OpinionPoliticsతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

BrsNalgonda exMLA Kancharla Bhupal Reddy నల్లగొండ మాజీఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి ఆగ్రహం, ధాన్యం అక్రమాలపై కలెక్టరేట్ ముట్టడి తధ్యం

 

BrsNalgonda exMLA Kancharla Bhupal Reddy:  ప్ర జా దీవెన, నల్లగొండ: నల్లగొండ నియోజకవర్గ రైతులు ఎదు ర్కొం టున్న సమస్యలపై మాజీ శాసనస భ్యులు కంచర్ల భూ పాల్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువా రం ఆయన ఆర్జాలబావి, దండం పల్లి, ఎస్‌ఎల్‌బీసీ ప్రాంతాల్లోని ధా న్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మి కంగా సందర్శించి రైతుల సమ స్య లను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా రైతులు తమ గో డును వెల్లగక్కుతూ నెల రోజులు గడిచినా ధాన్యం తూకం వేయడం లేదని, కొనుగో లు ప్రక్రియ నత్తనడ కన సాగుతోందని ఆవేదన వ్యక్తం చేశా రు. బస్తాకు 42 కిలోల 700 గ్రాముల తూకం వేయడం ద్వా రా రైతులను నష్టపరుస్తున్నారని, ప్రతి బస్తాపై రూ.3 వరకు మామూల్లు వ సూలు చేస్తున్నారని ఆరోపించారు. తూకం పూర్తయిన వెంటనే ట్ర క్ షీట్లు ఇవ్వకుండా ఆలస్యం చేస్తు న్నారని, దిగుమతి సమయంలో మళ్లీ ట్రక్ షీట్లు మార్పించ మంటూ మిల్లర్లు ఒత్తిడి తెస్తున్నారని రైతులు వివరించారు.

రైతుల సమస్యలను విన్న అనంత రం కంచర్ల భూపాల్ రెడ్డి మాట్లాడు తూ “కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతు పండిం చిన ప్రతి గింజను గౌర వంగా కొనుగోలు చేశామని, కానీ నే డు కాంగ్రెస్ ప్రభుత్వం, అధికారు లు, మిల్లర్లు కుమ్మక్కై రైతు లను తీ వ్రంగా మోసం చేస్తున్నారన్నారు. తూకాల్లో మోసం, లంచాలు, తమ కు అనుకూలమైన వారికే ప్రాధాన్యత ఇవ న్నీ రైతు కష్టాన్ని దోచుకునే చర్యలే” అని మండిపడ్డారు.50 రో జులు గడిచినా సగం ధాన్యం కూడా సేకరణ పూర్తికాక పోవడం ప్ర భుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు.

జిల్లా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధ్యులపై చ ర్యలు తీసుకోవాలన్నారు. రైతుల ధాన్యా న్ని ఎలాంటి కొర్రీ లు లేకుండా వెం టనే కొ నుగోలు చేయాలలేకపోతే బీఆర్‌ఎ స్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేస్తామని హె చ్చరించారు.రైతులకు ఎటువంటి అన్యాయం జరిగినా బీఆ ర్‌ఎస్ పా ర్టీ అండగా నిలుస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో నగర పార్టీ అధ్య క్షులు భువనగిరి దేవేం దర్, మండ ల అధ్యక్షులు దేపవెంకట్ రెడ్డి, నారబోయిన బిక్షం, తుమ్మల లింగ స్వామి, బొజ్జ వెంకన్న, మారగోని భ వాని గణేష్, పెరిక యాదయ్య, పేర్ల అశోక్, దొడ్డి రమేష్, గోప గోని స్వాతి రాజశేఖర్, కుందూరు దీపిక ప్రవీణ్ రెడ్డి, రావుల శ్రీనివాస్ రెడ్డి, యుగంధర్ రెడ్డి, దండంపల్లి సత్త య్య, వజ్జ శీను, బడుపుల శంకర్, తవిటి కృష్ణ, కందుల లక్ష్మయ్య, కోట్ల జయపాల్ రెడ్డి, ఉప్పల ముర ళి, దండంపల్లి సర్పంచ్ మల్లే బోయి న బుచ్చిరాజు, మాజీ సర్పంచులు అల్లి వెంకన్న, నా రబోయిన నరసింహ, పనస శ్రీను, బొడ్డుపల్లి శ్రవణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button