–ప్రభుత్వ ఉద్యోగుల తరహాలో నే జర్నలిస్టులు సైతం సేవలo దిస్తున్నారు
— పోస్టు కార్డు ఉద్యమ కార్య క్రమంలో టియుడబ్ల్యూజే143 అధ్యక్షుడు జయశంకర్ గౌడ్
Cashless Health Cards for Journalists : ప్రజా దీవెన, నల్లగొండ: అక్రిడి టేషన్ అర్హత కలిగిన జర్నలిస్టు లందరికీ ప్రభుత్వ ఉద్యోగులకు అందిస్తున్న మాదిరి క్యాష్ లెస్ హెల్త్ కార్డుల మంజూరు చేయ డంతో పాటు జర్నలిస్టుల న్యా య మైన సమస్యలను పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ TUWJ H-143 ఆధ్వర్యంలో ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారం భించారు. రాష్ట్రవ్యాప్తంగా 8 రోజులపాటు ఈ నిరసన కార్యక్రమాలు చే పట్టాలని యూనియన్ రాష్ట్ర అధ్యక్షు డు అల్లం నారాయ ణ, ప్రధాన కా ర్యదర్శి అస్కాని మారుతీ సాగర్ పి లుపు మే రకు మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని నల్లగొండ జి ల్లా కేంద్రంలోని రామగిరి చౌరస్తాలో ఉన్న గాంధీజీ విగ్రహం వ ద్ద కార్యక్రమం నిర్వహించారు.
ముందుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివ చ్చిన జర్నలిస్టులు ర్యాలీగా గాంధీ వి గ్రహం వద్దకు చేరుకున్నారు. అనంతరం మహాత్మా గాంధీ విగ్ర హానికి పూలమాల వేసి నివాళు లు అర్పించారు. జర్నలిస్టుల సమస్యలను పరిష్క రించాలని, ప్ర భుత్వం వెంటనే స్పందించాలని నినాదాలు చేశా రు.అనంతరం ముఖ్యమంత్రి రే వంత్‌రెడ్డికి పో స్టుకార్డుల ద్వా రా తమ డిమాం డ్లను తెలియజేసేలా ఉత్తరాల ఉద్యమాన్ని ప్రారంభించారు.
ప్రతి జర్నలిస్టు పోస్టుకార్డుపై తమ సమస్య లు, డిమాండ్లను రాసి ముఖ్యమంత్రికి చేరేలా కార్యక్ర మాన్ని కొన సాగించాలని పిలు పునిచ్చారు. ఈ సందర్భంగా టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు గుండగోని జయశంకర్ గౌడ్ మాట్లాడుతూ జర్న లిస్టుల సంక్షే మం, భద్రతకు ప్రభుత్వం తగిన చర్యలు తీసు కోవాలని విజ్ఞప్తి చేశా రు. రాష్ట్రంలో తె లంగాణ రాష్ట్ర ప్రభు త్వ పథకాలను అమలు చేసేది అధికారులైతే అంతకు మిం చిన సేవలను అందిస్తూ జర్నలిస్టులు సైతం ఆ పథ కాలను ప్రజలకు తె లియజేయ డంలో సేవలు అందిస్తున్నట్లు తె లిపారు.
లక్షల్లో వేతనాలు ఇవ్వ డంతో పాటు రిటైర్డ్ మెంటు బెన్ఫి ట్స్ అందిస్తూ క్యాష్ లెస్ హెల్త్ కార్డు లు ఉద్యోగులకు ఇచ్చినటు వం టి ప్రభుత్వం అదే స్థాయిలో సే వ లు అందిస్తున్న జర్న లిస్టులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చే శారు. వృత్తిలో ని మగ్నమై నేడు అనేకమంది జర్నలిస్టులు అనా రోగ్యం పాల వుతున్న నేపథ్యంలో డబ్బులు లేక చికిత్స చేయించు కోలేక మరణిస్తున్న సంఘటనలు అనేకం చోటు చేసుకున్నట్లు ఆవే దన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉ న్నటువంటి హెల్త్ కార్డులు ఒక్క నిమ్స్ ఆస్పత్రిలోనే పనిచేస్తున్నా యని ఆ పద్ధతిని మా ర్చి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్పొరేట్ ఆసు పత్రుల్లో పనిచేసే విధంగా జీవో జారీ చేసి క్యాష్ లెస్ హెల్త్ కార్డులు ఇవ్వాలని ఆయన ప్రభుత్వా న్ని డిమాండ్ చేశారు.
