Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Chandrababu naidu signature: అన్నట్లుగానే అన్నింటిపై చంద్రబాబు ‘ సంతకం’

ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల సందర్భంలో ప్రజల కిచ్చిన ఎన్నికల హామీల అమలుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారిం చింది. బాధ్యతలు చేపట్టిన మరుక్ష ణమే తొలి సంతకాల తో ఏపీలో చంద్రబాబు పాలన ప్రారంభమైంది.

ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు
సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్య వసాయం, నైపుణ్యం ఐదు రంగాల ఫైళ్లపై తొలి సంతకాలు
మెగా డీఎస్సీతో 16,347 టీచర్‌ పోస్టుల భర్తీకి నిర్ణయం
ల్యాండ్‌ టైటిల్‌ రద్దు, పేదల పింఛ ను రూ.4 వేలు, స్కిల్‌ సెన్సెస్‌, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణకు నిర్ణయం

ప్రజా దీవెన, అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల(Andhra Pradesh Elections) సందర్భంలో ప్రజల కిచ్చిన ఎన్నికల హామీల(Election assurances) అమలుపై చంద్రబాబు ప్రభుత్వం దృష్టి సారిం చింది. బాధ్యతలు చేపట్టిన మరుక్ష ణమే తొలి సంతకాల తో ఏపీలో చంద్రబాబు పాలన ప్రారంభమైంది. సంక్షేమం, ఉపాధి, ఉద్యోగం, వ్యవ సాయం, నైపుణ్యం తదితర ఐదు రంగాలకు సంబంధించిన ఫైళ్లపై ముఖ్యమంత్రి హోదాలో చంద్రబా బు సంతకాలు చేశారు. బుధవారం ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం (Taking oath as AP CM)చేసి న ఆయన గురువారం వేద పండి తుల ఆశీర్వచనాల మధ్య సచి వా లయంలో ముఖ్యమంత్రిగా బాధ్య తలు స్వీకరించారు.

సతీమణి భువనేశ్వరితో కలిసి తన చాంబర్‌ లో అడుగుపెట్టారు. ఎన్నికల ప్రచా రంలో ఇచ్చిన ఐదు కీలక హామీల అమలుపై నిర్ణయం తీసుకున్నారు. 16,347 ఉపాధ్యాయ ఖాళీలు భర్తీ చేసేలా ‘మెగా డీఎస్సీ’ని ప్రకటిస్తూ ఆ ఫైలుపైనే చంద్రబాబు తొలి సంత కం చేశారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఒకేసారి ఇంత భారీ సంఖ్య లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ చేప ట్టడం ఇదే తొలిసారి కావడం గమ నార్హం. అయితే ఏపీ లో గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు హడా వుడిగా 6,100 పోస్టులతో ఇచ్చిన నోటిఫికేషన్‌ను రద్దు చేయనున్నా రు.జగన్‌ సర్కారు రైతుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించేలా చేసిన ‘ల్యాం డ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌’ రద్దుపై(Land Titling Act) చంద్ర బాబు రెండో సంతకం చేశారు. రైతు ల భూములను వివాదాస్పదం చేసి న ఈ చట్టాన్ని రూపుమాపే ప్రక్రియ కు శ్రీకారం చుట్టారు.

ఈ చట్టంలోని లోపాలు, లోటుపాట్లను ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు వెల్లడిస్తూ తాము అధికారంలోకి వస్తే ఈ చట్టా న్ని రద్దు చేస్తూ రెండో సంతకం పెడ తానని ప్రకటించారు. ఇక పేదల పింఛన్‌ మొత్తాన్ని రూ.3వేల నుంచి ఒకేసారి రూ.4వేలకు పెంచారు. చం ద్రబాబు తన మూడో సంతకాన్ని ఈ ఫైలుపైనే చేశారు. 2019లోనే చంద్ర బాబు పింఛను రూ.2వేలు చేశారు. దీనిని రూ.3వేలకు పెంచుతామని చెప్పి అధికారంలోకి వచ్చిన జగన్‌ విడతలవారీ పాట పాడారు. కాగా చంద్రబాబు ఇప్పుడు ఒకే విడతలో రూ.వెయ్యి పెంచి మొత్తంగా 66 లక్షల మందికి లబ్ధిచేకూర్చారు. మేం అధికారంలోకి వస్తే ఏప్రిల్‌ నుంచే పెరిగిన పింఛను అమలు చేస్తామని ఈ మొత్తాన్ని కూడా కలిపి జూలైలో రూ.7వేలు ఇస్తా మని చెప్పామని, జూలై నెలలో ఈ మూడు నెలల బకాయి రూ.3వేలు, పెరిగిన పింఛను రూ.4వేలు కలిపి మొత్తం 7వేలు అందుతాయన్నారు. అలాగే దివ్యాంగుల పింఛను రూ. 4వేల నుంచి ఆరు వేలకు పెంచుతు న్నాం. వారికి బకాయిలతో కలిపి జూలైలో రూ.12 వేలు అందు తుందని చంద్రబాబు వివరించా రు.

ఏపీలోని యువత, ప్రైవేటు ఉద్యోగుల్లో ఎటువంటి ఉద్యోగ నైపుణ్యాలు ఉన్నాయో తెలు సుకొని వారికి మరింత నైపుణ్య శిక్షణ ఇవ్వడానికి ఉద్దేశించిన నైపుణ్య గణన (స్కిల్‌ సెన్సెస్‌) నిర్వహణపై చంద్రబాబు నాలుగో సంతకం చేశారు. స్కిల్‌ సెన్సెస్‌ ప్రాధాన్యంపై (Skill senses preferred)జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన చెప్పారు. ఇక జగన్‌ రాగానే మూసే సిన అన్న క్యాంటీన్లను పునరుద్ధ రిస్తూ చంద్రబాబు ఐదో సంతకం చేశారు. 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కారు అన్న క్యాంటీన్ల ద్వారా భోజనం, అల్పా హారాన్ని రూ.5కే అందించింది. వం దల సంఖ్యలో వీటిని ఏర్పాటు చేశారు.

పేదలు, కూలీలతోపాటు వివిధ పనులపై పట్టణాలకు వచ్చే ప్రజలకు తక్కువ ధరకే నాణ్యమైన, రుచికరమైన ఆహారాన్ని అందిం చారు. టీడీపీ ప్రభుత్వానికి బ్రాండ్‌ గా నిలిచిన అన్న క్యాంటీన్లను జగ న్‌ మూసి వేయించారు. ఆ భవ నాలను వార్డు సచివాలయాలు, ఇతర అవసరాలకు వాడుకున్నా రు. దీంతో ప్రస్తుతం ఎన్ని వీలైతే అన్ని అన్న క్యాంటీన్లు ప్రారంభి స్తామని, దశలవారీగా మిగిలిన వాటిని అందుబాటులోకి తెస్తామని చంద్రబాబు తెలిపారు. వేడుకలా సాగిన తొలి సంతకాల కార్యక్రమా నికి కొత్త మంత్రులు, పార్టీ నేతలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

Chandrababu naidu’s signature on five sector files