Opinionక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Chebrolu Railway Track Deaths : బిగ్ బ్రేకింగ్, ఏలూరు చేబ్రోలు రై ల్వే ట్రాక్‌పై విషాదం,మిస్టరీగా మి గిలిన నలుగురు ప్రాణాలు

Chebrolu Railway Track Deaths : ప్రజా దీవెన, ఏలూ రు (చేబ్రోలు): రైళ్లు మరింత వేగంగా దూసుకుపోతున్న ఆ ధునికకాలంలోనూ, రైల్వే ట్రాక్‌ల పక్కన విషాదాల సవ్వడి మత్రంతగ్గడం లేదు. ఏలూరు జి ల్లా చేబ్రోలు రైల్వే స్టేషన్ స మీపంలో తాజాగా చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన స్థా నికులను తీవ్రంగా కలచివేసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు రైలు ఢీకొని అక్కడికక్కడే ప్రాణాలు కో ల్పోయారు.టెక్నాలజీ ఎంత పెరిగినా, కొన్ని ప్రాణాలు ఎలా గా ల్లో కలిసిపోతున్నాయో అర్థం కాని పరిస్థితికి ఈ ఘటనే ఒక ఉదాహరణ.

మరణించిన వారు తాడేపల్లి గూడెం ప్రాంతానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులుగా రైల్వే పోలీసులు గుర్తించారు.చాంద్ బాషా (50) కుటుంబ యజమాని కాగా భార్య హసీనా (45 ), కుమార్తెలు షర్మిల (23), సమీరా (20) లు ఒకే ఇంట్లో న లుగురు, అదీ భార్యాభర్తలు, ఇద్దరు యువతులు ఇలా ట్రాక్‌ పై శవాలుగా మారడం ఆ ప్రాంతంలో తీవ్ర సంచలనం సృ ష్టించింది.

   ప్రమాదమా? ఆత్మహత్యా? వేధి స్తున్న ప్రశ్నలు

ఈ ఘోర కలికి కారణాలు ఏమిట నే దానిపై ప్రస్తుతం క్లూస్ టీమ్స్, రై ల్వే పోలీసులు విచారణ జరుపుతున్నారు. అయి తే ఈ కేసు ఇప్పుడు రెండు భిన్నమైన కోణాల్లో మిస్టరీగా మారింది. ఒకే కు టుంబానికి చెందిన నలుగురు ఒకేసారి ట్రాక్‌పైకి రావడం చూస్తుంటే, కుటుంబ సమస్యలు లేదా ఆ ర్థిక ఇ బ్బందుల కారణంగా వారంతా కలిసి బలవన్మరణా నికి పాల్పడ్డారా అనే అనుమానాలు వ్యక్తమవు తున్నాయి.

మరో కోణంలో ప్రయాణిస్తున్న రైలు నుంచి ప్రమాదవశాత్తూ ఒకరు జారిపడగా… వారిని కాపాడే క్ర మంలో మిగిలిన ము గ్గురూ రైలు కింద పడ్డారా? లేక నలుగురూ ఒకే సారి రైలు లోంచి కింద పడిన త ర్వాత వెనుక నుంచి వచ్చిన మరో రైలు వీరిని ఢీకొట్టిందా? అనే సాంకేతిక కోణాన్ని కూడా పోలీ సులు పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం మృ త దేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు.

ఆ సమయంలో వారు ఏ రైల్లో ప్రయాణిస్తున్నారు? ఆ రూ ట్ లోని సీసీటీవీ ఫుటేజీలు ఏం చెబుతు న్నాయి? అనే వివ రాలను సేక రిం చే పనిలో డిజిటల్ ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ని మగ్నమయ్యాయి. ఒకరి మొబైల్ డేటా ఆధారంగా చివరి కాల్స్ ఎవరికి వెళ్లాయనేది తేలితే ఈ మిస్టరీ వీడే అవకాశం ఉంది.ఒకే కుటుంబం ఇలా ట్రాక్‌పై విగత జీవులుగా పడి ఉండటం తాడేప ల్లిగూడెంలో ఉన్న వారి బంధువులను, స్థా నికులను కన్నీరుమున్నీరు చేస్తోంది.

Related Articles

Back to top button