–సర్ ప్రక్రియను నిలిపివేసి..అ ర్హుల ఓట్లను పునరుద్ధరించాలి
–అక్టోబర్ 1న నల్లగొండలో వామపక్షాల ఆధ్వర్యంలో నిరసన
CEC Gyanesh Kumar Removal : ప్రజా దీవెన, నల్లగొండ: ఓటు హ క్కు పరిరక్షణలో ఎన్నికల సం ఘం పూర్తి పారదర్శ కతతో వ్యవ హరించాలని సీపీఐ జిల్లా కార్య దర్శి, ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి తు మ్మల వీరా రెడ్డి డిమాండ్ చేశా రు. SIR (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రి యను తక్షణమే నిలిపి వేసి, వివిధ కారణాలతో తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్లను పున రుద్ధరించాలని వారు కోరారు.
బుధవారం నల్లగొండలోని సీపీఐ జిల్లా కార్యాలయం మగ్దూం భ వన్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నాయకులు మా ట్లాడారు. ఎన్నికల సంఘం స్వ తంత్రతను కాపాడాలని, సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను బాధ్యతల నుంచి తొలగించాలని వారు డి మాండ్ చేశారు.
రాజ్యాంగం ప్రతి పౌరుడికి కల్పిం చిన ఓటు హక్కు ప్రజాస్వా మ్యానికి కీలకమైన హక్కు అని, దానిని అన్యాయంగా హరించరాదని నాయకులు పేర్కొన్నారు. SIR పే రుతో ఓటర్ల జాబితాల సవరణ చేపడుతున్న క్రమంలో అర్హులైన పౌరుల పేర్లు తొలగించే పరిస్థితి ఏర్పడుతోందని వారు ఆరోపిం చారు.
ఎన్నికల సంఘం కేంద్రంలోని బీ జేపీ ప్రభుత్వానికి అనుకూలం గా వ్యవహరిస్తోందన్న అనుమానాలు ప్రజల్లో వ్యక్తమవుతు న్నాయని నాయకులు పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్, కేరళలో ఓట్ల తొలగింపుపై పలు ఆరోపణలు వచ్చాయని, ఈ అంశానికి సం బంధించి ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్ లో వచ్చిన నివేదికలను వారు ప్ర స్తావించారు. ఇలాంటి పరిణామాలు ఎన్నికల సంఘం నిర్ణయ ప్రక్రి యపై ప్రజల్లో అనుమానాలకు దారితీస్తున్నాయని అన్నారు.
తెలంగాణలో SIR ప్రక్రియలో భా గంగా వివిధ కారణాలతో పెద్ద సంఖ్యలో ఓటర్ల వివరాలు పరిశీలనకు వచ్చినట్లు తెలిపా రు. నల్లగొండ జిల్లాలో సుమారు 2 లక్షల మంది ఓటర్లకు నోటీ సులు జారీ చేసి విచారణ చేపడు తున్నారని, తమకు అందిన సమాచారం ప్రకారం సుమారు 45 వేలమందికి నోటీసులు అం దినట్లు వెల్లడించారు. మిగిలిన వారికి నోటీసులు అందకపోవ డం, విచారణ ప్రక్రియలో ఎదుర వుతున్న ఇబ్బందులపై ఆందో ళన వ్యక్తం చేశారు.
అక్టోబర్ 1న నిరసన
SIR ప్రక్రియను నిలిపివేయాలని, తొలగించిన అర్హులైన ఓటర్ల పేర్ల ను పునరుద్ధరించాలని, ఎన్నికల సంఘం స్వతంత్రతను కాపాడా లని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 1న నల్లగొండ జిల్లా కేం ద్రంలోని సుభాష్ సెంటర్‌లో వామపక్షాలు, ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వ హించనున్నట్లు నాయకులు తెలిపారు. ప్రజలు,ప్ర జాస్వామ్యవాదులు ఈ కార్యక్ర మంలో పాల్గొనాలని వారు పిలు పునిచ్చారు.ఈ సమావేశంలో సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శులు పల్లా దేవేందర్‌రెడ్డి, లొడంగి శ్రవణ్‌కుమార్, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు హషం, పుచ్చాకాయల నర్సి రెడ్డి, నల్పరాజు సై దు లు, టీజేఎస్ జిల్లా ప్రధాన కార్య దర్శి గుండెబోయిన నాగేశ్వరరా వు, సీపీఐ జిల్లా కార్యవర్గ స భ్యు లు పబ్బు వీరస్వామి, టి. వెంకటేశ్వర్లు, పట్టణ కార్యదర్శి కె.ఎ స్.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
CEC Gyanesh Kumar Removal

