Praja Deveena
Newspaper Banner
Date of Publish : 05 April 2026, 12:41 pm Posted by : praja deveena

Cm Revanth Reddy : బిగ్ బ్రేకింగ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, 2027 ఏడాది డిసెంబర్ నాటికిహైకోర్టు భవన సముదాయాల నిర్మాణాలు పూర్తి

 

Cm Revanth Reddy :  ప్రజా దీవెన, హైదరాబాద్: 2027 డిసెంబర్ నాటికి తెలంగాణ హైకో ర్టు నూతనభవన సము దాయాల నిర్మాణాలను పూర్తి చేస్తామని ము ఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటిం చారు. హైకోర్టు కొత్త భవనసము దాయ నిర్మాణంతో పాటు రాష్ట్రం లోని వివిధ నగరాలు, పట్టణాల్లో 49 కోర్టులు, నివాస భవనాలని ర్మాణ ప్రాజెక్టులను కూడా చేపడు తున్నట్టు చెప్పారు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్‌లో తెలంగాణ రా ష్ట్ర హైకోర్టు జోన్-II నూతన భవన ని ర్మాణ పనులకు సుప్రీంకోర్టు ప్రధా న న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్ శంకుస్థాపన చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి పా ల్గొన్నారు. ముఖ్యమంత్రితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూ ర్తులు జస్టిస్ పి ఎస్ నరసింహ, జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టి స్ ఎస్ వెంకటనారాయణ భట్టి, జస్టిస్ అలోక్ ఆరాధే, తెలం గాణ హైకోర్టు ప్రధాన న్యాయమూ ర్తి జస్టిస్ అపరేష్ కుమా ర్ సింగ్ తో పాటు ఇతర న్యాయకోవిదులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చే సిన వ్యాఖ్యలు ఆయన మాట ల్లో నే..“2023 డిసెంబర్‌ లో మాప్రభుత్వం ఏర్పడిన ప్పుడు తీసుకున్న మొదటి నిర్ణయాల్లో హైకోర్టుకు కొత్త భవ న సముదాయాన్ని నిర్మిం చాలన్న నిర్ణయం ఒకటి. అందు కో సం రాజేంద్రనగర్‌లో 100 ఎకరా ల కు పైగా భూమిని కే టాయించాం. భవనాల కోసం జోన్-1లో ఇప్పటికే ప్రారం భించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ రోజు జో న్- 2లో నివాస భవనాలకు ఈరోజు శంకుస్థాపన చేసుకు న్నాం. వీటి ని ర్మాణాలను డిసెంబర్ 2027 నా టి కి పూర్తి చేయాలని మా ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని చెప్పారు.

న్యాయవ్యవస్థకు అత్యుత్తమ సౌకర్యాలు అందించడం కా ర్యనిర్వా హక విభాగం బాధ్యతగా భావిస్తు న్నాం. ఇక్కడ నిర్మించబోయే భవ నం దేశంలోనే అతిపెద్ద హైకోర్టు స ము దాయాల్లో ఒకటిగా మాత్రమే కాకుండా, ఆధునికత, మౌలిక వసతుల పరంగా ఒక ప్రమాణంగా నిలుస్తుంది. ప్రజాస్వా మ్యంలో శాస న, కార్యనిర్వాహక, న్యాయ వ్యవస్థలు పర స్పర ఆధారపడి, గౌరవం తో పనిచేస్తాయి. సాధారణ పౌరు డు న్యాయం కోసం చివరగా ఆశ్రయించేది న్యాయస్థానాన్నే. అలాం టి న్యాయస్థానానికి కావలసిన భవన నిర్మాణ శంకు స్థాపన కార్యక్ర మంలో పాల్గొనడం జీవితంలో నాకు లభిం చిన ఒక గొప్ప అవకాశంగా భావిస్తామాని అన్నారు.

కొత్తగా నిర్మించే హైకోర్టు సమాజా నికి, ప్రజాస్వామ్యానికి ఒక ప్రతీక గా నిలుస్తుంది. ఇది పేదలు, బల హీనులు న్యా యం కోసం వచ్చే వా రికి వేదికగా నిలుస్తుంది. రాబోయే వంద సంవత్సరాల పాటు పేదలు, బలహీనులు, అణగారిన వర్గాలు న్యాయం కోసం ఈ మందిరానికి వస్తారు. దేశంలో ఒక దేవాలయం, మసీదు, చర్చి, గురుద్వారా నిర్మిం చడం గొప్ప విషయం. కానీ ఒక కో ర్టు సముదాయం నిర్మించడ మంటే, అందుకోసం ప్రత్యేకంగా ప్రాంగణం సృష్టించడమం టే, దీన్ని ప్రజలంద రి కోసం నిర్మించే ఒక పవిత్ర ఆల యంగా భావిస్తామని ముఖ్యమం త్రి చెప్పారు.

 

ఇదొక ప్రత్యేకమైన సందర్భం. భా రతదేశంలోని అగ్రశ్రేణి న్యాయమే ధావులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడం గౌ రవంగా ఉంది. ఇలాంటి సందర్భం చాలా అరుదుగా వస్తుం ది. దేశంలోనే అతిపెద్ద హైకోర్టు భవన సముదాయమే కా కుండా అ త్యున్నత ప్రమాణాలు, మౌలిక స దుపాయాలతో నిర్మిస్తున్నాం. ఈ భవన సముదాయం కేవలం నిర్మాణం కా దు. ఇది మా ప్రభుత్వ ప్ర జాస్వామ్య విలువలకు ప్రతిబిం బం. అన్ని వ్యవస్థలు పరస్పర గౌర వంతో, సహకారంతో ప నిచేయాలని మేం విశ్వసిస్తాం.న్యాయవ్యవస్థ పట్ల మా ప్ర భుత్వం అత్యున్నత గౌరవాన్ని ఇస్తుంది.

ఇది హైదరాబాద్‌కు ఒక సుదినం. వచ్చే శతాబ్దం కోసం ఒక అద్భుత మైన భవనాన్ని, ప్రజా జీవితానికి ఒక కీలకమైన స్థంభాన్ని నిర్మించ డానికి ఒక అడుగు వేస్తున్న సం ద ర్భం. న్యాయకోవిదులందరితో క లి సి ఇక్కడ ఉండటం అదృ ష్టంగా భా విస్తున్నామని ముఖ్యమంత్రి అన్నారు.