CM Revanth Reddy : సీఎం రేవంత్ రెడ్డి కీలక ఆదేశం, పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టుల పనులను మరింత వేగవంతం చేయాలి

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: రా ష్ట్రం లో తలపెట్టిన పర్యాటక అభివృద్ధి ప్రాజెక్టులకు సంబం ధిం చి నిర్దేశించుకున్న పనులను వేగవంతం చేయడానికి ప ర్యా టక శాఖపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి స మావేశంలో సమీక్షించారు. హైదరాబాద్ కోర్ అర్బన్ ఏరి యా పరిధిలో ఉన్న అటవీ శాఖ భూములను పర్యాటక శా ఖతో కలిసి ఎకో టూరిజాన్ని అభివృద్ధి చేయాలని అధి కా రులను ఆదేశించారు. ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలోని బోధి పెవి లియన్‌లో జరిగిన ఈ స మావేశంలో సీఎం సలహాదా రు కె. రామకృష్ణారావు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, పర్యాటక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వాణి ప్ర సాద్ తో పాటు ఇ తర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
భారత్ ఫ్యూచర్ సిటీ పరిధిలోని అటవీ భూముల్లో అంతర్జా తీయ స్థాయిలో పర్యాటక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని ము ఖ్యమంత్రి చెప్పారు. గుర్రంగూడ ఎకో పార్క్ తరహాలో నగ రంలో ఎకో పార్కులుగా తీర్చిదిద్దాలని సూచించారు.
నగరంలోని పర్యాటక ప్రాంతాలను మరింతగా తీర్చిదిద్దాల ని, తారా మతి బారాదరి మరింత ఆకర్షణీయంగా అభివృద్ధి చేయాలని చెప్పారు. దుర్గం చెరువును పూర్తి స్థాయి పర్యా టక ప్రాంతంగా తీర్చిదిద్దాలని తెలిపారు. మంజీరా, దిల్ కు షా అతిథి గృహాలను అధునికీక రించాలని ఆదేశించారు. టూరిజం హబ్ డెవలప్మెంట్ పథకం కింద వి కారాబాద్‌ను అభివృద్ధి చేయాల ని, ప్రధానంగా వికారాబాద్‌లోని శ్రీ వీర భద్రస్వామి దేవాలయాన్ని అ భివృద్ధి చేయాలని చెప్పారు. యా దగిరిగుట్ట తరహాలో దేవస్థానానికి పాలక మండలిని ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
క్యూర్ పరిధిలో అర్బన్ ఫారెస్ట్ తర హాలో ఎకో టూరిజం ప్రా జెక్టులను అభివృద్ధి చేయాలని, అందుకోసం ప్రత్యేక అధికా రులను నియమించి పనులను ముమ్మరం చేయాలని చె ప్పారు.నగరంలో పురానాపూల్ వంటి వారసత్వ సంపదగా నిలిచి న బ్రిడ్జిలను అభివృద్ధి చేసి పర్యా టక ప్రాంతాలుగా తీర్చిదిద్దాలని, అందుకు అవసరమైన ప్రణాళికలు రూపొం దించి అమలు చేయాలని ఆదేశించారు. అభివృద్ధి చేసిన త ర్వాత అవసరమైతే ట్రాఫిక్‌ను మరో మార్గం నుంచి మళ్లిం చి పర్యా టకులకు అవకాశం కల్పించాలని సూచించారు. పర్యాటక రంగంలో పెట్టుబడులకు సంబంధించి అధికారు లను ఆరా తీసిన ముఖ్యమంత్రి వచ్చే డిసెంబర్‌లో నిర్వ హించే గ్లోబల్ ఇన్వెస్ట్‌మంట్ సమ్మిట్‌పై కసరత్తును ప్రారం భించాలని చెప్పారు. ఈ సమ్మిట్ కోసం వివిధ శాఖల మధ్య సమన్వయం కోసం ఉన్నతస్థాయి కమిటీలను ఏర్పాటు చే యాలని అధికారులకు తెలిపారు.





