BRS KCR formers water problems : కాలంతో వచ్చిన కరువు కాదు కాంగ్రెస్ అసమర్థతో వచ్చింది
--రాష్ట్రంలో పంటలు ఎండిపోవడా నికి కారణం కాంగ్రెస్ --ఇచ్చిన హామీల అమలుకు వెంటపడితరుముతాం --మళ్లీ మంచినీళ్ళ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్ --ప్రస్తుతం కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది -- రాష్ట్రానికి వంద రోజుల్లోనే చెడలుపట్టే పరిస్థితొచ్చింది --సూర్యాపేట జిల్లా పంట పొలాల సందర్శన అనంతరం మీడియా సమావేశంలో కెసిఆర్ ఆగ్రహం
కాలంతో వచ్చిన కరువు కాదు
కాంగ్రెస్ అసమర్థతో వచ్చింది
–రాష్ట్రంలో పంటలు ఎండిపోవడా నికి కారణం కాంగ్రెస్
–ఇచ్చిన హామీల అమలుకు వెంటపడితరుముతాం
–మళ్లీ మంచినీళ్ళ బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నయ్
–ప్రస్తుతం కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది
— రాష్ట్రానికి వంద రోజుల్లోనే చెడలుపట్టే పరిస్థితొచ్చింది
–సూర్యాపేట జిల్లా పంట పొలాల సందర్శన అనంతరం మీడియా సమావేశంలో కెసిఆర్ ఆగ్రహం
ప్రజా దీవెన/ సూర్యాపేట: రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తీవ్రస్థా యిలో ధ్వజమెత్తారు. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ్రెస్ తెచ్చిన కరువని మండిపడ్డారు. రాష్ట్రంలో పంటలు ఎండిపోవడానికి కారణం కాంగ్రెస్ ప్రభుత్వం అని, కరెంటులో వోల్టేజ్ సరఫరాకు కార ణం కూడా మీదేనంటూ దుయ్యబట్టారు. మీకంటే ముందు మేం బ్ర హ్మాండంగా కరెంటు ఇచ్చినం, ఎనిమిదేండ్లుగా ఇచ్చిన కరెంటు ఇప్పుడెట్ల మాయ మైంది అని కేసీఆర్ ప్రశ్నించారు.
మేము పదేండ్లు రైతులను మేం బ్రహ్మండంగా చూసుకున్నం, ఇప్పు డు వాళ్ల కండ్ల పొంటి నీళ్లు వస్తుంటే ఎట్ల చూడాలె, వాళ్లు బాధలు పడుతుంటే చూసి ఎట్ల ఊకోవాలె, ఇప్పుడే ఇట్లుంటే ముందు ముం దు ఎట్లుంటదని రైతులు భయాందోళన చెందుతున్నరని ప్రశ్నల వ ర్షం కురిపించారు. సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం వెలుగు పల్లి గ్రామంలో ఎస్ ఆర్ ఎస్ పి ఆయకట్టు కింద ఎండి పోయిన పొలాలను పరిశీలించి రైతులను వివరాలను అడిగి తెలుసుకున్న బిఆర్ఎస్ అధినేత కెసిఆర్.
అనంతరం ఆయన మాజీ మంత్రి , సూర్యపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, మరో ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, MP లింగయ్య యాదవ్, తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్, నల్లగొండ పార్ల మెంటు అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి, జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, నాయ కులు తదితరులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో మాట్లాడారు. ఈ దారుణ పరిస్థి తుల కారణంగానే రైతు పక్షాన మేం నిలబడ్డామని, డిసెంబర్ 9న రైతులకు రెండు లక్షల రుణమాఫీ చే స్తామన్నారుగా డిసెంబర్ 9 తేదీ పోయి ఎన్నాళ్లయ్యిందని, ముఖ్య మంత్రి ఎక్కడున్నరు, మీరు దొంగ హామీలు ఇచ్చి తప్పించుకోలేరు, మేం వెంటపడి తరుముతామంటూ హెచ్చరించారు.
ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చేదాక ఇడిసిపెట్టేది లేదని బ్యాంకు లోళ్లు రైతుల ము క్కుపిండి రుణాలు వసూలు చేస్తు న్నరని మీకు బాధ లేదా, కనీసం రైతుల దుస్థితి గురించి ఆలోచనైనా చేస్తున్నరా రైతుల పక్షాన ఎవడు మాట్లాడె టోడు లేడు, అడిగేటోడు లేడని మీ రు అనుకుంటున్నరా అని ప్రభుత్వాన్ని నిలదీశారు. నేను రైతు లకు చేతులెత్తి దండం పెట్టి చెబుతు న్నా రైతులు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మ హత్యలు చేసుకోవద్దని, మీ కోసం బీఆర్‌ఎస్ పార్టీ రణరంగమై నా సృష్టిస్తదని ప్రధాన ప్రతిపక్షంగా మీరు మాకు బాధ్యత ఇచ్చారు కానీ ఎమ్మటే మాట్లాడితే ఓర్వలేని తనం అంటరని ఓపికపట్టామని, ఇ ప్పుడు నాలుగో నెల వచ్చింది, లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోతు న్నయ్ కాబట్టి చూస్తూ ఊరుకో లేక వచ్చిన అని వ్యాఖ్యానించారు.అ దేవిధంగా వాగ్ధానాలు ఎగ్గొట్టే పని చేస్తే ఊరుకునేది లేదని ప్రభు త్వా న్ని హెచ్చరించారు. మీరు వాగ్ధానా లను ఎగ్గొట్టి ఊరేగుదాం అను కుంటున్నరా వాగ్ధానాలు ఎగవెడితే బిడ్డా నిద్ర గూడ పోనియ్యం చెప్తు న్నా అని కేసీఆర్ వార్నింగ్ ఇచ్చారు.
*మళ్లీ మంచినీళ్ల బిందెలెందుకు ప్రత్యక్షమవుతున్నాయి* ….
మళ్లీ బిందెలు ఎందుకు ప్రత్యక్షమవుతున్నయ్, ఎందుకు నీటి మోత లు ప్రారంభమయ్యాయంటూ రేవంత్‌రెడ్డి ప్రభుత్వాన్ని బీఆర్‌ఎస్ అ ధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు నిలదీశారు. ప్రభుత్వ ప్రజా వ్యతి రేక విధానాలపై మండిపడ్డారు.బీఆర్‌ఎస్ పాలనలో అద్భుతంగా మా రి, ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశంలోనే ధాన్యం ఉత్పత్తిలో నెంబ ర్ వన్ స్థాయికి చేరుకొన్నప్పటికీ ఇంత స్వల్ప కాలంలో ఎందుకు ఈ బాధకు గురి కావాల్సి వచ్చిందని ప్రశ్నించారు. ప్రపంచ దేశాలు, యూఎన్‌ఓ 15-16 రాష్ట్రాలు కొనియాడి అమలు చేసుకుంటున్న పథకం మిషన్ భగీరథ, రాష్ట్రంలో ఎందుకు మంచినీళ్ల కొరత రావా లి, చీఫ్ సెక్రెటరీ స్టేట్‌మెంట్‌లో సోర్సెస్ అన్నీ బారాబర్ ఉన్నయ్, ఎ వరూ భయపడాల్సిన అవసరం లేదు అద్భుతంగా ఉండవచ్చని చెబుతున్నరు అని కేసీఆర్ గుర్తు చేశారు.
