OpinionPoliticsక్రైంతెలంగాణనల్గొండసూర్యాపేట జిల్లాహైదరాబాద్

Cm Revanth Reddy: బిగ్ బ్రేకింగ్, నల్లగొండలో సీఎం రేవంత్ రెడ్డి హవా, హామీల వర్షం, విపక్షాలపై విమర్శల జడివాన

 

Cm Revanth Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి పర్యటన ఉత్కంఠభ రితంగా సాగింది. డిప్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రు లు ఉత్తమ్ కుమా ర్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిలతో కలిసి ఆయన నల్లగొండలో ప లు అభివృద్ధి పనులకు శంకుస్థాప నలు చేశారు. ఈ సందర్భంగా ఏ ర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ పై తనదైన శైలిలో నిప్పులు చెరి గారు. అభివృద్ధి పనుల జాతర నల్లగొండ జి ల్లాను అభివృద్ధి పథం లో నడిపించేందుకు ప్రభుత్వం గట్టి పట్టుదలతో ఉన్నట్లు ఈ పర్యటన ద్వారా స్పష్టమైంది. కన గల్ మార్కె ట్ యార్డ్ ప్రాంగణంలో “హైబ్రిడ్ యాన్యుటీ మో డ్ (HAM)” రోడ్ల పైలాన్‌ను సీఎం ఆవిష్కరించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా రూ. 13,000 కోట్లతో 5,300 కిలో మీటర్ల మేర రోడ్లను నిర్మించనున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల భాగస్వా మ్యంతో మొత్తం రూ. 90,000 కోట్లతో రోడ్ల నెట్‌వర్క్‌ను పటిష్టం చేయబోతున్నట్లు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రకటించారు.

నల్లగొండ ఎన్.జీ. కాలేజీ గ్రౌండ్స్‌లో టియూఎఫ్ఐడిసి (TU FIDC) ఆ ధ్వర్యంలో రూ. 83 కోట్లతో చేపట్టనున్న మొదటి దశ తాగునీటి ప థకానికి సీఎం శంకుస్థాపన చేశారు. నల్ల గొండ జిల్లా మహిళా స మాఖ్యకు రూ. 172 కోట్ల విలు వైన చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా పంపిణీ చేశారు. ప్రాజె క్టులపై డెడ్‌లైన్ ఈ ప్రాంత ప్రజల చిరకాలవాంఛలైన సాగునీరు, ప ర్యావరణ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం స్ప ష్టమైన కాలపరిమితిని విధించిందన్నారు.


    ఆగస్టు 2028 నాటికి SLBC

ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్, డిం డి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు లను 20 28 ఆగస్టు నాటికి వందకు వంద శాతం పూర్తి చేసి తీరుతామని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, డిప్యూటీ సీ ఎం భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. మూసీ నది కాలు ష్యం నుండి నల్లగొండ ప్రజలను కా పాడుతానని సీఎం హామీ ఇ చ్చారు.ఎవడు అడ్డు వచ్చినా సరే, మూసీలో తొక్కుకుంటూ వెళ్తానని శుభ్రం చేసి తీరుతామని సీఎం రే వంత్ రెడ్డి సంచ లన వ్యాఖ్యలు చేశారు.


   బీఆర్ఎస్ పీఠం కదులుతోంది

బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గత ప్రభుత్వంపై, కేసీ ఆర్ కుటుంబంపై తీవ్రస్థాయిలో విమర్శ లు గుప్పించారు. తన మార్కు “ఇందిరమ్మ రాజ్యాన్నకి”, గత పాలకుల తీరు కు ఉన్న తేడాలను ప్రజలకు వివరించారు బీఆర్ఎస్ నా యకులను రాజకీ యంగా ఉప్పు పాతర వేశామని, వాళ్లను మళ్లీ మొలవనివ్వబోమని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. “బీఆర్ఎస్ అనేది ఇక గతం, వాళ్లకు మళ్లీ పదవులు రావ న్నారు. త్యాగాలు వర్సెస్ ఫార్మ్‌హౌజ్ పాలిటి క్స్ తెలంగాణ ఉద్యమం కోసం కో మటిరెడ్డి వెంకట్ రెడ్డి లాంటి వాళ్లు మం త్రి పదవులు త్యాగం చేస్తే, కే సీఆర్ కుటుంబం ఉద్యమం ముసుగులో ఫార్మ్‌హౌజ్ పాలిటిక్స్ చేసిందని మండిపడ్డా రు. 2014 లో రూ. 60 వేల కోట్లు ఉన్న రాష్ట్రాన్ని రూ. 6 ల క్షల కోట్ల అప్పులపాలు చేశారని ధ్వజమెత్తారు.

     సన్నబియ్యం ఛాలెంజ్

గతంలో బర్లకు పోసే దొడ్డు బియ్యం ఇస్తే ఇప్పుడు తమ ప్రభు త్వం ఏడాదికి రూ. 16,000 కోట్లు ఖర్చు చేస్తూ 3 కోట్ల మందికి సన్న బియ్యం ఇస్తోందని, ఇది చూసి ఓ ర్వలేక విపక్షాల కడుపు మసిమసి అవుతోందని ఎద్దేవా చేశారు. బీ ఆర్ఎస్, బీజేపీలకు సీఎం రేవంత్ రెడ్డి ఒక బహిరంగ సవా ల్ విసిరారు.మా మూడేళ్ల పాలన.. మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన, 12 ఏళ్ల బీజేపీ మాటలపై ప్రత్యేక అసెంబ్లీ సమా వే శాలు పెడదాం, చర్చకు మీరు సి ద్ధమా అని సవాల్ చేశారు. తాము పేద ప్రజల సంక్షేమమే అజెండాగా ముందుకెళ్తు న్నా మని,2028 నుం డి 2034 వరకు కాంగ్రెస్ ప్రభుత్వమే అధి కారంలో ఉంటుందని, తెలంగాణను దేశంలోనే నంబర్ వన్‌ గా నిలబెడతానని సీఎం రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మా ట్లాడుతూ “గత ప్రభు త్వం రోడ్లను పూర్తిగా పట్టించుకోలేదు. మిషన్ భగీరథ పేరు తో స్కామ్‌లు చేశారు. నల్లగొండ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కో సం, AMRP కెనాల్ లైనింగ్ కోసం మరో రూ. 500 కోట్లు ఇ వ్వాలని సీఎంను కోరుతున్నా. వచ్చే ఎన్నికల్లో నల్లగొండ లోని 12 స్థానాలనూ కాంగ్రెస్‌కే అందిస్తామని చెప్పారు.

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మా ట్లాడుతూ “నాగార్జునసాగ ర్‌ను ఆ ధునీకరిస్తాం. బస్వాపూర్, గంధ మళ్ల ప్రాజెక్టులను త్వరలోనే పూర్తి చేస్తామన్నారు. MP రఘువీర్ రెడ్డి మాట్లా డుతూ సాగర్ HLC, L LC లింక్ కెనాల్స్ పూర్తి చేయాలని, డిండి లిఫ్ట్ స్కీ మ్ కోసం నాగర్‌ క ర్నూల్ జిల్లాలో భూసేకర ణకు అందరూ సహకరించాలని కోరారు.

Related Articles

Back to top button