరుస్తున్నార ని దుయ్యబట్టారు. ఇలాంటి ప్రజా వ్యతిరేకమైన పాలనను ఎండగ ట్టాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో సన్న ధాన్యం పండిస్తున్న రైతులు నష్టపోవద్దని ఏడెనిమిదేండ్ల నుంచి మిల్లర్లతో మాట్లాడి కింటాకు రూ.2,700 దాకా ధర ఇప్పిస్తే ఈసారి రూ.2,200కి మించి ఎందుకు ఇవ్వలేదని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.

మిల్లర్లు, కాంట్రా క్టర్లు, క్రషర్లు, ఆఖరికి ఇంటి నిర్మా ణాలు చేపడుతు న్న వారి దగ్గర అక్రమ వసూళ్లకు పాల్పడి రైతులను పట్టించుకోవ డం లేదని ఆరోపించారు. మిల్లర్ల దగ్గర రెండు కోట్ల దాకా వసూలు చేస్తే రైతుకు ఎలా మంచి ధర ఇస్తారని ప్రశ్నించారు. తక్కువ ధర ఇచ్చిన మిల్లు లను సీజ్ చేయాలని మంత్రి చెప్పినా ఇప్పటి వరకూ ఒక్క మిల్లూ సీజ్ కాలేదని పైగా ధాన్యం ధర వంద రూపాయలు తగ్గిందని ఎద్దేవా చేశారు.

రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్య యాదవ్ మాట్లాడుతూ పంట నష్టం జరిగిన రైతులకు ఎకరాకు రూ.25వేల చొప్పున నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ మొదటి నుండి రైతుల పక్షానే ఉంటుందని, ఇవ్వాల బీఆర్ఎస్ అధికారంలో లేనం దున రైతులకు అన్యాయం జరుగుతు న్నదని తెలిపారు. ప్రతిపక్ష పార్టీగా రైతులకు భరోసా ఇవ్వడానికి కేసీఆర్ వస్తున్నారని పేర్కొ న్నారు.

ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మె ల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, నల్లమోతు భాస్కర్ రావు, బీఆర్ఎస్ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, బీఆర్ ఎస్ నాయ కులు తండు సైదులు గౌడ్, రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, మందడి సైది రెడ్డి, చీర పంకజ్ యాదవ్, ఎడవెల్లి విజయేందర్ రెడ్డి, కటికం సత్త య్యగౌడ్, చింతరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, బొమ్మరబో యిన నాగార్జున పాల్గొ న్నారు.