
Brs RakeshReddy eclass applaunch : ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగ యువత భవి ష్యత్తుకు భరోసానిస్తూ,పోటీ పరీక్షల ప్రిపరే షన్‌ను డిజిటలై జ్ చేసే లక్ష్యంతో రూపొందించిన ‘రాకేష్ రెడ్డి ఈ- క్లా సెస్ యాప్‌ను నల్గొండ జి ల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూ ర్యా పేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. యు వనేత ఏనుగుల రాకేష్ రెడ్డి సారథ్యంలో జరిగిన ఈ లాంచ్ ఈవెంట్‌కు మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ బడుగుల లిం గయ్య యాదవ్ స హా పెద్ద ఎత్తున నిరుద్యోగ యువత హా జరయ్యారు.ఈ వేదిక సాక్షి గా బీఆర్ఎస్ అగ్రనేతలు కాంగ్రె స్ ప్రభుత్వంపై, ము ఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి శైలిపై నిప్పులు చెరిగారు. రాబో యే రోజుల్లో యువత ఎదుట ఉన్న రాజకీయ, ఉద్యోగ భవి ష్యత్తును కళ్ళకు కట్టారు.
ఈ సందర్భంగా యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం మా జీ మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ ఆయాప్ సక్సెస్ వెను క అసంతృప్తి అన్ని రకాల పరీక్షలకు ఒకే చోట పరిష్కారం దొరికేలా ఈ యాప్ రూపొందిం చడం అభినందనీయమ న్నారు . ‘కాక్రోచ్’ లాంటి యాప్‌కు కేవలం 1 5 రోజుల్లోనే 15 కోట్ల మంది ఫాలో వర్స్ వచ్చారంటే అది ప్రస్తుత ప్ర భుత్వా ల పట్ల ప్రజల్లో యువతలో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు, విరక్తికి స జీవ నిదర్శనమన్నారు.
రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున ఎండ కొడుతుందని కేవలం 10 నిమిషాల్లోనే ప్రసంగం ముగించి వె ళ్ళిపోయిన రేవంత్ రెడ్డి లాంటి వా రి చేతుల్లో రాష్ట్రాన్ని పెట్టామని , క నీసం ‘జై తెలంగాణ’ అనడానికి కూడా ఆయనకు ఇష్టం లేదన్నా రు. ‘ఇక ఇంతే మా పని, మళ్ళీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని రేవంత్ రెడ్డికి కూడా అర్థమైపోయిందని ఎద్దే వా చేశారు. నాడు కే సీఆర్ అద్భుతంగా పాలించి ప్రత్య క్షం గా, పరోక్షంగా కోటి ఉద్యోగాలు సృష్టించారని తెలిపారు. ఒక్క కరెంట్ విభా గంలోనే 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని, తెలంగాణ వచ్చేనాటికి 1.20 కోట్లు ఉన్న సాగుభూమిని, కేవలం మూడేళ్ల లో 2.10 కోట్ల ఎకరాలకు పెంచామని, జీఎ స్డీపీని రూ. 3 లక్షల కోట్ల నుం డి రూ. 15 లక్షల కోట్లకు చేర్చి న ఘనత కేసీఆర్‌దని కొని యాడారు. గుజరాత్‌లోనే ఇప్ప టికీ 6 గంట ల కరెంట్ ఇస్తుంటే తెలంగా ణలో 24 గంటల ఉచిత విద్యు త్ ఇచ్చి ప్ర పంచం నేర్చుకునేలా చేసిన దార్శ నికుడు కేసీ ఆర్ అని పేర్కొన్నారు.
రెండున్నరేళ్ల పాలనలో ఒక్క నోటిఫికేషన్ లేదు
యాప్ నిర్వాహకులు, యువనేత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిరుద్యో గుల ఆవేదనను పంచుకున్నారు.తెలంగాణ ఆవి ర్భావ దినోత్సవం రోజున ఈ యాప్ ఆవిష్కరించు కో వడం సంతోషంగా ఉంది. ఎన్నిక ల్లో ఎన్నో హామీలిచ్చి అధికారం లో కి వచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు నిరు ద్యోగులపై ప్రతాపం చూపిస్తోంది. కేసీఆర్ ఇచ్చిన నోటిఫికేషన్లు, పరీక్షల ఫలితా లకే రేవంత్ రెడ్డి నియా మక పత్రాలు అందించి బిల్డప్ ఇ స్తు న్నారు తప్ప. ఈ రెండున్నర ఏం డ్లలో కొత్తగా ఒక్క ఉద్యోగ నో టిఫి కేషన్ ఇవ్వలేదు. యువత నమ్మ కం కోల్పోయి ఊ ర్లకు వెళ్ళిపోతు న్నారు. అలాంటి వారికి తోడుగా ఉండటా నికే, కేంద్ర-రాష్ట్ర పరీక్షల స్టడీ మెటీరియల్‌తో ఈ ‘E-Class es’ యాప్‌ను అందుబాటులోకి తె చ్చామని వెల్లడించారు.
కేసీఆర్ వస్తేనే మళ్ళీ ఉద్యోగాలు
నల్లగొండ మాజీ కంచర్ల భూపాల్ రె డ్డి ” కేసీఆర్ హయాంలో 1.32 ల క్షల ఉద్యోగాల నోటిఫికేషన్లు వేస్తే, కాంగ్రెస్ నేతలు తప్పుడు లెక్కల తో దుస్ప్రచారం చేసి అధికారంలోకి వ చ్చారని, రేవంత్ సర్కార్ యు వతను తీవ్రంగా మోసం చే స్తోందని ధ్వజమెత్తారు. త్వరలోనే నిరుద్యో గుల కోసం ప్ర త్యేక పోరాట కార్యక్ర మాలు నిర్వహిస్తామన్నారు.
బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రకుమార్ మాట్లాడుతూ నాడు కే సీఆర్ ప్రభుత్వంపై యువతను రెచ్చగొట్టి ఓట్లు వే యించుకున్న వ్యక్తి, ఇవాళ బ్లాక్ మెయిల్ రాజకీయాలు చే స్తూ యువతను గాలికి వదిలేశారు. కాంగ్రెస్ మాయమాట ల పట్ల యువత అప్రమత్తంగా ఉం డాలని హెచ్చరించారు. మాజీ రా జ్యసభ సభ్యుడు బడుగుల లింగ య్య యాదవ్ బీఆర్ఎస్ అధికా రంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల కోసమే పనిచేస్తుంది.
నేడు జిల్లా మంత్రులు కేవలం హెలికా. ప్ట ర్లకే పరిమితమై ప్రజలను గాలికి వదిలేశారు. నాడు మం త్రిగా జగదీష్ రెడ్డి జిల్లాను ఎంతో అభివృద్ధి చేశా రన్నా రు. రాష్ట్రంలో ఉద్యోగ నోటిఫి కేషన్ల కోసం సాగే పోరాటాల్లో యువత, నిరుద్యోగు లు ముందుండాలని పిలుపునిస్తూ ప్రి పరేషన్ కోసం ఈ డిజిటల్ యాప్‌ను ఒక ఆయుధంగా మ లచుకోవాలని నేత లు ఆ కాంక్షించారు. ఈ లాంచ్ ఈవెంట్ తో నల్గొండ రాజకీ యాల్లో నిరుద్యో గ గళం మరోసారి తీవ్ర రూపం దాల్చిందని వక్తలు వ్యాఖ్యానించారు.





