CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో ఇంటర్మీడియట్ ప్రవేశాలు ఈ ఏడాది యథావిధిగా చేపట్టాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అ ధి కారులను ఆదేశించారు. అడ్మిషన్ల కు సమయం తక్కువగా ఉండడం, ఇంటర్మీడియట్‌ను పాఠశాల విద్య లో విలీనం చేసే ప్రక్రి యకు పలు సాంకేతిక సమస్యలు అడ్డుగా ఉండడంతో విద్యార్థుల ప్రయోజనా ల కు భంగం వాటిల్లకుండా వెంటనే ప్ర వేశాల ప్రక్రియను చేపట్టాలని సూ చించారు. ఇంటర్మీడి యట్ ను రద్దు చేసి సీబీఎస్ఈ తరహాలో 11, 12 తరగతు లు నిర్వహించాలని, ఫలితంగా డ్రాపౌట్స్ సంఖ్య గణ నీ యంగా తగ్గుతుందని తెలంగా ణ ఎడ్యుకేషన్ కమిషన్ రా ష్ట్ర ప్ర భుత్వానికి సూచించింది. సీబీఎస్ఈతో పాటు మెజా రిటీ రాష్ట్రాలు 11,12 తరగతుల విధానాన్ని అనుసరిస్తు న్నాయి. మన రాష్ట్రం లో మాత్రం ఇంటర్మీడియట్ వి ద్య వేరుగా ఉంది. ప్రభుత్వ పాఠశా ల ల్లో పదో తరగతి వరకు చదివిన వి ద్యార్థుల్లో అత్యధికులు ఆ తర్వాత ఇంటర్మీ డి యట్‌కు వేరుగా ఉన్న కళాశాలల్లో చేరకుండా విద్యను ని లిపివేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఇంటర్మీడియట్ ను వేరుగా కాకుండా 11, 12 తరగతు లుగా కొనసాగించాలని ముఖ్యమంత్రి గతంలో అధికారులకు సూ చించారు. ఇదే అంశాన్ని తెలంగాణ ఎ డ్యుకేషన్ కమిషన్ సైతం తన నివేదికలో పేర్కొంది.ఇటీవల ఇంట ర్మీడియట్‌లో ప్రవేశాలు నిలిపివే స్తూ అధికారులు ప్రకటన విడుదల చేయడంతో విద్యార్థులు, వారిత ల్లిదండ్రు ల నుంచి ఆందోళన వ్యక్త మైంది. ఈ నేపథ్యంలో ముఖ్య మం త్రి, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, ప్రభు త్వ ప్రధాన కార్యద ర్శి రామకృష్ణా రావుతో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమీక్షించారు.
విలీనంతో ముడిపడిన పలు సాం కేతిక సమస్యలను క్షు ణ్నంగా అధ్యయనం చేయాల్సి ఉన్నందున ఈ ప్రక్రియను తాత్కాలికంగా వా యిదా వేయాలని నిర్ణయించారు. విలీన ప్రక్రియకు సంబంధించి భా గస్వాములతో విస్తృతంగా సంప్ర దింపులు నిర్వహించాలని ముఖ్య మంత్రి అధికారులను ఆదేశించా రు. ఈ అంశంపై తెలంగాణ ఎడ్యుకేషన్ పాల సీపై నియమించిన కమి టీ అధ్యయనం చేసి తన నివేదిక సమర్పించాలని సూచించారు. ని వేదికపై శాసనసభలో చ ర్చించి తుది నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి స్ప ష్టం చేశారు.
