Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS nalgonda candidate : పేదింటి పెద్ద బిడ్డగా ఆశీర్వదించండి

--నేను పుట్టిన గడ్డ కోసo చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతా --నల్లగొండ బి ఆర్ ఎస్ ఎంపి అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి

పేదింటి పెద్ద బిడ్డగా ఆశీర్వదించండి

–నేను పుట్టిన గడ్డ కోసo చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతా
–నల్లగొండ బి ఆర్ ఎస్ ఎంపి అభ్యర్ధి కంచర్ల కృష్ణారెడ్డి

ప్రజా దీవెన/ నల్లగొండ: పేదింటి పెద్ద బిడ్డగా మీ సేవకునిగా ఎన్నిక ల రణక్షేత్రం లోకి వస్తున్నా నని నల్లగొండ జిల్లా ప్రజలందరూ తమ అశీసులు ఆశీర్వదించాలని బిఆర్ఎస్ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచ ర్ల కృష్ణారెడ్డి కోరారు. నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత తొలిసారిగా నల్లగొండ కు విచ్చేసిన ఆయన విటి కాలనీలోని తమ క్యాంపు కార్యాల యంలో మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, భాస్కర రావు, కంచర్ల భూపాల్ రెడ్డి లతో కలిసి మీడియాతో మాట్లాడారు.

నేను పుట్టిన ఈ గడ్డ అభివృద్ధి కోసం నా చివరి రక్తపు బొట్టు వరకు పోరాడుతూనే ఉంటానని పేర్కొన్నారు. జిల్లాలో వేలాది ఎకరాలు ఎండిపోయి రైతన్నలు ఆగమైతుంటే కాంగ్రెస్ నాయకులు దున్నపో తుపై పడ్డ వర్షంలా వ్యవహరిస్తూ ఏసీ గదుల్లో కులుకుతున్నారని తీవ్ర స్ధాయిలో మండిపడ్డారు. కేవలం 100 రోజు ల్లోనే అత్యంత తారాస్థాయిలో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న ఈ కాంగ్రెస్ లాంటి ప్రభుత్వాన్ని ఏళ్ళ రాజకీయ జీవితంలో ఏనాడు కూడా చూడలేదని గుర్తు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లంకె బిందల కోసమే వచ్చాడు తప్ప, ప్రజలకు సేవ చేయాలని ఉద్దేశం ఏమాత్రం లేదని విమర్శిం చారు. పంటలు ఎండిపో యి రైతన్నలు హరిగోస పడుతుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేవలం కెసిఆర్ గారిని తిట్టేందుకే తన సమయం కేటాయిస్తున్నారని చురకలు అంటించారు. ఓ రైతు బిడ్డ గా రైతన్నలు పడే ఆవేదనను నాకు తెలుసని వారి సమస్యలపై పార్లమెంటులో పోరాడేందుకు నన్ను ఆశీర్వదించాలని ఆయన ప్రజలను కోరారు.

మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ మాట్లాడుతూ కెసిఆర్ 30 రోజుల పా టు సుధీర్ఘంగా ఆలోచించి కంచర్ల కృష్ణారెడ్డిని ఎంపిక చేశారని తెలి పారు. కంచర్ల కృష్ణారెడ్డి కృషి వల్లే గత ఉప ఎన్నికల్లో హుజుర్ నగ ర్, నాగార్జున సాగర్ అభ్యర్థుల గెలిచారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు ఎవరు లేకపోవడంతోనే బిఆర్ఎస్ నుంచి అభ్యర్థు లను కొనుగోలు చేస్తుందని, నోటుకు ఓటు దొరికిన దొంగకు ఇంతకన్నా పెద్ద ఆలోచనలు రావని ఎద్దేవా చేశారు.

బిజెపి గురించి మాట్లాడడమే శుద్ధ దండుగని, బిజెపి కేవలం తన పెంపుడు కుక్కలైన ఈడీ, బోడీలతో బెదిరిస్తే భయపడమని స్పష్టం చేశారు. 400 సీట్లు వస్తాయని బిజెపి ప్రజలను మభ్యపెడుతుందే తప్ప గెలిచేది లేదు, చచ్చేదీ లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు. కెసిఆర్ తెలంగాణకు ఏం చేశారో చెప్పాలంటే 100 ఉన్నాయని, మరి బిజెపి ఏం చేసిందో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

ఈ మీడి యా సమావేశంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చీరా పంకజ్ యా దవ్, కనగల్ ఎంపీపీ కరీం పాషా, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, సీనియర్ నాయకులు బక్క పిచ్చ య్య, బకరం వెం కన్న, జమాల్ ఖాద్రి, సయ్యద్ జాఫర్, జాఫర్ పటే ల్ సింగిల్ విండో చైర్మన్ లు ఆలకుంట నాగరత్నం రాజు, దోటి శ్రీని వాస్, నల్లగొండ పట్టణ పార్టీ అధ్యక్షులు, బోనగిరి దేవేందర్, తిప్పర్తి కనగల్ నల్గొండ మండల పార్టీ అధ్యక్షులు పల్ రెడ్డి రవీందర్ రెడ్డి అయితగోని యాద య్య, దేప వెంకటరెడ్డిలు నాయ కులు రావుల శ్రీనివాస్ రెడ్డి, మెరు గు గోపి,చింతల యాదగిరి, సుంకి రెడ్డి వెంకట రెడ్డి, వనపర్తి నాగేశ్వ రరావు, మిరియాల స్వామి, నాగా ర్జున తది తరులు పాల్గొన్నారు.