హైదరాబాద్ సిటీలో ఒక రూపాయికే నల్లా కన్షెన్ ఇచ్చి 20 వేల లీట ర్ల ఫ్రీ నీరు, రాష్ట్ర వ్యా ప్తంగా ప్రతి ఇంట్లో నల్లాపెట్టి నీరిచ్చామని, దీ నికి జర్నలిస్టులే సాక్షి అని, దానిలో ఎందుకు లోపం వస్తుంది, కార ణం ఏమిటి అని మేం అసెంబ్లీలో ఛాలెంజ్ చేశామని గుర్తుచేశారు. నేను స్వయంగా ముఖ్య మంత్రిగా ఉన్న సమయంలో ఈ టర్మ్‌లోగా భగీరథ కంప్లీట్ చేయకపోతే వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయ దని, ఓట్లు అడగదని ఛాలెంజ్‌గా చెప్పి పథకాన్ని పూర్తి చేశామని, ఆ తర్వాత ఐదేళ్లు బ్రహ్మాండంగా నడిపామని, బిందెపట్టుకొని ఆడ బిడ్డ ఎక్కడా రోడ్డుపై కనిపించలేదని, అన్నీ మామయ్యాయని, మంచినీ ళ్లు ట్యాంకర్లు ఐదుసంవత్సరాల్లో కనిపించలేదని వివరిస్తూ ఎందుకు మళ్లీ బిందెలు ప్రత్యక్షమవుతున్నయ్, ఎందుకు నీటిమోతలు స్టార్ట్ అయ్యాయి నీళ్ల ట్యాంకర్లు ఎందుకు విచ్చలవిడి వ్యాపారం చేస్తు న్నయ్, హైదరా బాద్ సిటీలో ట్యాంకర్లు పెట్టాల్సిన దుస్థితి ఎందుకు దాపురిస్తుంది, ఇవీ ఆలోచించాల్సిన విషయాలు అంటూ ఆందోళ న వ్యక్తం చేశారు.
*ప్రస్తుతం కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చింది..* తాము అధికారం చేపట్టిన తర్వాత…ఒకటింబావు సంవత్సరంలో చాలా దారుణంగా ఉన్న విద్యుత్ రంగాన్ని సుమారు రూ.35వేలకోట్లు ఖ ర్చు చేసి రకరకాల పద్ధతులు అవలంభించి సెంట్రల్ ఎలక్ట్రిసిటీ అథారిటీని సంప్రదించి మెదడును కరుగదీసి విద్యుత్ రంగాన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని గుర్తు చేశారు. భారతదేశంలో అన్నిరం గాలకు 24గంటలు ఒక సెకండ్ కరెంటుపోకుండా ఏర్పాటు చేసిన ఘన త మా ప్రభుత్వానిదని, మీరు అందరూ అనుభవించారు, నాడు కరెంటు పోతే వార్త ఈ రోజు కరెంటు ఉంటే వార్త అనేకాడికి వచ్చిందని, విద్యుత్ అనేది చిన్న విషయం కాదు, నోటిమాటలు, పిట్ట కథలు కాదు కదా, అద్భుతమైన వ్యవస్థ, దాన్ని తీర్చిదిద్ది ఏడున్నర, ఎనిమిదేళ్లు అద్భుతంగా ప్రజలకు సరఫరా చేశామని, ప్రజలకు, పరిశ్ర మలు, వ్యవసాయానికి, ఐటీకి, ఇతర రంగాలకు 24/7 కరెంటు సరఫరా చేసిన ఒకే ఒక రాష్ట్రం తెలంగాణ అని గుర్తు చేశారు.
*రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది* ..ఒక అగ్రగామి రాష్ట్రంగా ఉన్న రాష్ట్రానికి ఏం చెదలు పట్టింది, వంద రోజుల్లో ఇంత అస్తవ్యస్తం ఏం దీ, దీంట్లో ఉన్న తమషా ఏందీ, కొత్తగా నడిపించేది ఏమీ లేదు, కొత్త గా మొద్దులు మోసేది లేదు, కట్టెలు కొట్టేది లేదు, కొత్త గడ్డపారలు ప ట్టి తవ్వేది లేదు, ఉన్న వ్యవస్థ ఉన్నట్లు నడిపించలేని అసమర్థత ఏందీ, అశక్తత ఏందీ, కట్టిన ఇల్లు, పెట్టిన పొయ్యే కదా, దాన్నే నడి పించే తెలివిలేకపోతే ఎలా, మనకు స్పష్టంగా దీన్ని బట్టి అర్థమవు తున్నది ఏంటంటే ఇప్పుడున్న రాష్ట్రాన్ని పాలిస్తున్న పార్టీ ప్రభుత్వ అసమర్థత, అవివేకం, తెలివితక్కువ తనం, అవగాహనా రాహిత్యం దేన్నీ ఎట్లా వాడాలో తెలియని అర్భకత్వం మనకు కనిపిస్తుందని తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉన్న కరెంటును, మిషన్ భగీరథను వాడుకునే తెలివి లేదు, అద్భుతంగా వచ్చే హైదరాబాద్ నీళ్లు లేవు, మళ్లీ వాటర్ బిల్స్, ట్యాంకర్ల వ్యాపారం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మళ్లీ జనరేట్లర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు వ స్తున్నయ్, మళ్లీ స్టెబిలైజర్లు కొనుక్కునే పరిస్థితి వచ్చింది, అంటూ కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
*100 రోజుల్లోనే 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరు..*.. బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాం డంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇం తర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని బీఆర్‌ఎస్ అధినేత కేసీ ఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.రైతుల దుస్థితి చూస్తే చాలా బాధగా అ నిపించిందని అన్నారు.2014లో బీఆర్‌ఎస్ అధికారంలోకి రాక ముందు రాష్ట్రంలో ఏటా 30, 40 లక్షల టన్నుల ధాన్యం కూడా ఉత్పత్తి అయ్యేది కాదు. కానీ తాము అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి ఏకంగా 3 కోట్ల టన్నులు దాటింది. ప్రభుత్వం రైతు సంక్షేమ విధానాల తో ఉత్పత్తి అధికమై పంజాబ్‌కే పోటీగా నిలిచిందని, అంతేకాదు అనతికాలంలోనే దేశంలోనే అగ్రస్థా నానికి దూసుకుపోయిందని గుర్తు చేశారు.
ఇది కట్టుకథ కాదు, పిట్టక థ కాదు, వాస్తవం, మరి ఇంత సుభిక్షంగా ఉన్న రాష్ట్రం పరిస్థితి ఇప్పుడు ఇంత అధ్వాన్నంగా మారడానికి కారణం ఎవరు, లోపం ఎక్కడున్నది, ఈ విషయంపై ప్రజలతో పాటు జర్నలిస్టు మిత్రులు కూడా బాగా ఆలోచన చేయాలని కేసీఆర్ సూచించారు.కాంగ్రెస్ ప్రభు త్వం వచ్చిన తర్వాత ఇంత తొందర గా కేవలం 100 రోజులలోపే రైతుల కు ఇంత దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని, కేవలం 100 రోజుల పరిపాలనలో 200 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నరని ఆరోపించారు. మేం రైతులకు అన్ని ఏర్పా ట్లు చేసి పెట్టినా ఈ దుస్థితి ఎందు కొచ్చిందని, దేశంలోనే ఉత్పత్తిలో నంబర్ వన్ స్థాయికి ఎదిగిన రాష్ట్రం అనతికాలంలో ఈ స్థాయికి ఎందుకు దిగజారిందని, మిషన్ భగీరథ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఇంటికో నల్లా పెట్టి నీళ్లు ఇచ్చిన రాష్ట్రంలో తాగునీటికి కరువు ఎందుకొచ్చినట్టు, మా టైమ్‌లో బ్రహ్మాండంగా తాగునీటి సరఫరా జరిగిందని, ఎక్కడా నీళ్ల ట్యాంకర్లు కనపడలే, ఏ ఆడ బిడ్డ కూడా వీధుల్లో బింద పట్టుకుని కనపడలే, కానీ ఇప్పుడు హైదరాబాద్ నగరం లో కూడా ట్యాంకర్లతో నీళ్లు సరఫరా చేసే దుస్థి తి ఎందుకొచ్చింది అని కేసీఆర్ ప్రశ్నించారు.
