BRS Party: బిఆర్ఎస్ బోనస్ నిరసనలు
తెలంగాణలో దొడ్డు రకం వడ్లకూ బోనస్ ఇవ్వాలిందేనని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయా లని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు.
దొడ్డు రకం వడ్లకూ బోనస్ ఇవ్వాల్సిందే
రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నిరసనలు
ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణలో దొడ్డు రకం వడ్లకూ బోనస్ ఇవ్వాలిందేనని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయా లని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో గురువారం రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టారు. అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.కరీంనగర్ లో ఎమ్మె ల్యే గంగుల కమలాకర్, హుజూరా బాద్ లో ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మానకొండూర్ లో మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్, చొప్పదం డిలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశం కర్, జగిత్యాలలో ఎమ్మెల్యే సంజ య్ కుమార్, ఆసిఫాబాద్లో ఎమ్మె ల్యే కోవ లక్ష్మి, నల్లగొండ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలు చేప ట్టారు.
కోరుట్ల నియోజకవర్గంలో జాతీయ రహదారిపై రాస్తారోకో చేపట్టారు. పెద్దపల్లి, మంథని, రామగుండం, సిరిసిల్ల, వేము లవాడ నియోజకవర్గ కేంద్రాల్లో బీఆర్ఎస్ నాయకులు నిరసన దీక్షలు చేపట్టారు. మంచిర్యాల, చెన్నూరులో దొడ్డు రకం వడ్లకూ బోనస్ ఇవ్వాలి బీఆర్ఎస్ నాయ కులు రాస్తారోకో చేశారు. నల్లగొండ జిల్లాలోని దేవరకొండ, మిర్యాల గూడ, నాగార్జునసాగర్ లో మాజీ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ నిర సనలు చేపట్టారు. భువనగిరి జిల్లాలోని సంస్థాన్ నారాయ ణపురంలో బీఆర్ఎస్ నేతలు నిరసన చేపట్టారు. వికారాబాద్ జిల్లా ధారూరు మండలంలోని గట్టేపల్లి ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్, పరిగిలో మాజీ ఎమ్మెల్యే మహేషరెడ్డి, తాండూరు మండ లంలోని చెంగోల్ కొనుగోలు కేంద్రం వద్ద రాజుగౌడ్ ఆధ్వర్యంలో నిరస నలు వ్యక్తం చేశారు.
మేడ్చల్ జిల్లాలోని శామీర్పేటలోని రైతు సహకార సంఘం ముందు ఎమ్మె ల్యే చామకూర మల్లారెడ్డి, మహేశ్వరం నియోజకవర్గంలోని శ్రీశైలం-హైదరాబాద్ జాతీయ రహదారిపై ఎమ్మెల్యే సబితారెడ్డి ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. అన్ని రకాల వడ్లకు బోనస్ ఇవ్వాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు ఎస్. వీరయ్య డిమాండ్ చేశారు. తడిసి న ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని కోరారు. సన్న ధాన్యా నికే బోనస్ చెల్లిస్తారన్న వార్తలతో ఇతర రకాల ధాన్యాన్ని సాగు చేసే రైతులు ఆందోళనకు గురవుతు న్నారని తెలిపారు. ధాన్యానికి రూ.500 చొప్పున బోనస్ చెల్లిస్తామన్న హామీ ఏమైందని బీజేపీ నేత బూర నర్సయ్యగౌడ్ నిలదీశారు. సన్న ధాన్యానికే బోనస్ అంటూ రైతులను కాంగ్రెస్ సర్కారు మోసం చేస్తోందని ధ్వజమెత్తారు.
BRS leaders strike for bonus of grains