Praja Deveena
Newspaper Banner
Date of Publish : 12 August 2026, 3:33 pm Posted by : praja deveena

CM Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్య, మిల్లర్ల నుంచి బకాయిలు నయాపైసా సైతం వ సూలు చేయాల్సిందే 

CM Revanth Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: భవి ష్యత్తు దిశగా అడుగులు వేస్తూ తెలంగాణ వ్యవసాయ, పౌ రసరఫరాల రంగంలో నవశకా నికి నాంది పలికే నిర్ణయాలు వెలువడ్డా యి. సాంకేతికత, ఆధునిక వ్యూ హాలు మరియు మహిళా సాధికారత కలగ లిపిన ఒక సమగ్ర కార్యాచరణను రాష్ట్ర ముఖ్యమం త్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు.

మిల్లర్ల పాత బకాయిల పెంపునకు చుక్కెదురు వేస్తూ, ప్రతీ ధాన్యం గింజకు సంబంధించిన లెక్క తేల్చాల్సిందేనని ప్రభు త్వం స్పష్టం చేసింది.వ్యాపార దృక్ప థంతో నడిచే మిల్లర్లకు ప్రోత్సా హం అందిస్తూనే, ఉద్దేశపూర్వ కంగా ఎగవేసే వారిపై చట్టపరమై న విప్లవాత్మక చర్యలకు సిద్ధమయ్యారు. బకా యిల వసూలు కో సం పక్కా ప్రణాళికతో విధివిధానాలు రూపొందించి, త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి సమ ర్పించనున్నారు.

‘మహిళాసంఘాల’ చేతుల్లోకి రైస్ మిల్లింగ్ బాధ్యతలు

గతంలో ఎన్నడూ లేని విధంగా, మొండి బకాయిదారులుగా మారిన మిల్లర్ల నెట్‌వర్క్‌ను పక్కన పెట్టి, ఆధాన్యం కేటా యింపులను నేరుగా స్వయం సహాయక సంఘాల (SHG) కు అప్పగించబోతున్నారు. దీనివల్ల గ్రామీణ మహిళా సాధి కారత సరికొత్త శిఖరాలకు చేరుకోనుంది.

   ధాన్యం నిల్వలో నయాటెక్నాలజీ

ధాన్యం నిల్వ సమస్యలకు శాశ్వ త పరిష్కారం చూపేందు కు ఫ్యూ చరిస్టిక్ ‘సైలో బ్యాగ్’ సాంకేతిక తను పైలట్ ప్రాజె క్టుగా అమలు చేయనున్నారు. నల్గొండ, సూ ర్యాపేట, నిజా మాబాద్, పెద్దప ల్లి, కామారెడ్డి జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు.SHG ల ఆధ్వర్యంలో ఈ మోడ్ర న్ సైలో ప్రాజెక్టుల కోసం ఒక్కో ని యోజకవర్గానికి 50 నుండి 100 ఎకరాల భూమి కేటాయించను న్నారు. రెవెన్యూ, పౌరసరఫరా లు, మహిళా సంక్షేమ శాఖల మంత్రులతో దీనిపై త్వరలోనే కీలక సమావేశం జరగనుంది.

  జర్మన్ టెంట్లు, హైటెక్ నిల్వ కేంద్రాలు

భవిష్యత్తులో ధాన్యం ఎక్కడా పాడవకుండా వినూత్న నిల్వ పద్ధతులను అందుబాటులోకి తెస్తున్నారు. VB-G-RAM-G పరిధిలో విశాలమైన ప్లాట్‌ఫామ్‌ లు నిర్మించి, జర్మన్ టెంట్ల తో రక్ష ణ వ్యవస్థను ఏర్పాటు చేయను న్నారు. ప్రైవేటు గోదాములు, కల్యాణ మండపాలు, పాత థియేటర్లు మరి యు షెడ్లను ముందు గానే గుర్తించి లీజుకు తీసుకునే కా ర్యాచరణ సిద్ధమైంది.

ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కు మార్‌రెడ్డి, సీఎం ప్రిన్సిపల్ సెక్రటరీ వి. శేషా ద్రి , పౌరసరఫ రాల సంస్థ కమిష నర్ స్టీఫెన్ రవీంద్ర, సౌత్ ఇండియా రైస్‌ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తూడి దేవేందర్ రెడ్డి మరి యు ఇతర శాఖాధికారులు ఎంసీఆర్‌హెచ్ఆర్‌డీ (MCRH R D) సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.