Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CM Congrsess meeting : కాంగ్రెస్ పోటీ నిరసన సభ

--ఖాళీ కుర్చీపై పింక్ కలర్ టవల్, కెసిఆర్ ఫోటోతో --ఎల్ఈడి స్క్రీన్ తో కెసిఆర్ మోసపూరిత హామీల ప్రదర్శన --ఏముఖం పెట్టుకొని నల్లగొండకు వస్తున్నారని నిలదీత --కెసిఆర్ హామీలన్ని మోసపూరితమేనన్న డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్

నల్లగొండలో కాంగ్రెస్ పోటీ నిరసన సభ

–ఖాళీ కుర్చీపై పింక్ కలర్ టవల్, కెసిఆర్ ఫోటోతో
–ఎల్ఈడి స్క్రీన్ తో కెసిఆర్ మోసపూరిత హామీల ప్రదర్శన
–ఏముఖం పెట్టుకొని నల్లగొండకు వస్తున్నారని నిలదీత
–కెసిఆర్ హామీలన్ని మోసపూరితమేనన్న
డిసిసి అధ్యక్షుడు శంకర్ నాయక్

ప్రజా దీవెన/ నల్లగొండ: పదేళ్ల పాటు అధికారంలో ఉన్న కెసిఆర్ ప్ర భుత్వం జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయకుండా ప్రజలను మోసం చేసిందని డిసిసి అధ్యక్షుడు కేతావత్ శంకర్ నాయక్ అన్నారు. నల్ల గొండలో కెసిఆర్ పాల్గొనే బహిరంగ సభను నిరసిస్తూ మంగళ వారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో వినూత్న రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు.

కాళీ కుర్చీలో పింక్ టవల్ వేసి కేసిఆర్ ఫోటో పెట్టి గతంలో కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను ఎండగడుతూ ఎల్ఈడి స్క్రీన్ ఏర్పాటు చేశారు. కెసిఆర్ గోబ్యాక్ అంటూ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా శంకర్ నాయక్ మాట్లా డుతూ కెసిఆర్ వన్నీ దొంగ హామీలన్నీ విమర్శించారు. బీఆర్ఎస్ 10 సంవత్సరాలు అధికారంలో ఉండి శ్రీశైలం టన్నెల్ ను కిలోమీటర్ కూడా పూర్తి చేయలేదని ధ్వజమెత్తారు.

డిండి ఎత్తిపో తల, పాలమూరు- రంగారెడ్డి, బ్రాహ్మణ వెల్లంల ప్రాజె క్టులను పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. జి ల్లాలో ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయని కెసిఆర్ నల్లగొండలో అడు గుపెట్టే హక్కు లేదన్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన మో సాలన్నీ ప్రజలు గ్రహించి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి అధికారా న్ని కట్టబెట్టారని అన్నారు.

రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అన్నిస్థానాల్లో విజయం సాధిస్తుందని అన్నారు. పట్టణ పార్టీ అద్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి మట్లాడుతూ కెసిఆర్ మోసాలు చూసి జిల్లా ప్రజలు సిగ్గుపడుతు న్నారని ఆన్నారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టులు పూర్తి చేస్తానని, దత్తత తీసుకొని నల్లగొండలో అభివృద్ధి చేస్తానని చెప్పి ఎందుకు చేయలేదని ప్రశ్నించారు.

మోసపూరిత వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించిన కేసీఆర్ ఏ ము ఖం పెట్టుకొని నల్లగొండకు వస్తాడని నిలదీశారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన విధంగా కేసీఆర్ ముక్కు నేలకు రాసి నల్లగొండలో అడుగుపెట్టి ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తెలం గాణ ప్రజల త్యాగాలు చూసి సోనియాగాంధీ తెలంగాణ ఏర్పాటు చేస్తే కేసీఆర్ దొరల పాలన సాగించాడని విమర్శించారు.

కెసిఆర్ ప్రజలకు ఏ మాయమాటలు చెప్పినా ఇంకా నమ్మే స్థితిలో లేరని అన్నారు. బీఆర్ఎస్ గల్లీ పార్టీ అని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ హయాంలో జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులన్ని పూర్తి చేసుకోవడం జరుగుతుందని తెలిపారు.

మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్ లు మాట్లాడుతూ గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం మోసపూరిత హామీలతో పాలన సాగించిందే తప్ప ప్రజలకు చేసింది ఏమీ లేదని విమర్శించారు.తాగు,సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిందని ధ్వజమెత్తా రు. పదేళ్లు అధికారంలో ఉండి ఎలాంటి అభివృద్ధి పనులు చేయని కెసిఆర్ రాజకీయ లబ్ధి కోసమే నల్లగొండలో బహిరంగ సభ పెట్టారని విమర్శించారు. కెసిఆర్ పాలనలో నల్లగొండ జిల్లా ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదన్నారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులతో పాటు అభివృద్ధి పనులంటిని పూర్తి చేసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు.

జడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ మనిమద్దే సుమన్ లు మాట్లా డుతూ కెసిఆర్ పాలనలో ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్లు స్వాహా చేశా రని విమర్శించారు. కుర్చీ వేసుకుని ప్రాజెక్టులను పూర్తి చేస్తామని చెప్పి న కేసీఆర్ ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు జిల్లా ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జూకూరి రమేష్, ఎంపీపీ నాగులవంచ విజయలక్ష్మి, డిసిబిబీ డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, కనగల్ మాజీ జెడ్పిటిసి నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, పట్టణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రేఖల భద్రాద్రి, కౌన్సిలర్లు,ఎంపీటీసీలు, కాంగ్రెస్ నాయకులు బషీర్, కరుణాకర్ రెడ్డి, కేసాని వేణుగోపాల్ రెడ్డి, సమద్, జూలకంటి శ్రీనివాస్, కత్తుల కోటి, ఇంతియాజ్, మహమ్మద్ మహబూబ్ అలీ, జూలకంటి సైదిరెడ్డి, బీరం కరుణాకర్ రెడ్డి, గురిజ వెంకన్న, వంగాల అనిల్ రెడ్డి ,ఇబ్రహీం, చింత యాదగిరి, గాలి నాగరాజు, మామిడి కార్తీక్, పాదం అనిల్, దుబ్బరూప అశోక్ సుందర్, ప్రకాష్ రెడ్డి, బుర్రి రజిత యాదగిరి, నంద్యాల వీర బ్రహ్మానంద రెడ్డి, కూసుకుంట్ల రాజిరెడ్డి, నల్లగొండ అశోక్, భాస్కర్, ఏర్పుల అశోక్, గడిగ శ్రీనివాస్, కయ్యుం బాబా, ఖలీల్, సుంకు ధనలక్ష్మి, పాదం అనిల్, ఇటికాల శ్రీనివాస్, షేక్ జహంగీర్ బాబా, పున్న పవన్ కుమార్, వెంకట్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డితో పాటు పలువురు ఎన్ఎస్యుఐ, యూత్ కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.