
Cm Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులకు శుభవార్త. కా ర్మికుల క నీస వేతనాలను పెంచుతూ ప్రభు త్వం కీలక నిర్ణ యం తీసుకున్నట్టు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రక టిం చారు. కార్మికుల కనీస వేతనా ల పెంపు జూన్ 1వ తేదీ నుంచి అమలులోకి వస్తుందని తెలిపారు. క నీస వేతనాలు పెంచిన శుభ సంద ర్భంగా ముఖ్యమంత్రి కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తె లంగాణ రాష్ట్ర సచివాలయం లో ముఖ్య మంత్రి కార్మిక ఉ పాది శిక్షణ శాఖ మంత్రి డాక్టర్ గడ్డం వివేక్ వెంకట స్వామి ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మీడియా సమావేశంలో మా ట్లాడుతూ కార్మికులకు ఈ శు భవార్తను చెప్పారు. రాష్ట్రంలో కార్మికులను నాలుగు కేటగి రీలుగా విభజించి ఆ ప్రాతిపదికన వేతనాలను పెంచినట్టు తెలిపారు. అన్‌స్కిల్డ్, సెమీ స్కిల్డ్, స్కిల్డ్, హైలీ స్కిల్డ్‌గా 4 వి భాగాలుగా విభజించినట్టు చెప్పారు.
ఈ విభాగాల కార్మికులకు గతంలో అర్బన్, రూరల్‌గా 2 జో న్లు ఉం డే వని, వాటిని ఇప్పుడు 3 జోన్లుగా విభజించామ న్నారు. మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, గ్రామీణ ప్రాంతాలను పరిగణలోకి తీసుకుని కనీస వేతనాలను నిర్ణ యించామని చెప్పారు.అన్‌స్కిల్డ్ కార్మికులకు ప్రస్తుత వేత నం రూ. 12,7 50 నుంచి రూ. 16 వేలకు, సెమీ స్కిల్డ్ కార్మి కులకు ప్రస్తుత వేతనం రూ. 13,592 నుంచి రూ. 17 వేల కు, స్కిల్డ్ కార్మికులకు రూ.13,772 నుంచి రూ. 18,500 ల కు, హైలీ స్కిల్డ్ కార్మికులకు రూ.14,607 నుంచి రూ. 20 వేలకు పెంచినట్టు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ పెంచిన వేతనాలు వచ్చే జూన్ 1వ తేదీ నుంచి రాష్ట్రం లో అమ లులోకి వస్తాయని పేర్కొన్నారు. కార్మికుల వేత నా ల పెంపుపై తెలం గాణ ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఈ విషయంలో ఎలాంటి ని ర్ణ యం తీసుకోలేదు. గత ప్రభు త్వ హయాంలో కార్మికుల వేతనాల పెంపు జరగలేదు. త ద్వా రా రా ష్ట్రంలోని 1 కోటి 11 లక్షల మంది కార్మికులు నష్ట పోయారని ముఖ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రజా ప్ర భు త్వం అధికారం చేపట్టిన తర్వా త ఎన్నో ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతన సవరణపై ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క నేతృత్వంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు , వివేక్ వెంకటస్వా మితో మంత్రివర్గ ఉపసం ఘం ని యమించిన విషయాన్ని గుర్తుచేశారు.
కార్మిక సంఘాలు, నాయకులు, ఆ యా సంస్థల యాజమా న్యాలు, ఇ తర స్టేక్‌హోల్డర్స్ అందరితో సంప్రదింపులు జరిపి అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న తర్వాత వేతన సవ రణపై నిర్ణయం తీసుకు న్నామని చెప్పారు. తెలంగాణ ఏ ర్పడిన తర్వాత కార్మికుల సంక్షే మం కోసం మొట్టమొద టిసారి ఈ నిర్ణయం జరిగిందంటూ సంతోషం వ్యక్తం చేశా రు. ద్రవ్యోల్బణం, నిత్య వసర వస్తువుల పెరుగుదల, ఇంటి అద్దె వంటి అనేక అంశాలను పరిగ ణలోకి తీసుకుని కార్మి కుల శ్రేయ స్సు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసు కుంది. ఈ నిర్ణయం వల్ల రాష్ట్రంలోని 1 కోటి 11 లక్షల కార్మి కులకు ప్రయోజనం చేకూరుతుంది. ఇది కార్మికులకు శుభ వార్త” అని ముఖ్యమoత్రి పేర్కొన్నారు.
అనేక దేశాల్లో స్కిల్డ్ లేబర్ కొరత ఉందని, విదేశాలకు వెళ్లా లనుకునే వారికి ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేయా లని భావిస్తున్నట్టు తెలిపారు. ఏజెంట్ల చేతుల్లో కార్మి కులె వరూ మోసపోవద్దని హెచ్చరించారు. ముఖ్యంగా గల్ఫ్, ప శ్చిమాసియా దేశాలకు వెళ్లే వారికి ప్ర త్యేకంగా శిక్షణ ఇచ్చి, అక్కడి కంపెనీలతో సంప్రదింపులు జరిపి వారికి ఏం కా వా లో అందుకు అనుగుణంగా ఇక్కడి నుంచి కార్మికులను పం పించే ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.
ప్రభుత్వం కార్మి కు లకు అ న్ని రకాలుగా రక్షణగా ఉంటుం దని, తొందర్లోనే మరిన్ని మంచి ప్రతిపాదనలతో ప్రభుత్వం ముందుకొస్తుందని చెప్పారు.గతంలో ప్రమాదవశాత్తు గల్ఫ్ దేశా ల్లో ఎవరైనా మరణిస్తే మృతదేహా న్ని కూడా తీసుకొ చ్చే పరిస్థితి ఉం డేది కాదని, ప్రజా ప్రభుత్వం అధికారం చే పట్టిన తర్వాత వారి అం డగా నిలవడమే కాకుండా ఆ కు టుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తున్నా మని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.




