Changing the names of countries is not new: దేశాల పేర్ల మార్పు కొత్తేమీకాదoట
--పలు కారణాలతో మారిన 7దేశాల పేర్లు
దేశాల పేర్ల మార్పు కొత్తేమీకాదoట
–పలు కారణాలతో మారిన 7దేశాల పేర్లు
ప్రజా దీవెన/ న్యూఢిల్లీ: ఇoడియా పేరును భారత్ గా పేరు మార్చుతున్నారని దేశం యావత్తు చర్చోప చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం దేశం పేరు భారత్ గా మార్చేందుకు సిద్ధం అయినట్లు (As the name of the country is ready to be changed to India) దాదాపు తుది దశకు చేరుకున్నట్టు కనిపిస్తోంది.
ఆయితే ఒక దేశం పేరు మారడం ఇదేం కొత్త కాదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. చరిత్రలో అనేక సార్లు అనేక దేశాల పేర్లు స్వాతంత్ర్యం, రాజకీయం, సాంస్కృతిక, సామాజిక అంశాల ప్రభావంతో మారినట్లు చరిత్ర( History has changed with the influence of political, cultural and social factors after independence) ఉటంకిస్తుంది.
దేశం పేరు మార్పు అనేది దాని గుర్తింపు, సార్వభౌమాధికారం లేదా చారిత్రక కథనంలో మార్పును సూచిస్తుంది. కాగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఏడు దేశాల( Seven countries worldwide so far) పేర్లు మారాయి. 2019లో రిపబ్లిక్ ఆఫ్ మాసిడోనియా పేరును నార్త్ మాసిడోనియాగా మార్చారు.
గ్రీస్ తో చాలాకాలంగా ఉన్న వివాదాన్ని ఈ మార్పు పరిష్కరించింది. అనేక రాజకీయ తిరుగుబాట్లు, వివాదాల తర్వాత జైర్ దేశం పేరును ద డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగోగా 1997లో మార్చారు. మూడు దశాబ్దాలకు పైగా నియంతగా పాలించిన మొబుటు సేసే సెకో పాలనకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పాలపా వ్యవస్థ ఈ పేరు మార్పుతో తిరిగొచ్చింది.
1993లో చెకోస్లోవాకియా పేరును చెక్ రిపబ్లిక్ అండ్ స్లోవేకియాగా మార్చారు. చెక్ రిపబ్లిక్ ఒక దేశంగా స్లోవేకియా మరో దేశంగా ఏర్పాటయ్యాయి. ఈ శాంతియుత విభజన కమ్యూనిస్ట్ పాలనను అనుకరించింది.1989లో పాలక మిలిటరీ జుంటా బర్మా దేశం పేరును మయన్మార్‌గా మార్చేశారు.
1972లో సిలోన్ ద్వీప పేరును శ్రీలంకగా మార్చారు. ఈ పదం సింహళ భాషలో పాతుకుపోయి రిపబ్లిక్ గా ప్రకటించబడింది. శ్రీలంక అంటే సింహాళీ భాషలో ప్రకాశవంతమైన భూమి అని అర్థం 1971లో జరిగిన యుద్ధంలో గెలిచిన తర్వాత పాకిస్తాన్ నుంచి వేరు పడిన ఈస్ట్ పాకిస్తాన్. తన దేశాన్ని బంగ్లాదేశ్ గా ప్రకటించుకుంది.థాయిలాండ్ అంటే స్వేచ్ఛా భూమి. 1939లో సియామ్ పేరును థాయిలాండ్ గా మార్చారు.