Praja Deveena
Newspaper Banner
Date of Publish : 04 June 2026, 4:37 pm Posted by : praja deveena

Brs wanted dedicated commission : బిగ్ బ్రేకింగ్, బిఆర్ఎస్ నేతల కీలక వ్యాఖ్య, తూతూమంత్రం కమిటీ వద్దు, చట్టబద్ధమైన డెడికేటెడ్ కమిషన్ ముద్దు

Brs wanted dedicated commission : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియ కేవ లం ప్రభుత్వ కార్యాలయా ల ఫైళ్లకే పరిమితం కాకూడ దని, అ దొక చట్టబద్ధమైన హక్కుగా మారాలని సచివాల య వే దికగా జరిగిన సర్వపక్ష సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ గట్టి శంఖారావం పూరించిం ది. ఎన్నికల మేనిఫెస్టో లోని ‘వాగ్దా నాల’ నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం కా లయాపన జీఓలతో తప్పించుకో వాలని చూస్తే ఊరుకునేది లేదని ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్ హెచ్చరిం చారు.మాకే మూడు చోట్ల అద్దాలు దించి తనిఖీ లు చేస్తే పల్లెటూరి నుంచి వచ్చే సామాన్య ఉద్యమకా రు డు, అమ రవీరుడి కుటుంబం ఈ సచివాలయంలోకి అడు గు పెట్టగ లదా? ఐఏఎస్ అధికారులను కలవగలదా? బీఆర్ఎస్ నేత లు కీలక వ్యాఖ్యలు చేశారు. సమర యో ధుల గౌరవం కోసం ‘సిక్స్ పా యింట్ ఫార్ములా’ సాధారణ కమిటీలతో కాలయా పన చేయడం ఆపి, ఉద్యమకారుల సంక్షేమం కోసం బిఆ ర్ఎస్ ప్రతినిధులు ఒక విప్లవాత్మకమై న 6సూత్రాల కార్యా చరణను ప్రభుత్వం ముందుఉంచారు.

‘కమిటీ’ కాదు ‘డెడికేటెడ్ కమిషన్’ కావాలి

తాత్కాలిక రాజకీయ కమిటీల వల్ల ఉద్యమకారులకు న్యా యం జరగదని, ఎస్సీ, ఎస్టీ, బీసీ కమిషన్ల తరహాలోనే రా జ్యాంగబద్ధమైన, చ ట్టబద్ధమైన పవిత్రత (Constitut ional & Statutory Sanctity) ఉన్న ఒక ‘డెడికేటెడ్ కమిషన్’ ఏ ర్పాటు చేయాలని, దీనికి ప్రత్యేక బడ్జెట్, ప్రత్యేక కార్యదర్శి ని కేటా యించాలని డిమాండ్ చేశారు.

 

సామాన్య ఉద్యమకారులకు సెక్రటే రియట్‌ రక్షణ వలయా లు దాటడం కష్టమని, అందుకే కేసీఆర్ నిర్మించిన అమర వీరుల జ్యోతి (స్తూపం) ప్రాంగణంలోనే ఈ కమిషన్ ప్రత్యేక కార్యాలయాన్ని ఏర్పాటు చేయా లని, అది ఉద్యమకా రులకు సొంత ఇల్లా అనిపించాలని పేర్కొన్నారు. తెలంగాణ స్వాతంత్ర సమర యోధులు’గా గుర్తింపు దేశ స్వాతంత్ర స మరయోధుల తరహాలోనే, తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ స్వాతంత్ర సమరయో ధులుగా అధికారికంగా గుర్తించాల న్నారు.

గోల్కొండ కోట వేడుకలతో స హా అన్ని ప్రభుత్వ అధికారిక కా ర్యక్రమాలలో వీరికి ప్రత్యేక ఆసనా లు (VVIP సీట్లు) కే టాయించి గౌ రవించాలన్నారు. ఈ గుర్తింపు ప్రక్రి య కేవలం రాజకీయ పార్టీలకే ప రిమితం కాకూడదని, ఉద్యమంలో కీ లకంగా నిలిచిన జేఏసీలు, విద్యా ర్థి సంఘాలు, కుల సం ఘాలు, మ రియు జర్నలిస్టులతో సహా క్షేత్ర స్థాయిలో విస్తృ త సంప్రదింపులు జర పాలని అప్పీల్ చేశారు.

 

2010లో కాకతీయ యూనివర్సిటీ లో పోలీస్ హింసకు గురై నేడు జీ వోచ్ఛవంగా మారిన KU ఉద్యమ కారుడు యాకోబ్ రెడ్డికి ప్రభుత్వం తక్షణమే పూర్తి నష్టపరిహారం (Co mpens ation) అందించాలని, ఉ ద్యమకారులపై ఉన్న పాత కేసు ల న్నింటినీ బేషరతుగా ఉపసంహరిం చుకోవాలన్నారు. తె లంగాణ ఉద్య మ స్ఫూర్తి అయిన ‘తెలంగాణ తల్లి’ రూపు రేఖలను మార్చవద్దు. 1 25 అడుగుల అంబేద్కర్ విగ్రహ ప్రాంగణానికి వేసిన తాళాలను వెం టనే తీసి ప్రజలకు అం దుబాటులో కి తేవాలి.

పాఠ్యపుస్తకాలలో ఉద్య మ వాస్తవ చరిత్రను చేర్చాలన్నా రు. బీఆర్ఎస్ నేతలు గత పాలన కు, ఇప్పటి ప్రభుత్వ వైఖరికి ఉన్న వ్యత్యాసాన్ని బడ్జెట్ సాక్షిగా ఎండ గట్టారు. 610 మంది కుటుంబాల కు ప్రభుత్వ ఉద్యో గాలు, రూ. 25, 000 పెన్షన్, 250 గజాల స్థలం ఇంకా అమ లు కాలేదన్నా రు. కళాకా రుల ఆదరణ 582 మంది కళాకా రులను ప్రభు త్వ రంగంలోకి తీ సు కున్నారు | జీఓ నెంబర్ 679 ద్వా రా కేవలం సంప్రదింపులకే పరిమితమైoదని వెల్ల డించారు.