OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

BRS protests against 1,000 days of Congress rule : వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనపై బీఆర్‌ఎస్ సమరభేరి

సెప్టెంబర్ 2 నుంచి 8 వరకు వరుస నిరసనలు --భారీ ఎత్తున కార్యక్రమాలకు పిలుపు --నల్లగొండలో మీడియా సమావేశంలో కంచర్ల భూపాల్‌రెడ్డి

 

BRS protests against 1,000 days of Congress rule : ప్రజా దీవెన, నల్లగొండ:కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రో జుల పాలన లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఎండ గడుతూ బీఆర్‌ఎ స్ పార్టీ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 2 నుంచి 8వ తేదీ వరకు వరుస ని రసన కార్యక్రమాలు నిర్వహించ నున్నట్లు మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి తెలిపారు. నల్లగొండ జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాల యంలో ఏర్పాటు చేసిన మీడి యా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాం గ్రెస్ ప్రభుత్వం ఇచ్చి న హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించిన భూపాల్‌రెడ్డి.. బీఆర్‌ఎస్ ప్రకటిం చిన ఏడు రోజుల నిరసన కార్య క్రమాలను విజయవంతం చేయా లని పార్టీ నాయకులు, కార్యకర్త లు, ప్రజలకు పిలుపునిచ్చారు.

 

నిరసన కార్యక్రమాల్లో భాగంగా సెప్టెంబర్ 2న నల్లగొండ గడి యారం సెంటర్‌లో భారీ మానవహారం నిర్వహించ నున్నా రు. 420 అడుగుల ప్లెక్సీ ప్రదర్శనతో పా టు బాకీ కార్డుల పంపిణీ చేపట్ట నున్నట్లు భూపాల్‌రెడ్డి వెల్లడించారు. 3న జిల్లా వ్యాప్తంగా మండల కేంద్రాల్లోరైతు సదస్సులు ని ర్వ హించనున్నారు. అనంతరం మిర్యాలగూడలో జరిగే కేటీ ఆర్ రైతు సదస్సుకు నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్య లో హాజరు కావాలని కోరారు. 4వ తేదీన విద్యార్థులు, మ హిళలు, దివ్యాం గులతో కలిసి ప్రభుత్వ జూనియ ర్ కళాశా ల వద్ద వంటావార్పు కా ర్యక్రమం నిర్వహించనున్నట్లు తెలి పారు.యువత, విద్యా ర్థుల తో భారీ ర్యాలీ, విద్యార్థుల ఫీ జు రీయింబర్స్‌మెంట్, జాబ్ క్యాలెం డర్ అమలు తదితర డి మాండ్ల పై సెప్టెంబర్ 5నఎన్జీ కళాశాల నుంచి గడియారం సెంటర్ వరకు యువత, విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వ హించనున్నారు.

 

ఇక సెప్టెంబర్ 6న ఎన్జీ కళాశాల నుంచి నల్లగొండ నగర వీ ధుల మీదుగా ఆటోలతో ర్యాలీ చేపట్టనున్నట్లు భూపా ల్‌రె డ్డి తెలిపా రు. అదే విధంగా సెప్టెంబర్ 7న నల్లగొండ, తిప్పర్తి, కనగల్, మా డుగులపల్లి ప్రాంతాల్లో నిర్వ హిం చే ప్రజావాణి కార్యక్రమాల్లో వి నతిపత్రాలు అందజేయనున్నా రు. ఏడు రోజు ల నిరసన కార్యక్ర మాలకు ముగింపుగా సె ప్టెంబర్ 8న మర్రిగూడ బైపాస్ రోడ్డులోని డాక్టర్ బీఆర్ అం బేద్కర్ విగ్రహా నికి 420 హామీలతో కూడిన వినతిపత్రం అం దజేయనున్నారు. అనంతరం జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కా ర్యా లయంలో మీడియా సమావేశం నిర్వహించనున్నట్లు భూపా ల్‌రెడ్డి వెల్లడించారు.ఈ కార్యక్ర మాల్లో ప్రజలు, బీఆర్‌ఎస్ నాయ కులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాల ని ఆయన కోరారు.

  కాంగ్రెస్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి

నల్లగొండ జడ్పీ మాజీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి మాట్లా డుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వెయ్యి రోజుల వైఫల్యాలను ప్రజ ల వద్దకు తీ సుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు. నిరస న కార్యక్రమాలను విజయవంతం చేసేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలని, కాం గ్రెస్ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తి ప్పికొట్టాలని కోరారు.

రాష్ట్ర కల్లుగీత కార్మిక అభివృద్ధి సంస్థ మాజీ అధ్యక్షుడు క టికం సత్తయ్య గౌడ్ మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమా లు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం నిర్వహించడం లేదన్నారు. ప్రజలు ఎ దుర్కొంటున్న ఇబ్బందులను ప్ర భు త్వం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారం కోసం ఒత్తిడి తీసు కురావడమే ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రజల కోసం చేపడు తున్న ఈ కార్యక్రమాల్లో నాయకులు, కార్యకర్తలు, ప్రజలు స్వ చ్ఛందంగా పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చై ర్మన్ చీరా పంకజ్ యాదవ్, బక్క పి చ్చయ్య, నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ మందడి సైదిరెడ్డి, మాజీ ఎంపీ పీలు కరీంపాషా, నా రబోయిన బిక్షం, మాజీ జడ్పీటీసీ తు మ్మల లింగస్వామి, నగర పార్టీ అధ్యక్షుడు బోనగిరి దేవేం దర్, నల్లగొండ, కనగల్, తిప్పర్తి మండ ల పార్టీ అధ్యక్షులు దేప వెంకట రెడ్డి, అయితగోని యాదయ్య, పల్‌రెడ్డి రవీంద ర్‌రెడ్డి, కార్పొరేట ర్లు, పార్టీ నాయకులు, కార్యకర్త లు తదిత రులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button