ఈ సంద ర్భంగా జర్నలిస్టులు పో స్టుకార్డు లపై క్యాసెలెస్ హెల్త్ కా ర్డులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ప్రతి ఒక్కరు రాసి స్థానిక తపాలా కా ర్యాలయం ద్వారా సీఎంలోకి పం పించడం జరి గింది. ప్రభుత్వం వెం టనే స్పందించి జర్నలి స్టుల న్యాయప రమైన డిమాండ్లను నె రవేర్చాలని యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు. లేని ప క్షంలో ఉద్యమాన్ని ఉదృతం చే స్తా మని అన్నారు.
ఈ కార్యక్ర మంలో యూనియన్ రాష్ట్ర నా యకులు గోలి విజ య్ కుమార్, నకిరేకంటి శ్రీనివాస్ గౌడ్ , నీలం వెంకట మధు, సల్వాది జానయ్య, ఓడపల్లి మధు, ముచర్ల విజయ్, ఆకాష్, ముచర్ల శ్రీని వా స్, నర్సింగరావు, లక్ష్మీనారాయణ, జానీ, పో గుల రమేష్ గౌడ్, బొడ్డుపల్లి రామ కృష్ణ, చిక్కుల యాదగిరి, పేరం సుభాష్, వెంకన్న, శ్రీనివాస్, సందీప్ తదితరులు పాల్గొ న్నారు.
వర్కింగ్ జర్నలిస్టులందరికీ క్యాష్ లెస్ హెల్త్ కార్డులు
మిర్యాలగూడ: తెలంగాణ రాష్ట్రంలో వర్కింగ్ జర్నలిస్టు లం దరికీ ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని ఆసుపత్రుల్లోనూ క్యాష్‌లెస్ వైద్య సేవలు అందించేలా హెల్త్ కార్డులు అమలు చేయాలని టీయూడబ్ల్యూజే (హెచ్ – 143) స్టేట్ సెక్రటేరియెట్ మెంబర్ అన్నెబోయిన మట్టయ్య ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. టీయూడబ్ల్యూజే (హెచ్-143) రా ష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ మీడియా అకాడమీ మాజీ చైర్మెన్ అల్లం నారాయణ పిలుపు మేరకు పోస్టు కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. మొదటగా మిర్యాలగూడ పట్టణంలోని సాగర్ రోడ్డులోగల జాతిపిత మహాత్మా గాంధీజీ విగ్రహం వద్ద నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ వర్కింగ్ జర్నలిస్టుల సంక్షేమమే ప్రధాన లక్ష్యంగా టీయూడబ్ల్యూజే (హెచ్-143) నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. జర్నలిస్టుల హక్కుల సాధనతోపాటు ఆయా కుటుంబాల సంక్షేమానికి యూనియన్ అనేక కార్యక్రమాలు చేపట్టిందని గుర్తు చేశారు. గతంలో హెల్త్ కార్డుల సాధన కోసం పోరాటం చేయడంతోపాటు మృతి చెంది న జర్నలిస్టుల కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం, వారి పిల్లల విద్యకు చేయూతనివ్వడం వంటి సేవా కార్యక్ర మాలు నిర్వహించినట్లు వివరించారు. కరోనా మహమ్మారి సమయంలోనూ చైర్మెన్ అల్లం నారాయణ గారి నాయక త్వంలో కరోనా బారినపడిన జర్నలిస్టులకు ఆర్థిక సహాయం అందించి అండగా నిలిచిన విషయాన్ని గుర్తు చేశారు.
ప్రస్తుతం జర్నలిస్టుల హెల్త్ కార్డులు కొన్ని ఆసుపత్రులకే పరి మితం కావడం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతు న్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో హెల్త్ కార్డులు చెల్లుబాటయ్యేలా ప్రభుత్వం తక్ష ణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల ఆరో గ్య భద్రతకు భరోసా కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన పోస్టు కార్డుల ఉద్యమంలో ప్రతి జర్నలిస్టు భాగస్వామి కావాలని కోరారు.
