OpinionPoliticsజాతీయంతెలంగాణనల్గొండహైదరాబాద్

CM Revanth Reddy Jamili Elections : సీఎం రేవంత్ కీలకవ్యాఖ్య, పునర్విభజన ప్రక్రియ జీఎస్‌డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌ లో జరగాల్సిందే

 

CM Revanth Reddy Jamili Elections : ప్రజా దీవెన, హైదరాబాద్: దేశంలో నియోజకవర్గాల సీట్ల పెంపు, పున ర్విభజన ప్రక్రియ జీఎస్‌ డీపీ ఆధారిత హైబ్రీడ్ మోడల్‌ లో జరగాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి డి మాండ్ చేశారు. చట్టసభల్లో మ హిళలకు 33 శాతం సీట్ల రి జర్వే షన్లను త క్షణమే అమలు చే య డానికి సంపూర్ణ మ ద్దతునిస్తాం. కా నీ లోక్‌సభ, అసెంబ్లీ నియోజక వర్గాల పెంపునకు కేంద్రం ప్ర కటించిన ప్రాతిపదిక దేశంలోని ఉత్తర, ద క్షిణాది రాష్ట్రాల మధ్య అంతరం పెంచడమే కాకుండా దేశానికి ప్రమాదకరం గా మారుతుందని హెచ్చరించారు. అందుకు ప్రతిగా ము ఖ్యమంత్రి జీఎస్డీపీ (GSDP) ఆధారిత హైబ్రీ డ్ మోడల్‌ను ప్రతిపా దించారు. ప్రస్తుత 543 లోక్‌సభ స్థా నాల్లో పెంచా లనుకుంటున్న 50 శాతం అంటే 272 స్థానా ల్లో 136 సీట్ల ను ప్రొరేటా ప్రకారం, మిగిలిన 136 సీట్లను జా తీయ స్థూల ఉత్ప త్తి ప్రాతిపదికన విభజించి అత్యధిక శాతం అందిస్తు న్న రాష్ట్రాలకు ప్రాధాన్యతనివ్వాలని ప్రతిపా దించారు.

ఈ నెల 16 నుంచి నిర్వహించే పా ర్లమెంట్ ప్రత్యేక సమావే శాల్లో మ హిళలకు 33 శాతం రిజర్వేషన్లతో పాటు నియోజ కవర్గాల పెంపు బి ల్లును హడావిడిగా ఆమోదించాలని ప్ర యత్నిస్తున్నారు. చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు, ని యోజకవర్గాల సంఖ్య పెంపు పునర్విభజన రెండింటినీ ఒ కటిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

ఈ రెండు వేర్వేరు అంశాలు. ఒక దానికి ఇంకొకటి సంబం ధం లేదు. రెండూ వేటికవే చాలా ప్రాధాన్యత కలిగిన అంశా లు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే విష యం లో మాకు ఎలాంటి అభ్యంత రం లేదని స్పష్టం చేశారు.“కానీ ఎ లాంటి ప్రాతిపదిక లేకుండా ఏకప క్షంగా లోక్‌సభ, రాష్ట్రా ల అసెంబ్లీ ల్లో ప్రస్తుతం ఉన్న సీట్లకు దామా షా ప్రకారం 50 శాతం లెక్కన ని యోజకవర్గాల సంఖ్యను పెంచితే దక్షిణాది రాష్ట్రాలు వివక్షకు గుర వుతాయి. ఈ ప్రక్రియ వల్ల దేశంలో అనవసరమైన గందరగోళం ఏర్ప డుతుంది. కొన్ని చిన్న రా ష్ట్రాల మ నుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుందని ఆం దోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం తీసుకున్న నిర్ణయానికి ఎ లాంటి ప్రాతిపదిక తీసు కోలేదు. ని యోజకవర్గాల పెంపుపై ముందుగా విధివిధానా లు ఖరారు చేయాలి. అఖిలపక్ష సమావేశం నిర్వహించా లి. అందరి అభిప్రాయాలు తీసుకో వాలి. రాష్ట్రాల శాసనసభల అభి ప్రాయాలను తెలుసుకోవాలి. ఈ అంశంపై నిపుణుల కమిటీని నియమించాలి. నిపుణుల కమిటీ నివేదికపై పార్ల మెంట్‌లో చర్చించి నిర్ణ యం తీసుకోవాలని సూచించారు. నియోజకవర్గాల పెంపు – పునర్వి భజనకు సంబంధించి కేంద్రం తా జా నిర్ణయంపై ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమా ర్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట రెడ్డి, పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ధనసరి అనసూ య సీతక్క, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు కేశవరా వు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి డా క్టర్ బీఆర్‌ అంబేద్కర్‌ రాష్ట్ర సచివాలయంలో ఏర్పాటు చేసిన మీడి. యా సమావేశంలో మాట్లాడారు.

