
Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ (CURE) మొ త్తంగా ఎదురవుతున్న సమ స్యలను పరిష్కరిస్తూ భవిష్య త్తు అవసరాలకు అనుగుణం గా హైదరాబాద్ నగరాన్ని ప్ర ణాళికబద్ధంగా అభివృద్ధి చే యడానికి ప్రభుత్వం కృతని శ్చయంతో ఉందని ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివా లయంలో జరిగిన గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల పా ర్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఆధునీకరణ, నగరీకరణతో సమీప భవిష్య త్తులో ఎదురయ్యే సవాళ్లు, వాటిని అధిగమించడానికి ప్రజా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ముఖ్యమంత్రి సమా వేశంలో సవివరంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ చేసి న వ్యాఖ్యలు ఆయన మాటల్లోనే….పెరుగుతున్న నగరీకరణ వల్ల సమీప భవిష్య త్తులో మరిన్ని కొత్త సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంద ని ముఖ్యమంత్రి చెబుతూ, అందు కు అనుగుణంగా మౌలిక సదుపా యాలను అభివృద్ధి చేయాల్సిన అ వసరం ఉందని నొక్కి చెప్పారు. హైదరాబాద్ నగరాన్ని ట్రాఫిక్ ఫ్రీ నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చే స్తున్నాం. కీలకమైన ప్రాంతాల్లో అం డర్‌పాస్ లు, ఉపరితల రోడ్లు, ఎలి వేటెడ్ కారిడార్‌ల వంటి మూడు విధానాల్లో ట్రాఫిక్‌కు సులభతర మైన రవాణా మా ర్గాలను కల్పించే విధానాన్ని ఎంచుకున్నాం.ట్రాఫిక్ నియంత్ర ణ కోసం కేవలం రోడ్ల విస్తరణ మాత్రమే చేపడితే సరిపో దు. బహుళ విధానాల్లో రవాణా సౌకర్యాలను అభివృద్ధి చే యా ల్సిన అవసరం ఉంది. పార్కింగ్ ఇ బ్బందులను అధిగ మిం చేందుకు నగరంలో మల్టీ లెవెల్ పార్కింగ్ ఏర్పాటు చే స్తు న్నామని వివరించారు.
తెలంగాణ రాష్ట్రాన్ని CURE, PUR E, RARE విభాగాలుగా అభివృద్ది చేయడానికి ప్రణాళికలు రూపొందించాం. ప్రధా నంగా ఔటర్ రింగ్ రో డ్డు లోపలి కోర్ అర్బన్ రీజియన్ ఎ కానమీ (CURE) ప్రాంతాన్ని సర్వీస్ సెక్టార్‌గా గుర్తించాం. ఓ ఆర్ ఆర్ బయట నుంచి రీజనల్ రింగ్ రోడ్డు లోపల ఉన్న పెరి అర్బన్ రీజియన్ ఎకానమి (PURE) ప్రాంతాన్ని ప్రధా నంగా మాన్యూఫ్యాక్చర్ సెక్టార్‌గా గుర్తించాం. ఆ తర్వాత రీజనల్ రింగ్ రోడ్డు బయట ఉన్న రూరల్ అగ్రికల్చర్ రీజియ న్ ఎకానమీ (RARE) గా వ్యవసాయం, దానిక అనుబంధ రంగాల ను అభివృద్ధి చేయాలని ప్రణాళి కలను సిద్ధం చే శాం”. రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం తెలంగాణ రైజింగ్ 20 47 మాస్టర్ ప్లాన్‌ను ఇప్పటికే ఆవిష్కరించుకున్నాం. లక్ష్యా లకు అనుగుణంగా కార్యక్రమాలు చేపడుతున్నాం. కాలుష్య కోరల నుంచి హైదరాబాద్‌ను కాపాడటానికి మూసీ రివర్ ఫ్రంట్‌ను అభివృద్ధి చేయడంతో పాటు నగర సంస్కృతికి అ నుసంధానించబోతున్నాం.
నగరంలో కాలుష్య నియంత్రణకు అనేక చర్యలు తీసుకుం టున్నాం. ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాలను ప్రో త్సహిస్తున్నాం. హైదరాబాద్‌లో ఆర్టీసీలో ఈవీ బస్సులను ప్రవేశపెడుతున్నాం. కోర్ అర్బన్ రీజియన్ పరిధిలో ఆటో లకు ఉచితంగా రెట్రో ఫిట్టింగ్ చేయించి ఈవీ వాహనాలుగా మా ర్చాలన్న సంకల్పంతో పనిచే స్తు న్నాం” అని ముఖ్య మంత్రి చెప్పా రు. హైదరాబాద్ నగర తాగునీటి సరఫరా, పట్టణాభివృద్ధి, మూసీ పునరుజ్జీవం తదితర అంశాలపై ప్ర భుత్వ ప్రణాళికలను సమావేశం లో ఉన్నతాధికారులు ప వర్ పా యింట్ ప్రజెంటేషన్ ద్వారా స్టాం డింగ్ కమిటీకి వివ రించారు. నగర అభివృద్ధిని మరింత ముందుకు తీ సుకెళ్ల డానికి కేంద్ర ప్రభుత్వం సహ కరించేలా చొరవ చూపాలని ఈ సందర్భంగా ప్రభుత్వం స్టాండింగ్ కమిటీకి విజ్ఞప్తి చేసింది.
మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టు చేపట్ట డం ఒక విప్లవాత్మక నిర్ణ యమని స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు ఇతర స భ్యులు అభివర్ణించారు. హైదరాబాద్ నగర జీవన స్థితిగ తు లను మెరుగుపరిచే మూ సీ పునరుజ్జీవ తరహా ప్రాజెక్టు దే శంలోనే మొదటిదని కమిటీ సభ్యులు అభిప్రాయ పడ్డా రు.హైదరాబాద్ న గర ప్రజలకు ఎంతో కీలకమైన ఈ ప్రాజె క్టును చేపట్టడంపై ఈ సంద ర్భంగా కమిటీ ముఖ్యమంత్రిని అ భినందించింది. దీంతో పాటు రాష్ట్రంలో మహిళా భివృ ద్ధికి తీసుకుంటున్న చర్యలను కమిటీ ప్రశంసించింది.
అంత కుముందు సమావేశం ప్రారంభంలో స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్‌తో పాటు సభ్యులను ముఖ్యమంత్రి సత్కరిం చారు. తెలంగాణ రాష్ట్రాన్ని 2034 నాటికి 1 ట్రిలియన్, 2047 నాటికి 3 ట్రిలియ న్ ఆర్థిక శక్తిగా ఎదగడానికి అను గుణం గా సమగ్ర ప్రణాళికలతో రూ పొందించిన తెలంగాణ రైజింగ్ -20 47 విజన్ డాక్యుమెంట్‌ను స్టాండింగ్ కమిటీ సభ్యుల కు అందజేశారు.ఈ సమావేశంలో స్టాండింగ్ క మి టీ చైర్‌పర్సన్ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డితో పాటు ఇతర సభ్యులు, రాష్ట్ర ప్రభు త్వ ప్రధాన కార్యదర్శి రామ కృష్ణరావు, కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు.