అనంతరం ర్యాలీగా బయలుదేరిన యూనియన్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమం త్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి అడ్రెస్: సీఎంఓ కార్యాల యం, 6వ అంతస్తు, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ తెలంగాణ రా ష్ట్ర సచివాలయం, హైదరాబాద్ -500022, అనే చిరునామాకు స్థానిక ఎన్.ఎస్.పి. క్యాంపులోని పోస్ట్ బాక్స్ లో పోస్ట్ కార్డు లను వేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే (హెచ్-143) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మల్లె నాగిరెడ్డి, జిల్లా కార్యదర్శి విరగని లక్ష్మణ్, జిల్లా కార్యవర్గ సభ్యులు బొంగరాల మట్టయ్య, నియోజకవర్గ అధ్యక్షులు జంగా లక్ష్మణ్, నాయకు లు మంద లక్ష్మణ్, కందుకూరి సుదర్శన్, బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు బంటు విటి, దుర్గయ్య తదితరులు పాల్గొ న్నారు.
పోస్ట్ కార్డులతో జర్నలిస్టుల నిరసన
జర్నలిస్టులకు ఆరోగ్యభద్రత విషయమై ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా క్యాష్ లెస్ హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని టియుడబ్ల్యూజే143 దేవరకొండ డివి జన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్ ప్రభు త్వాన్ని డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సమస్యలు పరిష్క రించాలని చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా టియుడబ్ల్యూజే 143 రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు శుక్రవారం గాంధీ జయంతిని పురస్కరించుకొని దేవరకొండలో గాంధీ విగ్రహం ఎదుట జర్నలిస్టులు నిరసనతో పాటు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే 143 దేవరకొండ డివిజన్ అధ్యక్షులు కొమ్మినేని ఆంజనేయులుయాదవ్ మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా పనిచేస్తూ ప్రజా సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చే ప్రక్రియలో జర్నలిస్టులు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు. జర్నలిస్టుల సమస్యల పరి ష్కారానికి అలాగే జర్నలిస్టుల హక్కుల సాధనకు జర్నలిస్టులంతా ఐక్యంగా పోరాడాలని అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు మంజూరు చేసి ఇండ్లు నిర్మించి ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జర్నలిస్టులకు క్యాష్ లెస్ హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, జర్నలిస్టులపై ప్రత్యేక దృష్టి సారించి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.
దేవరకొండతో పాటు అన్ని మండల కేంద్రాలలో గాంధీ విగ్రహాల ఎదుట జర్నలిస్టులు పోస్ట్ కార్డు ఉద్యమం చేపట్టి పోస్టు కార్డులను రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగిందని పేర్కొన్నా రు. వారం రోజుల పాటు ఈనెల 8 వ తేదీ వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవిస్తూ జర్నలిస్టుల హక్కుల సాధన కై కార్యక్రమాలు నిర్వహించినట్లు అందుకు నియోజకవర్గ పరిధి లోని జర్నలిస్టులు సహకరించాలని ఆయన కోరారు. అంతకు ముందు గాంధీజీ జయంతిని పురస్కరించుకొని పూలమా లవేసి జర్నలిస్టులు ఘనంగా నివాళులర్పించారు. మహాత్మా గాంధీజీకి జై అంటూ నినాదాలు చేశారు.
ఈ కార్యక్రమంలోటీయూడబ్ల్యూజే 143 దేవరకొండ డివిజన్ కోశాధికారి సముద్రాల వేణు, యూనియన్ నాయకులు ముష్ని అంజన్, హాథిరాం నాయక్, నల్లగాసు నవీన్ కుమార్, గాజుల వినయ్, జంతుక లింగం, పోలగొని సైదులుగౌడ్, మణికంఠ చారి, వెంకటరమణ, ఇలియాస్, రాజశేఖర్, బత్తుల సురేష్, రాంబాబు నాయక్, ఫయాజ్, తిరుపతి, మహేష్, రవి, బొడ్డు మల్లేష్ గౌడ్, రాందాస్, అంజిబాబు, శంకర్, మోహన్, చంద్ర మౌళి, విజేత, ప్రవీణ్, గోవర్ధన్, ఆంజనేయులు, ఆర్య శీను తదితరులు పాల్గొన్నారు.
Cashless Health Cards for Journalists






