CM Revanth Reddy : కేంద్ర బడ్జెట్‌లో నై ‘ తెలంగాణ’
--కక్ష పూరిత వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది --అవకాశమున్న అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం --మీడియా సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి
కేంద్ర బడ్జెట్‌లో నై ‘ తెలంగాణ’
–కక్ష పూరిత వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది
–అవకాశమున్న అన్ని రూపాల్లో నిరసన తెలియజేస్తాం
–మీడియా సమావేశం లో సీఎం రేవంత్ రెడ్డి
ప్రజా దీవెన, హైదరాబాద్: కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యా యం జరిగిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ( CM revanth re ddy) నిరసన వ్యక్తం చేశారు. అసలు కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ లేనేలేదని విచారం వ్యక్తం చేశారు. తెలంగాణ పట్ల పూర్తి వివక్షను ప్రద ర్శించారని, పూర్తిగా కక్ష పూరితంగా వ్యవహరించారని, బడ్జెట్ లో తెలంగాణ అనే పదాన్ని నిషేధించారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ రకంగా కక్ష పూరితంగా వ్యవహరించడం చరిత్రలో ఎప్పుడూ జరగలేదని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారా మన్ (nirmala sitharaman) పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై మంత్రివర్గ సహచరులతో కలిసి ముఖ్యమంత్రి మీడియా సమావే శంలో పై విధంగా స్పందించారు.
తెలంగాణ ( telangana) పట్ల ప్రద ర్శించిన వివక్షపై అసెంబ్లీలో చర్చ చేపట్టి ప్రభుత్వ నిరసనను కేంద్రా నికి తెలియజేస్తామని చెప్పా రు. వికసిత్ భారత్ ( vikasith Bhara th) లో తెలంగాణభాగం కాదని కేంద్రం భావిస్తున్నట్టు తాజా వైఖరిని బట్టి స్పష్టమవుతోందన్నా రు. తెలం గాణ అభివృద్ధికి నిధులు ( devel opment funds) ఇవ్వాలని స్వయంగా మూడుసార్లు ప్రధాన మంత్రిని కలిసి కోరామ ని చెప్పారు.
వివక్ష లేని, వివాదాలు లేని, కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సం బంధా లు కలిగి అభివృద్ధికి సహకరించాలని కోరామని, కానీ బడ్జెట్‌లో తెలంగాణ అనే పదాన్నే నిషేధించారంటూ ఆందోళన వ్యక్తం చేశా రు.ఇతర రాష్ట్రాల కేటాయింపులపై తమ కెలాంటి అభ్యంతరాలు లేవని విభ జన చట్టంలో పొందుపరిచిన మేర కు ఆంధ్రప్రదేశ్‌కు ( andhraprad esh) నిధులు కేటాయించినప్పుడు అదే చట్టంలో పేర్కొన్న తెలంగాణ అంశాలపై ఎందుకు వివక్ష చూపించారు,
ఎందుకు నిధులు కేటాయించలేదని దక్షిణాది రాష్ట్రా ల పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శి స్తోందని ఆరోపించారు. ఆ వివక్షపై దక్షిణాది రాష్ట్రాల ( south states)తో కలి సి పోరాటం చేస్తామని, కలిసొచ్చే ప్రభు త్వాలతో మా వైఖరిని కేంద్రానికి స్పష్టంగా చెబుతామని అన్నారు. తెలంగాణకు ప్రధానంగా బయ్యారం ఉక్కు కర్మాగారం, కాజి పేట కోచ్ ఫ్యాక్టరీ, గిరిజన యూని వర్సిటీకి నిధులు, ఐఐఎం ఏర్పాటు ఉసే లేదని స్పష్టం చేశారు.
రివర్ ఫ్రంట్ డెవలప్ మెంట్‌కు నిధులు, రీజినల్ రింగ్ రోడ్డు ( rrr), మెట్రో విస్తరణ, పాలమూరు, రంగారెడ్డి ప్రాజెక్టు, వరంగల్ ఎయిర్ పోర్ట్, మరుగున పడిన ఐటీఐఆర్ ప్రాజెక్టు పునరుద్ధరణ, రైతులకు ప్రత్యేక కార్యాచరణ, వైద్య ఆరోగ్యం, విద్య, ఉపాధి కల్పనలో తెలం గాణకు ఏవీ ఇవ్వలేదన్నారు.
ప్రతి రాష్ట్రంలో ఐఐఎం (iim) ఏర్పాటు చేయాలని సంక ల్పించిన నేపథ్యంలో తెలంగాణలో ఐఐఎం ఏర్పాటు చేయాలని స్వయంగా ప్రధానమంత్రి కలిసి విజ్ఞప్తి చేశా మని, కానీ తెలంగాణకు ఐఐఎం ఇవ్వబోమని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ లేఖ రాశారన్నారు. ఎందుకు ఇవ్వరు, ఎందుకింత వివక్ష అంటూ నిరసన వ్యక్తం చేశారు.
రాష్ట్రానికి జరిగిన అన్యా యంపై ఇక్కడి నుంచి ప్రాతినిథ్యం వహిస్తు న్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ( kishan reddy) స్పందించాలని డిమాండ్ చేశారు.ఈ వైఖరి ఏమా త్రం సమంజసం కాదని, సహేతు కం కాదని, మా నిరసనను కేంద్రానికి తెలియజేస్తామని ముఖ్య మం త్రి పేర్కొన్నారు. మీడియా సమావేశంలో మంత్రులు దామోదర్ రాజ నర్సింహ, పొన్నం ప్రభాకర్ గౌడ్, పొంగు లేటి శ్రీనివాస్ రెడ్డి, దుద్దిల్ల శ్రీధర్ బాబు, సీతక్క, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి తది తరులు పాల్గొన్నారు.
CM Revanth Reddy