చంద్రబాబు రిమాండ్ పొడిగింపు
— ఈ నెల 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు
ప్రజా దీవెన /విజయవాడ: తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రిమాండ్ ను పొడిగిస్తూ (Extending the remand of Chandrababu Naidu) ఎసిబి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబు రిమాండ్‌ను ఏసీబీ కోర్టు న్యాయమూర్తి ఈనెల 24 వరకు పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ గడువు నేటితో ముగియనున్న నేపథ్యంలో సీఐడీ అధికారులు వర్చువల్‌గా చంద్రబాబు నాయుడును ఏసీబీ కోర్టులో ( CID officials virtually present Chandrababu Naidu in ACB court) ప్రవేశపెట్టారు. ఆన్లైన్లో చంద్రబాబు నాయుడు రిమాండ్‌పై విచారణ జరుగుతుంది. ఈ సందర్భంగా సీఐడీ కస్టడీపై చంద్రబాబు నాయుడు అభిప్రాయాన్ని ఏసీబీ కోర్టు జడ్జి అడిగి తెలుసుకున్నారు.
అయితే తనను స్కిల్ స్కామ్ కేసులో అక్రమంగా, అన్యాయంగా అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జికి తెలియజేశారు. రాజకీయ కక్షలో భాగంగానే తనను అరెస్ట్ చేశారని చంద్రబాబు జడ్జి (Chandrababu informed the judge that he was arrested unjustly. Judge Chandrababu said that he was arrested as part of a political party) ఎదుట ఆరోపించారు.