ఈ సందర్భంగా సీఎం చేసిన వ్యా ఖ్యలు ఆయన మాటల్లోనే.. ని యోజకవర్గాల పెంపు (డీలిమిటే ష న్) ప్రక్రియ దేశ ప్రజలకు సంబం ధించిన అంశం. దేశ భవిష్యత్తు ముడిపడి ఉన్న అంశం. ఈ విష యాల్లో కేంద్ర ప్రభుత్వ హడావిడి నిర్ణయం వల్ల ప్రజలకు నష్టం జరు గుతుంది.మహిళలకు రిజర్వేషన్ల విషయంలో మాకు ఎలాంటి అ భ్యంతరాలు లేవు. నూటికి నూరు శాతం సంపూర్ణంగా మద్దతునిస్తు న్నాం. 2023 లోనే ఈ బిల్లు ముం దుకొచ్చినప్పుడు సంపూర్ణంగా మ ద్దతునిచ్చాం. 2026 లో చేపట్టే జ నాభా లెక్కల తర్వాత అన్న చిన్న అడ్డంకిని అప్పుడే సవరించి, 33 శాతం రిజర్వేషన్లను అమలు చేసి ఉంటే ఆ తర్వాత జరిగిన అనేక ఎ న్నికల్లో ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో మహిళలకు అవకాశాలు దక్కి ఉం డేవి.

2023 లో మహిళా రిజర్వేషన్ బి ల్లు పార్లమెంట్‌ ఆమోదం పొందిన ప్పుడు ఆ తర్వాత జరిగే జనాభా లెక్కల అనంత రం అమలులోకి వ స్తుందని, ఇప్పుడు అలా కాకుండా ముం దే చేయాలనుకుంటే అభ్యం తరం లేదు. కానీ అదేదో 2024 ఎ న్నికల్లోనే అమలు చేసి ఉంటే 543 లోక్‌సభ స్థానాల్లో 33 శాతం (181 మంది మహిళా ఎంపీ లు) ఎంపిక కావడానికి అవకాశం ఉండె. ఆ త ర్వాత పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎ న్ని కలు కూడా జరిగాయి. వాటిల్లో నూ మహిళా ప్రతినిధులు ఎంపిక య్యేవారని ముఖ్య మంత్రి విశ్లేషిం చారు.ఒకవైపు జనాభా లెక్కల సేక రణ ప్రక్రియ ఇ ప్పటికే మొదలైంది. 2028 నాటికి ఈ ప్రక్రియ అంతా పూర్త వుతుంది. ప్రస్తుతం జరుగు తున్న జనాభా లెక్కలు ప్రక్రియ ను పక్కన పెట్టి, మహిళా రిజర్వేషన్లు, నియోజకవర్గాల పెం పు రెండింటినీ కలిపి ఒక గాటన కట్టి తెరమీదకు తేవడం సరైంది కాదు.

మహిళా రిజర్వేషన్లతో నియోజక వర్గాల పునర్విభజన కూ డా కలిపా రు. ఈ పరిణామాలు దేశంలో రాజ కీయ అస మానతలు, వివక్ష పెంచు తుంది. దేశానికి అత్యంత ప్రమాద కరంగా మారుతుంది. జరుగుతు న్న పరిణామాలపై దక్షిణా ది రాష్ట్రా లతో పాటు ఢిల్లీ, పంజాబ్ లాంటి చిన్న రాష్ట్రా ల కు లేఖలు రాస్తాం” అని చెప్పారు.జనాభా ప్రాతిపదికన ని యోజకవర్గాల సంఖ్య నిర్ణ యం అంగీకరించబోమని దక్షిణా ది రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావే శంలో తీర్మానించాం. దాంతో ఇంకో రూపంలో దామాషా ప్రకారం 50 శాతం పెంచు తామని ముందుకు తెచ్చారు.

తాజా ప్రతిపాదనల మేరకు 20 స్థా నాలున్న కేరళంలో 50 శాతం పెం చితే ఆ రాష్ట్ర స్థానాలు 60 కి చేరు తాయి. అదే ఉత్తరప్రదేశ్ 80 స్థానా లు 120 కి చేరుతాయి. రెండింటి మధ్య అంతరం 90 స్థానాలవుతా యి. 50 శాతం పెంచడం వల్ల తె లంగాణకు యూపీకి మధ్య ఇప్పుడున్న వ్యత్యా సం కన్నా ఎక్కువగా 94 సీట్ల అంతరం పెరుగుతుం ది. 413 సీ ట్లున్న ఉత్తరాదిలో 50 శా తం సీట్లు పెంచడం వల్ల 621 కి పెరుగుతాయి. అంటే దక్షిణాదికి ఉ త్తరాదికి మధ్య సీట్ల అం తరం 412 నుంచి 620 కి పెరుగుతాయి.

