Jagadeesh reddy: పట్టుదలతో పని చేస్తే విజయం మనదే
ఉద్యోగులు ,యువతను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిచ్చయంతో యువత ఉద్యోగులు ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు.
ఉద్యోగులు, యువత ను మోసం చేసింది కాంగ్రెసే
ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృత నిశ్చయంతో యువత
నియోజకవర్గంలోని ప్రతి ఓటర్ ను కలవాలి
మన పని విధానమే… విజయానికి నాంది
మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి
ప్రజా దీవెన నల్గొండ: ఉద్యోగులు ,యువతను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేసిందని, మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలనే కృతనిచ్చయంతో యువత ఉద్యోగులు ఉన్నారని మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Jagadeesh reddy) అన్నారు. గురువారం నల్గొండ, వరంగల్, ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలకు(MLC elections) సంబంధించి సూర్యాపేట జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా ముఖ్య నేతలతో సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ప్రచారం లో అనుసరించాల్సిన విధివిధానాలపై శ్రేణుల కు దిశా నిర్దేశం చేశారు. ప్రచారంలో ఓటర్లను కలుస్తున్న సందర్భంగా ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరుద్యోగులు, యువత ఎండగడుతున్నారని తెలిపారు. బిఆర్ఎస్ అభ్యర్థి రాకేష్ రెడ్డి(Rakesh reddy) విజయానికి కావలసిన సానుకూల వాతావరణం నియోజకవర్గం లో ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని సిద్ధంగా ఉన్న ప్రతి ఓటర్ ను కలావాలని సూచించారు. పార్లమెంటు ఎన్నికల తరహాలో వారం రోజులు బిఆర్ఎస్ శ్రేణులు ప్రజా క్షేత్రంలో కష్టపడి పని చేయాలని పిలుపునిచ్చారు. మన పని విధానమే మన విజయానికి నాంది అని తెలిపారు. సిట్టింగ్ స్థానాన్ని బిఆర్ఎస్ (BRS)నిలబెట్టుకోవడం ఖాయమన్నారు.
BRS party win in mlc elections