*ధాన్యం లో నెంబర్ వన్ రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకు*… బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిందని బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు.ఈ రోజు జనగామ జిల్లాలో, కొంత మేరకు బస్సులో ప్ర యాణిస్తూ యాదాద్రి జిల్లాలో, అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో ఎం డిపోయిన పంట పొలాలను మా బృందం పరిశీ లించిందని, చాలా చోట్ల రైతులు కన్నీరుమున్నీరై విలపించారని, మేం పెట్టుబడులు పె ట్టి నష్టపోయి నామని, మాకు తగిన పరిహారం ఇప్పించాలని వేడుకు న్నారు. ప్రభుత్వం ముందుగా నీళ్లు ఇస్తమని చెప్పింది కాబట్టి తాము పంటలు వేశామని, కానీ తీరా పంటలు వేసిన తర్వాత నీళ్లు ఇవ్వక పోవడంతో నష్టపోయే పరిస్థితి వచ్చిం దని రైతులు వాపోయారని కేసీఆర్ తెలిపారు.
రైతు బాగుంటేనే రాజ్యం బాగుంటదనే ఉద్దేశంతో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కొన్ని స్పష్టమైన విధానా లు తీసుకుని చర్యలు చేపట్టిం దని, ఒకటి రైతులకు అనేక పద్ధతుల ద్వారా నీరు సరఫరా చేయ డం, రెండోది రైతుబంధు కార్యక్రమం ద్వారా రైతులకు సమయానికి పెట్టుబడి సాయం ఇవ్వడం జరిగిందని, మూడోది సాగునీటి సరఫ రాకు అంతరాయం లేకుండా నాణ్యమైన విద్యుత్ అందజేయడం, నాలుగోది ప్రభుత్వమే రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పంటలను కొనుగోలు చేయడం, ఐదోది రైతులకు అనుకోనిది ఏదైనా సంభవిస్తే రైతుబీమా అందజేయడం, ఈ విధంగా అద్భుత మైన విధానాలను బీఆర్‌ఎస్ ప్రభుత్వం అమలు చేసిందని కేసీఆర్ గుర్తుచేశారు.
*కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో పవర్ కట్* …కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కరెంటు కోతలు నిత్య కృత్యంగా మారాయని,రాష్ట్రంలో ఎడాపెడా కరెంటు కోతలు విధిస్తూ నే ఉన్నారని, ఇప్పటికే రాష్ట్ర మం త్రులు, ఎమ్మెల్సీల మీటింగ్ ల్లో కూడా పవర్ కట్స్ చూస్తూనే ఉన్నా మని, తాజాగా సూర్యాపేట లో బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ప్రెస్‌మీట్‌లోనూ ఇదే రిపీట్ అయ్యిందని వివరించారు. సూర్యాపేట, నల్లగొండ జిల్లాల్లో ఆదివారం బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ పర్యటించి రైతుల సమస్య లను తెలుసుకున్న అనంతరం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయం లో మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఇలా కేసీఆర్ ప్రసంగం మొదలయ్యిందో, లేదో కరెంటు పోయి ఆ తర్వాత కొద్దిసేపటికే కరెంటు రావడంతో ఇట్ల కరెంటు పోతాది, వస్త ఉంటది అంటూ సెటైర్ వేశారు. కేసీఆర్ అన్న మాట వినగానే మీడియా, ప్రజా ప్రతినిదులతో నవ్వులతో నిండిపోయింది. కరెంటు కోతలను ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం అని కేసీఆర్ అన్నారు. ఆ తర్వాత తన ప్రసంగాన్ని కొనసాగించారు.