Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Rammandir: ‘రామ మందిరం ‘కు రాకపోతే హిందువులు కానట్టేనా?

రామ మందిరం ప్రారంభోత్సవానికి రాని వాళ్లంతా హిందూ వ్యతిరేకులేనా అని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ప్రశ్నించారు.

హేరామ్ ఆంటూ కన్నుమూసిన గాంధీ అనుచరులమే
మమ్మల్ని హిందూ వ్యతిరేకులం టూ మోదీ ఆరోపించడం సబబు కా దు
తమకు తామే హిందూ చాంపియ న్ లుగా బిజెపి వాళ్ళ ప్రచారం
రాయ్ బరేలీ ఎన్నికల ప్రచారంలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ

ప్రజా దీవెన, రాయ్ బరేలీ: రామ మందిరం(Rammandiram) ప్రారంభోత్సవానికి రాని వాళ్లంతా హిందూ వ్యతిరేకులేనా అని అఖిలభారత కాంగ్రెస్ పార్టీ (congress party)ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ(Priyanka gandhi ) ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ హిందూ(hindus) వ్యతిరేక పార్టీ అని బీజేపీ చేస్తున్న ఆరోపణలను ప్రియాంక గాంధీ తిప్పికొట్టారు. ఆఖరి క్షణంలో రాముడిని తలుచు కుంటూ (హే రామ్) అంటూ కన్ను మూసిన గాంధీజీ అనుచరులo మాత్రం అవునని అన్నారు.అలాంటి మమ్మ ల్ని హిందూ వ్యతిరేకులంటూ మో దీ ఆరోపించడం ఎంతవరకు సబ బని అడిగారు. శనివారం రాయ్ బరే లీలో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రియాంక ఈ వ్యాఖ్యలు చేశారు.హిందూ చాంపి య‌న్లు ఏం చేశారని,తమని తాము హిందూ చాంపియన్లమని బీజేపీ వాళ్లు చెప్పుకుంటారని ప్రియాంక గుర్తుచేశారు.

అలాంటి పార్టీ ప్రభు త్వం ఉన్న ఉత్తరప్రదేశ్‌లో(Uttar Pradesh) చాలా గోశాలల పరిస్థితి దయనీయంగా ఉందని, కొన్నిచోట్ల గోమాత కళే బరాలను కుక్కలు పీక్కుతింటు న్నాయని ఆరో పించారు. హిందూ వ్యతిరేకులమని మోదీ ఆరోపిస్తున్న కాంగ్రెస్ పార్టీ(congress party)మాత్రం ఛత్తీస్‌గఢ్‌లో అధికారంలో ఉన్న పుడు గోశాలల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని గుర్తుచేశారు. పొదు పు సంఘాల మహిళల నుంచి ఆవు పేడను డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసిం దని, తద్వారా వారిని గోవుల పెంపకం దిశగా ప్రోత్సహించిందని ప్రియాంక చెప్పారు.

రాయ్ బరేలీ నుంచి పోటీ చేస్తున్న సోదరుడు రాహుల్ గాంధీని(rahul gandhi) గెలిపించాలంటూ ప్రియాంక గాంధీ నిత్యం ప్రచారం చేస్తున్నారు. తమ నానమ్మ ఇందిరా గాంధీ, నాన్న రాజీవ్ గాంధీల కాలం నుంచే తమకు రాయ్ బరేలీతో గట్టి అనుబంధం ఉందని గుర్తుచేస్తున్నా రు. ఈ ఎన్నికల్లో గెలుపొందాక రా హుల్ గాంధీ కూడా సంప్రదాయాల ను పాటిస్తారని చెప్పుకొచ్చారు.

ఇక, మోదీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తూ యూపీఏ హయాంలో తీసుకొచ్చిన రైట్ టు ఫుడ్ యాక్ట్ కింద కేంద్ర ప్రభుత్వం ఉచిత రేషన్ పంపిణీ చేస్తోందని చెప్పారు. అయి తే, మోదీ మాత్రం ఈ క్రెడిట్ తనదే అన్నట్లు రేషన్ షాపుల్లో తన ఫొటో పెట్టుకుంటున్నాడని విమర్శించారు. యూపీలో నియామక పరీక్షల పేపర్ లీక్ ఘటనలను ప్రస్తావిస్తూ తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేపర్ లీక్‌లను అరికట్టేందుకు కఠినమైన చట్టాలను తీసుకొస్తా మని ప్రజలకు హామీ ఇచ్చారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యపై జీఎస్టీని ఎత్తివే స్తామని, అగ్నివీర్ స్కీమ్‌ను రద్దు చేస్తామని ప్రియాంక గాంధీ పేర్కొ న్నారు.

Can’t we be Hindus if we don’t come to Rama Mandir