Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

BRS Telangana people cheated : ప్రజలు మోసపోయారు

--ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసగించిన చరిత్రలో లేదు --రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారు --హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసింది --ప్రభుత్వం అవగాహనరాహిత్యం వలన రైతులు రోడ్డు మీద పడ్డారు --మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభు త్వం ఆగం చేసింది --రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయడం లేదు --ఎండిపోయిన పంట పొలాల పరిశీలనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్

ప్రజలు మోసపోయారు

–ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజలను మోసగించిన చరిత్రలో లేదు
–రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారు
–హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసింది
–ప్రభుత్వం అవగాహనరాహిత్యం వలన రైతులు రోడ్డు మీద పడ్డారు
–మూడు నెలల్లోనే కాంగ్రెస్ ప్రభు త్వం ఆగం చేసింది
–రాష్ట్రవ్యాప్తంగా పంట పొలాలు ఎండిపోతున్నప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయడం లేదు
–ఎండిపోయిన పంట పొలాల పరిశీలనలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి డిమాండ్

ప్రజా దీవెన / సూర్యాపేట: కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఎస్సారెస్పీ ఫేస్ 2 ద్వారా నీళ్లు ఇస్తామంటేనే పంటలు వేశారని, హామీ ఇచ్చి పంటలకు నీరు ఇవ్వకుండా కాంగ్రెస్ రైతాంగాన్ని మోసం చేసిందని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని నమ్మి ఒక్కో రైతు 25 నుండి 30 వేల పెట్టుబడిపెట్టి ఆగమయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభు త్వం అవగాహన రాహిత్యం వలన రైతులు రోడ్డున పడ్డారని విచారం వ్యక్తం చేశారు.

ఉమ్మడి జిల్లాలో కొనసాగుతున్న మాజీ మంత్రి , శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి పర్యటనలో భాగంగా రైతుల కోరిక మేరకు వరుసగా ఐదో రోజు కరువుతో ఎండిన పంటలను పరిశీ లించారు. గురువారం సూర్యా పేట మండలం యార్కారం, దుబ్బ తండ, రెఖ్యా నాయక్ తండాలో ఎండిన పొలాల పరిశీలించారు.

రైతుల సమస్య లను అడిగి తెలుసుకున్న జగదీష్ రెడ్డి ప్రభుత్వమే మాట ఇచ్చి ప్రజ లను మోసం చేసిన ఘటన చరిత్రలో ఏనాడు లేద ని, మాట ఇచ్చి రైతన్నల నడ్డివిరిచిన అపకీర్తి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభు త్వానికే దక్కింద ని మండిపడ్డారు. ఉ మ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తం గా ప్రభుత్వ అ వగాహన లోపంతో ఎండిపో యిన పంటలను వరస గా 5వ రోజు జగదీ ష్ రెడ్డి పరిశీ లించారు.

ఎండి పోయిన పంటల ను పరిశీలిం చాలని రైతన్నల కన్నీటి ఆహ్వా నం మేరకు సూర్యాపేట మండలం యా ర్కారం, దుబ్బ తండ, రెఖ్యా నాయక్ తండాలో ఎండిన పొలాల పరిశీ లించిన ఆయన రైతుల ఇ బ్బందుల ను చూసి చలించిపోయారు. ఈ సందర్భంగా ఆయన మీ డియాతో మాట్లాడారు. మా ప్రభుత్వం హయాంలో మొన్నటి వరకు జాలువారిన పంట పొలాలు నేడు మోడువారడానికి  కారణం నూటి కి నూరు శాతం ప్రభుత్వ నిర్లక్ష్యమే అన్నారు.

పోరాడి సాధించిన తె లంగాణ లో కేసీఆర్ రైతాంగాన్ని సస్యశ్యామ లం చేస్తే మూడు నెల ల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందన్నారు. కాలేశ్వరం నీళ్లు ఎత్తి పోయడానికి మూడు పిల్లర్ల కుంగుబాటుకు సంబంధం లేనప్పటికీ గత ప్రభు త్వాన్ని అభాసు పాలు చేసేందుకు రైతాం గానికి నీళ్లు ఇవ్వడం లేద న్నారు. రైతుబంధు రాలేదని ప్రశ్నిం చిన రైతును మంత్రి చెప్పుతీసుకొని కొడతాననడం దుర్మార్గం అ న్నారు.

మా ప్రభుత్వ హయాంలో రైతు తప్పిదం వలన ఒక్క మడి ఎండిపో తేనే నాన్న హంగామా చేసిన డిప్యూటీ సీఎం విక్రమార్క ఇప్పుడు ఏం సమాధానం చెబు తారని ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తం గా పంట పొలా లు ఎండి పోతున్న ప్పటికీ మంత్రులు కనీసం సమీక్ష చేయక పోవడం రైతుల పట్ల ప్రభు త్వానికి ఉన్న మొసలి కన్నీళ్ళకు నిదర్శ నమన్నారు. పంట నష్టం పై మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి రైతులకు భరోసా ఇవ్వాలని డిమాండ్ చేశారు.