దక్షిణాది రాష్ట్రాలకు తీరని విఘాతం. చిన్న రాష్ట్రాలు రాజ కీయంగా ద్వితీయశ్రేణి రాష్ట్రాలుగా మిగిలి పోతాయి.ఈ పరిణామాలు దేశ మనుగడకు మంచిది కాదు. ఇది రాజకీ య పార్టీలకు సంబంధించిన అంశం కాదు. దేశ ప్రజలకు సం బంధించిన అంశం. దక్షిణాది రాష్ట్రా లు ఆర్థిక రాజధా ను లుగా, ఉత్తరా ధి రాష్ట్రాలు రాజకీయ రాజధానులుగా మా రకూడదని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు దేశానికి ఆదా యం, ఉద్యోగ, ఉపాధి అవకాశా లు కల్పిస్తున్నాయి. అలాం టప్పు డు మమ్మల్ని ఎలా శిక్షిస్తారు. సు ప్రీంకోర్టు ఆదేశాల మేరకు విద్య, ఉ ద్యోగ అవకాశాల్లో 50 శాతం రిజ ర్వేషన్లు మించకూడదు. 50 శాతం మెరిట్ ప్రాతిపదికన ఇస్తున్నాం. ప న్నులు కట్టడం, సలామ్ చేయడ మన్న విధానాలకు వ్యతిరేకం” అని స్పష్టం చేశారు.

ఈశాన్య రాష్ట్రాలు, కేంద్రపాలి త ప్రాంతాల్లో జనాభా ప్రాతిప దికన సీ ట్ల కేటాయింపు జరగలేదు. వంద శాతం జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు జరగలేదు. ఆయా ప్రాంతా ల ప్రాతి నిధ్యం కోసమే ఈశాన్య రా ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఎంపీ సీట్లు ఇచ్చారని గుర్తుచేశా రు.రాజకీయంగా నంబర్ లేనప్పు డు చిన్న రాష్ట్రాలతో మాట్లాడే వా రే ఉండరు. బల హీనుడికి, బలవం తుడికి మధ్య ఒప్పందాలు జరగవు. ద్వి తీయ శ్రేణి పౌరులుగా మిగి లిపోవలసి వస్తుంది.సీట్లు పెం చాలనుకుంటే ఏ ప్రాతిపదికన, ఎన్ని పెంచాలన్నది అఖిలప క్ష సమావేశం ఏర్పాటు చేయాలి. గతంలో జ నాబా లెక్కల ప్రకారం 543 స్థానా లు చేశారు. దానిపై బ్లాంకెట్ గా 50 శా తం పెంచుతామని చెప్పడం సరి కాదు. దీర్ఘకాలంలో సమ స్యగా వి పత్తుగా మారుతుందని హెచ్చరించారు.

“హైబ్రీడ్ మాడల్‌లో 136 సీట్లు ప్రొ రేటా ప్రకారం ఇవ్వండి. ఇంకో 50 శాతం సీట్లు దేశం స్థూల ఆర్థిక ఉత్పత్తి ప్రాతిపది కన ఇవ్వాలని ఒక ప్రతిపాదన చేస్తున్నాం. దానిపై చ ర్చించి నిర్ణయం తీసుకోండి. దేశ అ భివృద్ధికి ఆర్థిక వనరులను స మకూర్చుతున్న అత్యధిక భాగస్వా మ్యం కలిగిన రాష్ట్రాల ప్రాతిపదిక న ఇవ్వాలని కోరుతున్నామని చె ప్పారు.50 శా తం దామాషా ప్రకా రం, మిగతా 50 శాతం జీఎస్డీపీ ప్రా తిపదికన ఇవ్వండి. ఏకాభిప్రాయానికి రండి.

మొదట మ హిళా రిజ ర్వేషన్లను ఆమోదించండి. నియో జకవర్గాలను పెంచడానికి నిపుణు ల కమిటీని నియమిం చండి. నివే దికను సభల్లో చర్చకు పెట్టండి. రాష్ట్రాల అసెం బ్లీల అభిప్రాయాలను తెలుసుకోండి.జనగణన కోసం ఇ ప్ప టికే నిర్ణయం తీసుకున్నందున అవి పూర్తయ్యే లోగా అంద రి అభిప్రాయాలు తీసుకుని ని యోజక వర్గాల పెంపు, పున ర్విభజన ప్రాతి పదికను నిర్ణయించండి. 2028 నా టికి ఈ ప్రక్రియ మొత్తం పూర్తవు తుంది. అనవసరమైన గందరగో ళానికి తెరలేపొద్దని ముఖ్యమంత్రి సవివరంగా చెప్పారు.

Related Articles

Back to top button