
Car Falls Into Well Family Drowned : ప్రజా దీవెన, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో అర్ధరాత్రి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దుబ్బాక మండలం అప్పన్నపల్లి గ్రామ శివారులో అ దుపుతప్పిన కారు రోడ్డు పక్కనే ఉన్న లోతైన బావిలోకి దూసు కెళ్లడంతో ఒకే కు టుంబానికి చెం దిన నలుగురు మృత్యువాతప డ్డారు. మృ తుల్లో ఇద్దరు చిన్నా రులు ఉండటంతో బల్వంతపూర్ గ్రా మంలో విషాదఛాయలు అలుముకున్నాయి.బల్వంతపూర్ గ్రామానికి చెందిన దండుగుల రాజు (30) ఇసుక వ్యాపారం చేస్తుండగా, ఆయన భార్య భాగ్య (25), కుమారుడు నిహా న్స్ (4), కుమార్తె శాన్విక (2) తో కలిసి సిద్దిపేటలో బంధువు ద శదినకర్మకు హాజరై రాత్రి ఇంటికి తిరుగు ప్రయాణమ య్యారు.
అప్పన్నపల్లి శివారుకు చేరుకున్న సమయంలో కారు అదు పుతప్పి రోడ్డు పక్కన ఉన్న లోతైన బావి లోకి దూసుకెళ్లిం ది. కారు బావి లో పడిన విషయం కొంతసేపటి తర్వాత స్థా నికుల దృష్టికి వచ్చిం ది. వెంటనే వారు పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సమాచా రం అందించారు.
సమాచారం అందుకున్న పోలీసు లు, అగ్నిమాపక సిబ్బంది స్థాని కుల సహకారంతో సహాయక చర్యలు చేపట్టారు. క్రేన్ సాయం తో కారును బావిలో నుంచి బ యటకు తీశారు. అయితే అప్ప టికే కారు పూర్తిగా నీటిలో ముని గిపోవడం తో రాజు, భాగ్యతో పా టు ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కో ల్పోయారు.
ఒకే కుటుంబానికి చెందిన నలు గురు ఒకేసారి మృత్యు వా తపడ టంతో బల్వంతపూర్‌లో తీవ్ర విషాదం నెలకొంది. కు టుంబ సభ్యులు, బంధువుల రోదనలు స్థానికులను కలచి వేశాయి.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేపట్టారు. ప్ర మాదానికి గల పూర్తి కారణాలను తెలుసు కునేందుకు విచారణ కొనసాగుతోంది.




